Vontimitta Brahmotsavam : లక్షకుపైగా శ్రీవారి మినీ లడ్డూలు సిద్ధం - ఒంటిమిట్టలో పంపిణీ చేయనున్న TTD-tirumala srivari laddus set for sita rama kalyanam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vontimitta Brahmotsavam : లక్షకుపైగా శ్రీవారి మినీ లడ్డూలు సిద్ధం - ఒంటిమిట్టలో పంపిణీ చేయనున్న Ttd

Vontimitta Brahmotsavam : లక్షకుపైగా శ్రీవారి మినీ లడ్డూలు సిద్ధం - ఒంటిమిట్టలో పంపిణీ చేయనున్న TTD

Maheshwaram Mahendra Chary HT Telugu
Apr 19, 2024 10:05 PM IST

Sri Sita Rama Kalyanam at Vontimitta : ఒంటిమిట్ట శ్రీ‌సీతా రాముల‌ కల్యాణానికి తిరుమ‌ల ల‌డ్డూలను సిద్ధం చేసింది TTD. కల్యాణానికి విచ్చేసే భక్తులకు అందజేయనుంది.

ఒంటిమిట్ట శ్రీ‌సీతా రాముల‌ కల్యాణానికి తిరుమ‌ల ల‌డ్డూ సిద్ధం
ఒంటిమిట్ట శ్రీ‌సీతా రాముల‌ కల్యాణానికి తిరుమ‌ల ల‌డ్డూ సిద్ధం (TTD)

Sri Rama Navami Brahmotsavam at Vontimitta : ఒంటిమిట్ట శ్రీ సీతా రాముల‌ కల్యాణానికి(Vontimitta Brahmotsavam) ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. అక్కడికి విచ్చేసే భ‌క్తుల‌కు అందించేందుకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు కూడా రెడీ అయ్యాయి. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ – 1లో శ్రీవారి సేవ‌కుల‌ సహకారంతో మినీ (25 గ్రాముల) లడ్డూల ప్యాకింగ్‌ను శుక్ర‌వారం నిర్వహించారు. దాదాపు 250 మంది మహిళా, పురుష శ్రీ‌వారి సేవ‌కులు 1.20 ల‌క్ష‌ల లడ్డూలను 60 వేల జిప్‌లాక్‌ ప్యాకెట్లలో ఒక్కో ప్యాక్‌లో రెండు లడ్డూలు ఉంచారు.

yearly horoscope entry point

కడపజిల్లా ఒంటిమిట్టలో(Vontimitta Brahmotsavam 2024) ఏప్రిల్ 22వ శ్రీ సీతా రాముల‌ కల్యాణం వైభవంగా జరగనుంది. సాయంత్రం 6:30 నుంచి 8:30 గంటల మధ్య అత్యంత వైభ‌వంగా జరిగే రాష్ట్ర పండుగ శ్రీ సీతా రాముల‌ కల్యాణంలో పాల్గొనే భక్తులకు ఈ లడ్డూలను ప్రసాదంగా అందజేయనున్నారు.

ఏప్రిల్ 22న ఒంటిమిట్ల సీతారాముల కల్యాణం

ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామివారి(Vontimitta Sri Kodandarama Swamy) ఆల‌యంలో ఏప్రిల్ 17 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.  25వ తేదీ వ‌ర‌కు బ్రహ్మోత్సవాలు(Brahmotsavam) కొనసాగనున్నాయి. ఏప్రిల్ 22వ తేదీ సాయంత్రం 6.30 నుంచి 8.30 గంట‌ల వ‌ర‌కు సీతారాముల క‌ల్యాణం అత్యంత వైభ‌వంగా నిర్వహించ‌నున్నట్లు టీటీడీ తెలిపింది.  టీటీడీలోని అన్ని విభాగాలు, జిల్లా యంత్రాంగం, పోలీసులు స‌మష్టి కృషి చేసి ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆదేశాలు ఇచ్చింది. గతంలో జరిగిన లోటుపాట్లను సవరించుకుని సీతారాముల కల్యాణాన్ని(Sitaramula Kalyanam) అంగరంగ వైభవంగా నిర్వహించాలని నిర్ణయించింది. 

ఏప్రిల్ 16వ తేదీన బ్రహ్మోత్సవాల(Vontimitta Brahmotsavam) అంకురార్పణ‌ జరిగింది. ఏప్రిల్ 17న‌ శ్రీరామనవమి(Srirama Navami 2024)తో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 20న హనుమంత వాహనం, ఏప్రిల్ 21న గరుడవాహనం, ఏప్రిల్ 22న సీతారాముల కల్యాణాన్ని అత్యంత అద్భుతంగా నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. ఏప్రిల్ 23న రథోత్సవం, ఏప్రిల్ 25న చక్రస్నానం, ఏప్రిల్ 26న పుష్పయాగము నిర్వహించనున్నారు.

 సీతారాముల కల్యాణానికి(Vontimitta Sitaramula kalyanam) విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ, జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా భద్రత, పార్కింగ్, అన్నప్రసాదాల పంపిణీ, తాత్కాలిక మరుగుదొడ్లు, నిరంతర విద్యుత్ సరఫరా, ప్రథమ చికిత్స కేంద్రాలు, ఆర్టీసీ బస్సులు, సైన్ బోర్డులు, పారిశుద్ధ్యం, పబ్లిక్ అడ్రస్ సిస్టం విభాగాల‌పై సమీక్షించి అధికారులు పలు సూచనలు చేశారు. 

ఒంటిమిట్టను ఆంధ్ర భద్రాచలంగా (Andhra Bhadrachalam)పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామనవమి రోజున అధికారికంగా కార్యక్రమాలను చేపడుతుంది. శ్రీరామనవమి రోజున ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారు. మూల విగ్రహాలలో రాముని విగ్రహం పక్కన హనుమంతుడు విగ్రహం లేని రామాలయం భారతదేశంలో ఇదొక్కటే అంటారు. శ్రీరామహనుమంతుల కలయికకు ముందే ఒంటిమిట్టలో సీతారామలక్ష్మణుల ఏకశీలా విగ్రహం స్థాపించినట్లు స్థలపురాణం చెబుతోంది. దేశం మొత్తం శ్రీరామనవమి నాడు సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. కానీ ఒంటిమిట్టలో మాత్రం శ్రీరామనవమికి ఐదో రోజున సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు.

 

 

Whats_app_banner