IGNOU Admissions 2025 : ఇగ్నో విజయవాడ క్యాంపస్‌లో ప్రవేశాలకు ప్రకటన - కోర్సుల వివరాలివే-applications are invited for admissions in ignou vijayawada campus ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Ignou Admissions 2025 : ఇగ్నో విజయవాడ క్యాంపస్‌లో ప్రవేశాలకు ప్రకటన - కోర్సుల వివరాలివే

IGNOU Admissions 2025 : ఇగ్నో విజయవాడ క్యాంపస్‌లో ప్రవేశాలకు ప్రకటన - కోర్సుల వివరాలివే

HT Telugu Desk HT Telugu

ఇగ్నో విజయవాడ క్యాంపస్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. అర్హులైన అభ్యర్థులు డిగ్రీ, పీజీ, డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఇందుకోసం జనవరి 31, 2025వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

ఇగ్నో విజయవాడ క్యాంపస్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

ఇందిరా గాంధీ నేష‌న‌ల్ ఓపెన్ యూనివ‌ర్శిటీ (ఇగ్నో) విజ‌య‌వాడ క్యాంప‌స్‌లో జనవరి 2025 నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం ప్ర‌వేశాల‌కు సంబంధించి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. శుక్ర‌వారం ఇగ్నో విజ‌య‌వాడ ప్రాంతీయ కేంద్రం సీనియ‌ర్ రీజ‌న‌ల్ డైరెక్ట‌ర్ దోనేపూడి రామాంజనేయ శర్మ తెలిపారు. అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తులు ఆన్‌లైన్‌లో చేసుకోవాల‌ని కోరారు.

ఆన్‌లైన్ ద్వారా పోస్ట్ గ్రాడ్యుయేట్, డిగ్రీ, డిగ్రీ ఆనర్స్, పీ.జీ. డిప్లమా, డిప్లమా, సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ జ‌న‌వ‌రి 31గా నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు. పీజీ రెండో సంవత్సరం, డిగ్రీ రెండో, మూడో సంవత్సరం, సెమిస్టర్ విధానం లో చదివే విద్యార్థులు రీ-రిజిస్ట్రేషన్ ఫీజును ఆన్‌లైన్‌ ద్వారాజనవరి 31 వరకు చెల్లించవచ్చని అన్నారు.

ఇతర వివరాలకు ఇగ్నో అధికారిక వెబ్ సైట్ www.ignou.ac.inని సంప్ర‌దించ‌వ‌చ్చున‌ని తెలిపారు. లేక‌పోతే విజ‌య‌వాడ‌లోని కొత్తపేటలో ఉన్న హిందూ హైస్కూల్ ప్రాంగణంలోని ఇగ్నో ప్రాంతీయ కేంద్రాన్ని సంప‌ద్రించ‌వ‌చ్చున‌ని సూచించారు. లేద‌నుకుంటే, ఇగ్నో ప్రాంతీయ కార్యాల‌యం ఫోన్ నెంబ‌ర్ 0866-2565253 ను సంప్ర‌దించవ‌చ్చున‌ని తెలిపారు.

కోర్సుల వివరాలు… ?

ఇగ్నో జ‌న‌వ‌రి-2025 సెష‌న్‌లో దాదాపు 300 గ్రూపుల వ‌ర‌కు అందుబాటులో ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్, డిగ్రీ, డిగ్రీ ఆనర్స్, పీ.జీ డిప్లమా, డిప్లమాల్లో వివిధ బ్రాంచ్‌లు ఉన్నాయి. వీటిల్లో త‌మ‌కు నచ్చిన గ్రూప్‌ను ఎంచుకోవ‌చ్చు. గ్రూప్‌ను బ‌ట్టీ ఫీజులు ఉంటాయి.

ఇలా దరఖాస్తు చేసుకోండి…

Step 1 : ఇగ్నో అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌ ignouadmission.samarth.edu.in పై క్లిక్ చేయండి.

Step 2 : స్క్రీన్‌పై ప్రదర్శించబడే 'ఇంగ్నో రిజిస్ట్రేషన్' లింక్‌పై క్లిక్ చేయండి

Step 3 : తొలిత‌ అవసరమైన వ్యక్తిగత, ప్రాథమిక విద్యా వివరాలను ఇవ్వండి

Step 4 : యూజ‌ర్ నేమ్‌ను సెలెక్ట్ చేసుకుని, పాస్‌వ‌ర్డ్‌ను క్రియేట్ చేసుకోవాలి.

Step 5 : ఇగ్నో 2025 ద‌ర‌ఖాస్తును చేసేందుకు లాగిన్ అవ్వండి

Step 6 : సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేసి, రిజిస్ట్రేష‌న్ ఫీజు చెల్లించండి.

Step 5 : ఆన్ లైన్ ఫారమ్ సబ్మిట్ చేసి, ప్రింటవుట్ తీసుకోండి.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

సంబంధిత కథనం