Palnadu Murders: పల్నాడు జిల్లాలో దారుణం, ఒకే కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య-three members of the same family were brutally murdered in palnadu due to family feud ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Palnadu Murders: పల్నాడు జిల్లాలో దారుణం, ఒకే కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య

Palnadu Murders: పల్నాడు జిల్లాలో దారుణం, ఒకే కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య

Sarath chandra.B HT Telugu
Nov 23, 2023 08:57 AM IST

Palnadu Murders: పల్నాడు జిల్లాలో దారుణ హత్యలు జరిగాయి. ఒకే కుటుంబంలో ముగ్గురిని సమీప బంధువులు నరికి చంపారు. హత్యల తర్వాత నిందితులు పోలీసులకు లొంగిపోయారు.

పిడుగురాళ్లలో ముగ్గురి దారుణ హత్య
పిడుగురాళ్లలో ముగ్గురి దారుణ హత్య

Palnadu Murders: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం కోనంగి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని సమీప బంధువులు విచక్షణారహితంగా కత్తులతో నరికి చంపారు. భార్య భర్తల మధ్య తలెత్తిన వివాదాలతో ఈ హత్యలు జరిగినట్టు గుర్తించారు.

మృతులను కోనంకి గ్రామానికి చెందిన సాంబశివరావు,అతని భార్య ఆదిలక్ష్మి, కుమారుడు నరేష్‌గా పోలీసులు గుర్తించారు. సాంబశివరావు కోడలు మాధురి బంధువులు హత్యలకు పాల్పడినట్టు గుర్తించారు.

హత్యల తర్వాత నిందితులు పోలీసులకు లొంగిపోయారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. కొన్నాళ్లుగా నరేష్ భార్య మాధురిని అత్త, మామలతో కలిసి భర్త వేధిస్తున్నట్లు తెలిసింది. పలుమార్లు పంచాయితీలు జరిగినా ఫలితం లేకపోయింది.

వేధింపులు తీవ్రం కావడంతో ముగ్గురిని హత్య చేసేందుకు పథకం రచించి అమలు చేశారు. హత్యల తర్వాత నరేష్ భార్య మాధురితో సహా బంధువులు పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మాధురిని వేధింపులకు గురి చేయడంతో విచక్షణ కోల్పోయిన బంధువులు అర్థరాత్రి దాడి చేసి కత్తులతో నరికి చంపారు. హత్య తర్వాత ముప్పాళ్ల పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి సమాచారం అందించారు. దీంతో పోలీసులు వారిని పిడుగురాళ్లకు తరలించారు. ముదు జాగ్రత్తగా గ్రామంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.