AP Pension Distribution : ఏప్రిల్ పింఛన్ రెండ్రోజులు ఆలస్యం, పంపిణీపై వాలంటీర్లకు కీలక ఆదేశాలు-vijayawada ap pension distribution april two days late govt orders volunteers no campaign ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Pension Distribution : ఏప్రిల్ పింఛన్ రెండ్రోజులు ఆలస్యం, పంపిణీపై వాలంటీర్లకు కీలక ఆదేశాలు

AP Pension Distribution : ఏప్రిల్ పింఛన్ రెండ్రోజులు ఆలస్యం, పంపిణీపై వాలంటీర్లకు కీలక ఆదేశాలు

Bandaru Satyaprasad HT Telugu
Mar 27, 2024 07:06 PM IST

AP Pension Distribution : ఎన్నికల కోడ్, ఆర్థిక సంవత్స ముగింపు కారణంగా ఏప్రిల్ పింఛన్ల పంపిణీ రెండ్రోజులు ఆలస్యం కానుందని అధికారులు తెలిపారు. అలాగే పింఛన్ల పంపిణీపై వాలంటీర్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.

పింఛన్ల పంపిణీపై వాలంటీర్లకు కీలక ఆదేశాలు
పింఛన్ల పంపిణీపై వాలంటీర్లకు కీలక ఆదేశాలు

AP Pension Distribution : ఎన్నికల కోడ్(Election Code) నేపథ్యంలో పింఛన్ల పంపిణీపై(Pensions Distribution) ప్రభుత్వం వాలంటీర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్‌, మే నెల పింఛన్ల పంపిణీకి వాలంటీర్లు(AP Volunteers) ఆథరైజేషన్‌ సర్టిఫికెట్ తీసుకెళ్లాలని ఆదేశించింది. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (SERP) ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పుడు రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్తే సరైనా ఆధారాలు తప్పనిసరి. దీంతో బ్యాంకుల నుంచి నగదు తీసుకెళ్లే సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ఆథరైజేషన్‌ పత్రాలు(Authorisation Certificate) తప్పనిసరి తీసుకెళ్లాలని ఆదేశించింది. అలాగే ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శి, సంక్షేమ కార్యదర్శులకు ఆథరైజేషన్లు ఇవ్వాలని సెర్ప్ ఆదేశించింది. అలాగే పెన్షన్లు పంపిణీ సమయంలో వాలంటీర్లు ఎలాంటి రాజకీయ ప్రచారాలు చేయరాదని పేర్కొంది. పింఛన్లు పంపిణీ చేసినప్పుడు ఫొటోలు, వీడియోలు తీయకూడదని ఆదేశాలు జారీ చేసింది. పింఛన్ల పంపిణీలో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఉంటాయని సెర్ప్ సీఈవో కార్యాలయం స్పష్టం చేసింది.

ఏప్రిల్ పింఛన్లు కాస్త ఆలస్యం

అలాగే ఈసారి పింఛన్ల పంపిణీ కాస్త ఆలస్యం(April Pensions) కావొచ్చని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి నెల 1వ తేదీన వాలంటీర్లు(Volunteers) పింఛన్లు పంపిణీ చేస్తుంటారు. అయితే ఈసారి పంపిణీ ఆలస్యం అవుతుందని తెలిపారు. ఏప్రిల్1వ తేదీన కాకుండా ఏప్రిల్ 3న పింఛన్లు పంపిణీ చేస్తారని అధికారులు స్పష్టం చేశారు. లబ్దిదారులు ఈ అర్ధం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ నెలకు మాత్రమే ఈ విధంగా ఆలస్యం అవుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నెల పింఛన్ల పంపిణీ ఆలస్యం అవుతాయని అధికారులు పేర్కొన్నారు. మార్చి 31తో 2023-24 ఆర్థిక సంవత్సరం(Financial Year) పూర్తికానుంది. మార్చి 31న, ఏప్రిల్ 1న బ్యాంకులు(Banks) కార్యకలాపాలు సాగించవు. ఈ కారణంతో ఏప్రిల్ 1కి నగదు అందదని, రెండో తేదీన నగదు డ్రా చేసి ఏప్రిల్ 3న పంపిణీ చేస్తారని అధికారులు స్పష్టం చేశారు. ఈ సమాచారాన్ని మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలోని పింఛన్ లబ్దిదారులు సమాచారం అందించాలని తెలిపారు. ఎన్నికల కోడ్ కారణంగా పింఛన్ నగదు విత్ డ్రా చేసేందుకు కొన్ని ఇబ్బందుల ఉంటాయని, బ్యాంకు మేనేజర్లతో మాట్లాడి ఇబ్బందులు లేకుండా చూడాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. వీలైనంత త్వరగా లబ్దిదారులకు పింఛన్ పంపిణీ చేసేందుకు సిబ్బంది అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Whats_app_banner