Tiruchanur Temple : పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 5న వరలక్ష్మీ వ్రతం
వరలక్ష్మీ వ్రతాన్ని ఆగస్టు 5వ తేదీన తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఘనంగా నిర్వహించనున్నట్టుగా జేఈవో శ్రీ వీరబ్రహ్మం తెలిపారు.
Varalaxmi Vratam 2022 : తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 5వ తేదీన వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించనున్నట్టు జేఈవో శ్రీ వీరబ్రహ్మం చెప్పారు. వ్రతం ఏర్పాటుపై సోమవారం జేఈవో తిరుచానూరులోని ఆస్థాన మండపంలో అధికారులతో సమావేశం నిర్వహించారు.
'వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనే భక్తులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయంలో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తాం. భక్తులు నేరుగాను, వర్చువల్ గాను వ్రతంలో పాల్గొనేందుకు ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో కూడా టికెట్లు జారీ చేస్తాం. ఆలయం, ఆస్థాన మండపంలో వివిధ రకాల పుష్పాలు, విద్యుత్ అలంకరణలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నాం. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జరిగే వరలక్ష్మీ వ్రతాన్ని ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్షప్రసారం అవుతుంది.' అని జేఈవో తెలిపారు.