Social Welfare Hostels : వేగంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్‌ నిర్మాణం…మంత్రి మేరుగు-social welfare minister review on welfare hostels construction in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Social Welfare Hostels : వేగంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్‌ నిర్మాణం…మంత్రి మేరుగు

Social Welfare Hostels : వేగంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్‌ నిర్మాణం…మంత్రి మేరుగు

HT Telugu Desk HT Telugu
Feb 17, 2023 12:30 PM IST

Social Welfare Hostels రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నసోషల్ వెల్ఫేర్, ఎస్సీ గురుకులాలకు చెందిన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, కొత్తగా చేపట్టిన నిర్మాణాలపై అధికారుల పర్యవేక్షణ మరింత పటిష్టంగా ఉండాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున అధికారులను ఆదేశించారు.

సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్‌పై సమీక్షిస్తున్న మంత్రి నాగార్జున
సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్‌పై సమీక్షిస్తున్న మంత్రి నాగార్జున

Social Welfare Hostels రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నసోషల్ వెల్ఫేర్, ఎస్సీ గురుకులాలకు చెందిన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, వీటిపై అధికారుల పర్యవేక్షణ మరింత పటిష్టంగా ఉండాలని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున అధికారులను ఆదేశించారు.

సచివాలయంలో సోషల్ వెల్ఫేర్, ఎస్సీ గురుకుల విద్యాలయాల సంస్థలకు సంబంధించి రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న పనుల పురోగతిని నాగార్జున సమీక్షించారు. గురు కులాలకు సంబంధించిన నూతన భవన నిర్మాణాలు, అదనపు తరగతి గదులు, ఇతర భవనాల నిర్మాణం, వివిధ భవనాల నిర్వహణ మరమ్మతులకు సంబంధించి మొత్తం 507 పనులను రూ.1061 కోట్లతో మంజూరు చేసినట్లు మంత్రి చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా 474 భవనాల నిర్మాణాలను ప్రారంభించగా వాటిలో 420 భవనాల నిర్మాణాన్ని రూ.723 కోట్లతో పూర్తి చేయడం జరిగిందని మంత్రి నాగార్జున తెలిపారు. మరో 32 పనులు తుదిదశలో ఉండగా, 22 పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. విద్యాలయాలకు సంబంధించిన భవనాల నిర్మాణంతో పాటుగా వాటికి సంబంధించిన ఇతర పనులను కూడా సకాలంలో పూర్తి చేయాలని అధికారులను మంత్రి కోరారు.

సోషల్ వెల్ఫేర్ కు సంబంధించి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన అంబేద్కర్ భవనాలు, స్టెడీ సర్కిళ్ల భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లు తదితర భవనాలకు సంబంధించిన నిర్మాణ ప్రగతిని మంత్రి సమగ్రంగా సమీక్షించారు. ప్రస్తుతం సోషల్ వెల్ఫేర్, ఎస్సీ గురుకులాలకు సంబంధించిన నిర్మాణ పనులు ఏపీఇడబ్ల్యుఐడీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న విషయాన్ని ప్రస్తావించిన మంత్రి ఏపీఇడబ్ల్యుఐడీసీ ఇంజనీరింగ్ అధికారులు సాంఘిక సంక్షేమశాఖ, గురుకుల విద్యాలయాల సంస్థ అధికారులతో సమన్వయం చేసుకొని పని చేయాలని కోరారు.

విద్యార్థుల సమస్యలు తీర్చడం కోసం కోట్ల రుపాయల వ్యయంతో మంజూరు చేసిన పనులను పూర్తి చేయడంలో ఎక్కడా జాప్యం జరగకుండా చూసుకోవాలని చెప్పారు. ఏపీఇడబ్ల్యుఐడీసీ అధికారులతో ఎప్పటి కప్పుడు సమీక్షా సమావేశాలను నిర్వహించడం ద్వారా నిర్మాణ పనులు వేగవంతంమయ్యేలా చూడాలని అధికారుల్ని మంత్రి ఆదేశించారు.

Whats_app_banner