Muskaan Scholarship 2024 : డ్రైవర్లు, మెకానిక్ ల పిల్లలకు రూ.12 వేల స్కాలర్ షిప్, ఇలా అప్లై చేసుకోండి
Muskaan Scholarship 2024 : వాల్వోలిన్ ముస్కాన్ స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ తో 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు రూ.12 వేల గ్రాంట్ అందిస్తుంది. కమర్షియల్ వెహికల్ డ్రైవర్లు (LMV/HMV), మెకానిక్‌ల పిల్లలు, ఆర్థికంగా బలహీన వర్గానికి(EWS) చెందిన విద్యార్థులకు స్కాలర్ ఫిష్ అందిస్తుంది.
డ్రైవర్లు, మెకానిక్ ల పిల్లలకు రూ.12 వేల స్కాలర్ షిప్, ఇలా అప్లై చేసుకోండి
వాల్వోలిన్ కమ్మిన్స్ సంస్థ ముస్కాన్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్-2024 కింద కమర్షియల్ వెహికల్ డ్రైవర్లు (LMV/HMV), మెకానిక్‌ల పిల్లలు, ఆర్థికంగా బలహీన వర్గానికి(EWS) చెందిన విద్యార్థులకు స్కాలర్ ఫిష్ అందిస్తుంది. ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ను దక్షిణ భారతం, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు రూ.12,000 వరకు గ్రాంట్‌ను అందిస్తారు. దరఖాస్తుకు అక్టోబర్ 10 చివరి తేదీ.
ఈ స్కాలర్ షిప్ నకు ఎంపికైన విద్యార్థులు విద్యాపరంగా సవాళ్లను అధిగమించడానికి, లక్ష్యాలను నిర్దేశించడంలో అకడమిక్ ఎక్సలెన్స్‌ను సాధించడానికి మెంటర్‌షిప్ మద్దతు ఇస్తారు. ఈ మెంటర్‌షిప్ ద్వారా విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, వారి పూర్తి సామర్థ్యాన్ని తెలుసుకునేలా వారిని మోటివేట్ చేస్తారు.
స్కాలర్ షిప్ దరఖాస్తునకు అర్హతలు
- 9 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు స్కాలర్‌షిప్ నకు అర్హులు.
- దక్షిణ, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులు (అస్సాం, మణిపూర్, నాగాలాండ్, మిజోరం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా, బీహార్, పుదుచ్చేరి, ఛత్తీస్‌గఢ్, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, మేఘాలయ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్) దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- కమర్షియల్ వెహికల్ డ్రైవర్ల పిల్లలు(LMV/HMV)
- మెకానిక్స్ పిల్లలు
- ఆర్థికంగా బలహీన వర్గాలకు(EWS) చెందిన పిల్లలు
- దరఖాస్తుదారులు అర్హత పొందేందుకు వారి మునుపటి తరగతిలో 60%, అంతకంటే ఎక్కువ స్కోర్ పొంది ఉండాలి.
- వార్షిక కుటుంబ ఆదాయం రూ.8 లక్షలకు మించకూడదు.
- వాల్వోలిన్ కమ్మిన్స్ సంస్థ ఉద్యోగుల పిల్లలు అర్హులు కాదు
- రూ.12,000 వరకు స్కాలర్‌షిప్, మెంటర్‌షిప్ మద్దతు
దరఖాస్తుకు అవసరమయ్యే పత్రాలు
- ఆధార్ కార్డు
- ప్రస్తుత సంవత్సరం అడ్మిషన్ ఫీజు రుజువు (ఫీజు రసీదు/అడ్మిషన్ లెటర్/ఐడీ కార్డు/బోనఫైడ్ సర్టిఫికేట్)
- గత తరగతి ఒరిజినల్ మార్క్‌షీట్
- తల్లిదండ్రుల వృత్తిని నిర్థారించే పత్రాలు
- తల్లిదండ్రుల కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ (డ్రైవర్లకు మాత్రమే)
- ష్రామిక్ కార్డ్
- యజమాని నుంచి ధ్రువీకరణ లేదా స్వీయ ధ్రువీకరణ లేఖ
- కుటుంబ ఆదాయ రుజువు
- గ్రామ పంచాయతీ/వార్డు కౌన్సెలర్/సర్పంచ్ జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ రుజువు
- SDM/DM/CO/తహసీల్దార్ జారీ చేసిన ఆదాయ సర్టిఫికెట్
- గత మూడు నెలల శాలరీ స్లిప్పులు లేదా ఆదాయపు పన్ను రిటర్న్
- దరఖాస్తుదారు బ్యాంక్ ఖాతా వివరాలు
- ఫోటో
అప్లికేషన్ విధానం
- వాల్వోలిన్ కమ్మిన్స్ అధికారిక లింక్ http://muskaan.valvolinecummins.com/?cuid=tt_MKSP1_20240705_1 పై క్లిక్ చేయండి. అప్లై నౌ ఆప్షన్ ను ఎంచుకోండి.
- మీ రిజిస్టర్డ్ ఐడీతో Buddy4Studyకి లాగిన్ చేయండి. 'దరఖాస్తు ఫారమ్ పేజీ'కి నావిగేట్ అవుతుంది. మీ ఇమెయిల్, మొబైల్ నంబర్ లేదా జీ మెయిల్ ఖాతాను ఉపయోగించి Buddy4Studyలో సైన్ అప్ చేయండి.
- ఆ తర్వాత ‘ముస్కాన్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2024’ దరఖాస్తు ఫారమ్ పేజీకి నావిగేట్ అవుతారు.
- అప్లికేషన్ ప్రాసెస్‌ను ప్రారంభించడానికి 'అప్లికేషన్ స్టార్ట్ ' బటన్‌పై క్లిక్ చేయండి.
- ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లో అవసరమైన వివరాలను నమోదు చేయండి.
- సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేయండి
- షరతులు అంగీకరించి ‘ప్రివ్యూ’పై క్లిక్ చేయండి.
- దదరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడానికి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.