Official MSP Declared: వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం-support prices of agricultural products announced by ap govt ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Official Msp Declared: వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

Official MSP Declared: వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

HT Telugu Desk HT Telugu
Sep 26, 2023 12:05 PM IST

Official MSP Declared: రాష్ట్రంలో వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందే రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు మద్ధత్తు ధరలు ప్రకటిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీకి అనుగుణంగా 2023-24 ఏడాదికి వివిధ వ్యవసాయ ఉత్పత్తుల మద్ధతు ధరలను వ్యవసాయ మంత్రి ఆవిష్కరించారు.

పంటలకు మద్దతు ధరల జాబితా విడుదల చేసిన మంత్రి కాకాణి
పంటలకు మద్దతు ధరల జాబితా విడుదల చేసిన మంత్రి కాకాణి

Official MSP Declared: రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించదనే బెంగ లేని విధంగా ఏపీలో మద్ధతు ధరలను ప్రకటించినట్లు వ్యవసాయ మంత్రి కాకాణి తెలిపారు.

yearly horoscope entry point

వరి,పసుపు, మిర్చి,ఉల్లి, చిరు ధాన్యాలు, జొన్నలు, సజ్జలు, రాగులు, మొక్కజొన్న, కందులు, పెసలు, మినుములు, వేరుశెనగ, కొబ్బరి, ప్రత్తి, బత్తాయి, అరటి, సోయాబీన్, ప్రొద్దుతిరుగుడు వంటి 22 రకాల వ్యవసాయ ఉత్పత్తులకు క్వింటాలుకు మద్ధత్తు ధరను ప్రభుత్వం విడుదల చేసింది.

రైతుల్లో మద్ధత్తు ధరలపై పూర్తి అవగాహన కలిగించేందుకు రాష్ట్రంలోని అన్ని రైతు భరోసా కేంద్రాల్లో ధరల గోడపత్రికను ప్రదర్శించాలని ఆదేశించారు. రైతుకు మధ్య దళారుల బెడద, రవాణా ఖర్చు లేకుండా రైతు భరోసా కేంద్రాల్లోనే సియం యాప్ (Continuous Monitoring of Agriculture Prices and Procurement)ద్వారా కొనుగోలు చేస్తామని చెప్పారు.

రాష్ట్రంలోని రైతన్నలు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించాలని తొలిసారిగా 3 వేల కోట్ల రూ.లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి నిరంతరం ధరలను మానిటర్ చేస్తూ రైతులకు మద్ధత్తు ధర లభించేలా చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి గోవర్ధన రెడ్డి స్పష్టం చేశారు.

ప్రతి రైతు భరోసా కేంద్రాన్ని కొనుగోలు కేంద్రంగా ప్రకటించామని తెలిపారు . ధాన్యాన్ని కల్లం దగ్గరే కొనుగోలు చేయడంతో పాటు కొనుగోలు చేసిన 15 రోజుల్లోనే చెల్లింపులు చేస్తున్నామని చెప్పారు.కొనుగోలు ప్రక్రియలో చిన్నసన్నకారు రైతులకు ప్రాధాన్యతను ఇస్తున్నామని మంత్రి వివరించారు.

మార్కెట్లో పోటీ తత్వం పెరగాలని తద్వారా రైతన్నకు మెరుగైన ధర రావాలని అందుకోసం అవసరమైతే ప్రభుత్వమే రైతు భరోసా కేంద్రాల ద్వారా పంట ఉత్పత్తులు కొనుగోలు చేసి పోటీని పెంచుతుందని మంత్రి స్పష్టం చేశారు.

మద్ధతు ధరలకు పంటలు అమ్ముకోవాలంటే రైతులు తప్పని సరిగా ఈ-క్రాపులో వారి పంటల వివరాలను నమోదు చేసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి విజ్ణప్తి చేశారు.అలా నమోదు చేసుకున్నతర్వాత రైతు భరోసా కేంద్రాల్లో గ్రామ వ్యవసాయ సహాయకులు లేదా గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ధ CM APP లో రిజిస్ట్రేషన్ చేయించు కుంటే కనీస గిట్టుబాటు ధర దక్కని పరిస్థితిలో వెంటనే కొనుగోలు చేస్తామని తెలిపారు.

రైతులు రైతు భరోసా కేంద్రాలకు తీసుకువచ్చే పంటలకు కనీస నాణ్యతా ప్రమాణాలు ఉండేలా చూడలాని మంత్రి రైతులకు మనవి చేశారు.రైతులు వారి పంటలను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాక గూగల్ ప్లే స్టోర్ నుండి CM APP-Farmer Payment Status App ను డౌన్ లోడ్ చేసుకుని తమ చెల్లింపు స్థితిగతులను ఎప్పటికప్పుడు తెల్సుకోవాలని మంత్రి సూచించారు.

Whats_app_banner