Visakha Agniveer Army Rally : నేటి నుంచి సెప్టెంబర్ 5 వరకు విశాఖలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ-visakhapatnam agniveer army recruitment rally conducted at port jubilee stadium ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Visakha Agniveer Army Rally : నేటి నుంచి సెప్టెంబర్ 5 వరకు విశాఖలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ

Visakha Agniveer Army Rally : నేటి నుంచి సెప్టెంబర్ 5 వరకు విశాఖలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ

Bandaru Satyaprasad HT Telugu
Aug 26, 2024 04:08 PM IST

Visakha Agniveer Army Rally : విశాఖపట్నంలో అగ్నివీర్ ఆర్మీ ర్యాలీ నేటి నుంచి ప్రారంభం అయ్యింది. సెప్టెంబర్ 5వ తేదీ వరకు నగరంలో రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. విశాఖ పోర్టు డైమండ్ జూబ్లీ స్టేడియంలో రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగుతోంది.

నేటి నుంచి సెప్టెంబర్ 5 వరకు విశాఖలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
నేటి నుంచి సెప్టెంబర్ 5 వరకు విశాఖలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ

Visakha Agniveer Army Rally : విశాఖలో అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి సెప్టెంబర్ 5 వరకు ఆర్మీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీకి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి అభ్యర్థులు హాజరవుతున్నారు. విశాఖ పోర్టు డైమండ్ జూబ్లీ స్టేడియంలో రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగుతోంది. ఆదివారం అర్ధరాత్రికే భారీగా అభ్యర్థులు విశాఖకు చేరుకున్నారు. నిన్న రాత్రి భారీగా వర్షం కురవడంతో ఫిజికల్ టెస్ట్ భాగంగా నిర్వహించే రన్నింగ్ ఈవెంట్ ను బీచ్ రోడ్డుకు మార్చారు. ఆర్మీ బస్సుల్లో అభ్యర్థులను బీచ్ రోడ్డుకు తరలించి రన్నింగ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. బ్యాచ్‌కు 100 మంది చొప్పున వదులుతూ 1600 మీటర్ల రన్నింగ్ నిర్వహించి, అభ్యర్థులను ఎంపికి చేస్తున్నారు.

విశాఖ బీచ్ రోడ్డులో 1600 మీటర్ల రన్నింగ్ క్వాలిఫై అయిన అభ్యర్థులను పోర్టు స్టేడియానికి తరలించి ఫిజికల్ టెస్ట్ లో ఇతర ఈవెంట్లు, పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి అభ్యర్థులు భారీగా హాజరవుతున్నారు. రోజుకు వెయ్యి మంది చొప్పున అభ్యర్థులకు ఎంపిక చేస్తున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఈ ర్యాలీలో ఎంపికైన అభ్యర్థులకు ఆర్మీ శిక్షణ ఇస్తారు. వారు నాలుగేళ్ల పాటు దేశ రక్షణ విభాగాల్లో సేవలందిస్తారు. పది రోజుల పాటు అగ్నివీక్ ర్యాలీ నిర్వహించనున్నారు. వర్షం కురిస్తే బీచ్ రోడ్డులో రన్నింగ్ ఈవింట్ నిర్వహిస్తారు. లేకుంటే పోర్టు స్టేడియంలో ఫిజికల్ ఈవెంట్లు, పరీక్షలు నిర్వహిస్తారు.

అడ్మిట్ కార్డు, ఆధార్ తప్పనిసరి

ముందుగా ర్యాలీ కోసం రిజిస్టర్‌ చేసుకుని, అడ్మిట్ కార్డులతో వచ్చిన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నారు. అడ్మిట్ కార్డుతో పాటు ఆధార్ కార్డు కచ్చితంగా తీసుకురావాలని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. అడ్మిట్‌ కార్డులను ఇండియన్‌ ఆర్మీ వెబ్‌సైట్‌ https://joinindianarmy.nic.in/ నుంచి అభ్యర్థులు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, ఆఫీస్ అసిస్టెంట్, స్టోర్ కీపర్ టెక్నికల్ విభాగాల్లో ఎంపికైన అభ్యర్థులు పనిచేయాల్సి ఉంటుంది. అర్హత పరీక్ష అనంతరం ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఇందులో పాస్ అయితే మెడికల్ టెస్ట్ ఉంటుంది. మెడికల్ పూర్తి చేశాక తుది ఎంపిక ఉంటుంది. రిక్రూట్మెంట్ ర్యాలీలో అభ్యర్థుల కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని విశాఖ కలెక్టర్‌ హరేందీర ప్రసాద్, నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబత్ర బాగ్చీ తెలిపారు.

ఆర్కే బీచ్ రోడ్డులో 1600 మీటర్ల పరుగు

ప్రతి రోజు 800 నుంచి 1000 మంది అభ్యర్థుల వరకూ ర్యాలీలో పాల్గొంటారని ఆర్మీ అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ వర్గంతో పోర్టు స్టేడియం చిత్తడిగా మారింది. దీంతో 1600 మీటర్ల ర్యాలీని ఆర్కే బీచ్ రోడ్డులో నిర్వహించారు. బీచ్ రోడ్డులో పరిగెడుతుండగా ఓ అభ్యర్థి కిందపడటంతో మోకాలికి గాయమైంది. అతడిని 108 సహాయంతో ఆసుపత్రికి తరలించారు. అగ్ని వీర్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నేపథ్యంలో విశాఖకు యువత తరలివస్తున్నారు. అగ్నివీర్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణత కావడంతో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో రిజిస్టర్ చేసుకున్నారు. అలాగే ఎనిమిదో తరగతి పాస్ అయిన అభ్యర్థుల కోసం అగ్ని వీర్ ట్రేడ్ మ్యాన్ పోస్టులను అందుబాటులోకి తెచ్చింది కేంద్రం.

సంబంధిత కథనం