NTR Health University : ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పీజీ డెంటల్ మేనేజ్మెంట్ కోటా సీట్ల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ విడుదల-vijayawada ntr health university pg dental diploma courses management seats notification released ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ntr Health University : ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పీజీ డెంటల్ మేనేజ్మెంట్ కోటా సీట్ల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ విడుదల

NTR Health University : ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పీజీ డెంటల్ మేనేజ్మెంట్ కోటా సీట్ల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ విడుదల

HT Telugu Desk HT Telugu
Jul 22, 2024 04:05 PM IST

NTR Health University : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో పోస్టు గ్రాడ్యూష‌న్, డిప్లొమా డెంటల్‌లో మేనేజ్‌మెంట్‌ కోటా, కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్ల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పీజీ డెంటల్ మేనేజ్మెంట్ కోటా సీట్ల భ‌ర్తీకి నోటిఫికేష‌న్
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పీజీ డెంటల్ మేనేజ్మెంట్ కోటా సీట్ల భ‌ర్తీకి నోటిఫికేష‌న్

NTR Health University : ఎన్‌టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీలో పోస్టు గ్రాడ్యూష‌న్, డిప్లొమా డెంటల్‌లో మేనేజ్‌మెంట్‌ కోటా, కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్ల భ‌ర్తీకి నోటీఫికేష‌న్ వెలువ‌డింది. 2024-25 విద్యా సంవ‌త్సరానికి గాను రాష్ట్రంలోని ప్రైవేట్‌, నాన్ మైనార్టీ డెంట‌ల్ కాలేజీల్లో పీజీ అడ్మిష‌న్ కోసం ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నోటీఫికేష‌న్ విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు దాఖ‌లకు జులై 24 వ‌ర‌కు గ‌డువు విధించింది. ఈ అప్లికేష‌న్ ఆన్‌లైన్‌లో చేయాల్సి ఉంటుంది. జులై 24 రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు దాఖ‌లు అవ‌కాశం ఉంది. అప్లికేష‌న్ ఫీజు కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. ద‌ర‌ఖాస్తుతో ఒరిజిన‌ల్ స‌ర్టిఫికేట్లు స్కాన్ చేసి అప్లొడ్ చేయాల్సి ఉంటుంది. అయితే అడ్మిష‌న్ టైమ్‌లో ఫ్రింట్ తీసిన అప్లికేష‌న్, ఇత‌ర స‌ర్టిఫికేట్లు అంద‌జేయాల్సి ఉంటుంది. నీట్ ఎండీఎస్‌-2024లో క్యాలిఫై అయిన వారు ద‌రఖాస్తు చేసుకోవ‌డానికి అర్హులు. ఇత‌ర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అభ్యర్థులు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

yearly horoscope entry point

నీట్-2024 క‌టాఫ్

పీజీ డెంట‌ల్ కోర్సుల‌కు జ‌న‌ర‌ల్ కేట‌గిరీ అభ్యర్థుల‌కు క‌టాఫ్ స్కోర్ 263, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగుల కేట‌గిరీ అభ్యర్థులకు క‌టాఫ్ స్కోర్ 230, జ‌న‌ర‌ల్ కేట‌గిరీ దివ్యాంగు అభ్యర్థుల‌కు క‌టాఫ్ స్కోర్ 246గా నిర్ణయించారు.

అప్లికేష‌న్‌తో జ‌త‌చేయాల్సిన స‌ర్టిఫికేట్లు

అప్లికేష‌న్‌తో పాస్‌పోర్టు సైజ్‌ఫోటో, నీట్ ఎండీఎస్‌-2024 అడ్మిట్ కార్డు, స్కోర్ కార్డు, బీడీఎస్ ఒరిజిన‌ల్ డిగ్రీ, ప్రొవిజిన‌ల్ స‌ర్టిఫికేట్‌, ఆధార్ కార్డు, బీడీఎస్ స్టడీ స‌ర్టిఫికేట్‌, కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రం, ఇంటెర్నిషిప్ స‌ర్టిఫికేట్‌, డెంట‌ల్ కౌన్సిల్ రిజిస్ట్రేష‌న్ స‌ర్టిఫికేట్ త‌దిత‌ర ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు జ‌త‌చేయాలి. అప్లికేష‌న్ ఫీజును ఆన్‌లైన్‌లో డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి.

మేనేజ్‌మెంట్ కోటా ఫీజులు

ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌, విజ‌య‌వాడ‌లో బీడీఎస్ పూర్తి చేసిన అభ్యర్థుల‌కు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేష‌న్ ఫీజు రూ.7,080 ఉంటుంది. ఇత‌ర రాష్ట్రాల్లో బీడీఎస్ పూర్తి చేసిన అభ్యర్థుల‌కు ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్ ఫీజు రూ.10,620 ఉంటుంది. విదేశాల్లో బీడీఎస్ డిగ్రీని పొందిన అభ్యర్థులు ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్ ఫీజు రూ.15,340 చెల్లించాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు యూనివర్సిటీ ఫీజు రూ. 49,600 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ట్యూష‌న్ ఫీజు క్లీనిక‌ల్ డ్రిగీ, డిప్లొమా కోర్సు అభ్యర్థులు మేనేజ్‌మెంట్ కోటా సీటు అయితే రూ.6,83,100, అదే ఎన్ఆర్ఐ కోటా సీటు అయితే రూ.13,80,000 చెల్లించాల్సి ఉంటుంది. పారా క్లీనిక‌ల్ డిగ్రీ, డిప్లొమా కోర్సు అభ్యర్థులు మేనేజ్‌మెంట్ కోటా సీటు అయితే రూ. 4,99,790, అదే ఎన్ఆర్ఐ కోటా సీటు అయితే రూ.8,05,000 చెల్లించాల్సి ఉంటుంది.

కాలేజీలు...సీట్లు

రాష్ట్రంలో మేనేజ్‌మెంట్ సీట్లు ఉన్న కాలేజీలు మొత్తం 13 ఉండ‌గా, అందులో మేనేజ్‌మెంట్ కోటా కింద 168 సీట్లు ఉన్నాయి.

కాంపిటెంట్ అథారిటీ కోటా ఫీజులు

రిజిస్ట్రేష‌న్, ప్రొసెసింగ్ ఫీజు ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.7,080 (రిజిస్ట్రేష‌న్ ఫీజు రూ.3,500, ప్రొసెసింగ్ ఫీజు రూ.2,500, జీఎస్టీ రూ.1,080), ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల‌కు రూ.5,900 (రిజిస్ట్రేష‌న్ ఫీజు రూ.3,000, ప్రొసెసింగ్ ఫీజు రూ.2,000, జీఎస్టీ రూ.900) ఉంటుంది. వెరిఫికేష‌న్ ఫీజు ఇత‌ర రాష్ట్రాల్లో బీడీఎస్ పూర్తి చేసిన అభ్యర్థుల‌కు రూ.3,540 (ఫీజు రూ.3,000, జీఎస్టీ రూ.540) ఉంటుంది. విదేశాల్లో బీడీఎస్ డిగ్రీని పొందిన అభ్యర్థులకు రూ.8,260 (ఫీజు రూ.7,000, జీఎస్టీ రూ.1,260) చెల్లించాల్సి ఉంటుంది. ఫీజులు ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. ఎంపికైన అభ్యర్థులు యూనివర్సిటీ ఫీజు రూ.23,600 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ట్యూష‌న్ ఫీజు క్లీనిక‌ల్ డిగ్రీ, డిప్లొమా కోర్సు అభ్యర్థులు రూ.3,42,550, పారా క్లీనిక‌ల్ డిగ్రీ, డిప్లొమా కోర్సు అభ్యర్థులు రూ. 3,07,395 చెల్లించాల్సి ఉంటుంది.

కాలేజీలు...సీట్లు

రాష్ట్రంలో మొత్తం 15 డెంట‌ల్ కాలేజీలు ఉండ‌గా, అందులో 438 సీట్లు ఉన్నాయి. వీటిలో కాంపిటెంట్ కోటా కింద 249, మేనేజ్‌మెంట్ కోటా కింద 168, ఆలిండియా కోటా కింద 21 సీట్లు ఉన్నాయి.

రిజ‌ర్వేష‌న్లు

ఎస్సీ-15 శాతం, ఎస్టీ-6 శాతం, బీసీ(ఏ)-7 శాతం, బీసీ (బీ)-10 శాతం, బీసీ (సీ)-1 శాతం, బీసీ (డీ)-7 శాతం, బీసీ(ఈ)-4 శాతం రిజ‌ర్వేషన్లు వ‌ర్తింప‌చేస్తారు.

ఇత‌ర వివ‌రాల కోసం సంప్రదించాల్సిన నంబ‌ర్లు..( ఉద‌యం 10 గంట‌ల నుంచి రాత్రి 6 గంట‌ల వ‌ర‌కు మాత్రమే)

1. For clarifications on Regulations 8978780501, 7997710168

2. For Technical difficulties 9000780707

3. For clarifications on payment gateway 9000780707

4. Website https://drysr.uhsap.in

5. E-mail ID pgquery23@gmail.com

జ‌గ‌దీశ్వరరావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం