YS Sharmila: భారతితో కలిసే అనిల్‌ సోనియా దగ్గరకెళ్లారన్న షర్మిల-sharmila says that anil went to meet sonia gandhi among with bharati reddy ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Sharmila: భారతితో కలిసే అనిల్‌ సోనియా దగ్గరకెళ్లారన్న షర్మిల

YS Sharmila: భారతితో కలిసే అనిల్‌ సోనియా దగ్గరకెళ్లారన్న షర్మిల

Sarath chandra.B HT Telugu
Jan 29, 2024 01:55 PM IST

YS Sharmila: జగన్‌ను జైల్లోనే ఉంచడానికి బ్రదర్ అనిల్‌ కుట్రలు చేశారనే ఆరోపణలపై షర్మిల భగ్గుమన్నారు. భారతితో కలిసే అనిల్‌ సోనియా గాంధీతో భేటీ అయ్యారని స్పష్టం చేశారు.

ఇడుపులపాయలో వైఎస్‌ షర్మిల, సునీత
ఇడుపులపాయలో వైఎస్‌ షర్మిల, సునీత

YS Sharmila: జగన్మోహన్‌ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో అతనికి వ్యతిరేకంగా బ్రదర్ అనిల్ కుట్రలు చేశారనే ఆరోపణలపై షర్మిల మండిపడ్డారు. భారతితో కలిసే తన భర్త అనిల్ సోనియాతో భేటీ అయ్యా రని స్పష్టం చేశారు. కడప జిల్లా కాంగ్రెస్‌ సమావేశంలో వైసీపీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చేసుకుంటారో చేసుకోవాలని సవాలు చేశారు.

yearly horoscope entry point

సాక్షి సంస్థలో తనకు సగం వాటా ఉందని, ఎన్ని నిందలు వేసినా నేను వైఎస్ షర్మిలా రెడ్డినేన్నారు. ఎన్ని నిందలు వేసినా వెనక్కి తగ్గేది లేదన్నారు. వైఎస్సార్ బ్రతికి ఉంటే ..కడప జిల్లాకు కడప స్టీల్ వచ్చేదన్నారు. వైఎస్సార్ శంకుస్థాపన చేశారని, కడప స్టీల్ ఫ్యాక్టరీ వచ్చి ఉంటే ... 20 వేల ఉద్యోగాలు వచ్చేవి...లక్ష మందికి పరోక్షంగా ఉపాధి దొరికేదన్నారు.

కడప స్టీల్ ఒక కల గానే మిగిలిపోయిందని, కాంగ్రెస్ పార్టీ కడప స్టీల్ ప్రాజెక్ట్ ను విభజన హామీల్లో పెట్టిందని, చంద్రబాబు 18 వేల కోట్లతో అని మళ్ళీ శంకుస్థాపన చేశారని, బాబు 5 ఏళ్లలో కడప స్టీల్ పై నిర్లక్ష్యం వహించారన్నారు.

జగన్ దీక్షలు కూడా చేశారని, ముఖ్యమంత్రి అయ్యాక జగన్ ఆన్న రెండు సార్లు శంకుస్థాపన చేశారని, కడప స్టీల్ ను శంకుస్థాపనల ప్రాజెక్ట్ గా మార్చారని ఎద్దేవా చేశారు.

వైఎస్సార్ హయాంలో కడప నుంచి బెంగళూర్ వరకు రైల్వే లైన్ అనుమతి తెచ్చారని, కేంద్రంతో మాట్లాడి... ప్రాజెక్ట్ కు నిధులు కూడా తెచ్చారని, 25 కిలేమేటర్ల వరకు నిర్మాణం జరిగిందని, వైఎస్సార్ మరణం తర్వాత... ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందన్నారు. జగన్ హయాంలో ఈ రైల్వే లైన్ అవసరం లేదని లేఖ రాశారని, ఒక చిన్న లైన్ చాలని సర్దుకున్నారని ఆరోపించారు.

మోడీ తో దోస్తీ చేసే జగన్.. ఎందుకు ఈ ప్రాజెక్టులను తేలేక పోయారన్నారు. అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకు పోతే ఇంత వరకు మరమ్మత్తులు లేవని, రోడ్డున పడ్డ కుటుంబాలను పట్టించుకోలేదని, వైఎస్సార్ తన జీవితంలో బీజేపీని ఎప్పటికీ వ్యతిరేకించారని గుర్తు చేశారు.

వైఎస్సార్ ఆశయాలను కొనసాగించలేని మీరు వైఎస్సార్ వారసులు ఎలా అవుతారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీని అడిగే దమ్ము లేదని నిలదీసే దమ్ము కూడా లేదన్నారు. పోలవరం అడిగే సత్తా లేదు...హోదా కోసం కొట్లాడే పరిస్థితి లేదన్నారు.

ఈ ఎన్నికల్లో జాతకాలు మారాలని, కడప నా పుట్టిన ఇల్లు...జగన్ అన్న లాగే తాను ఇక్కడే పుట్టానని, జమ్మల మడుగు ఆసుపత్రిలోనే నేను పుట్టానని, తాను జగనన్నకు వ్యతిరేకం కాదని, కానీ జగన్ అప్పటి మనిషి కాదని, ఇప్పటి జగన్ అన్నను ఎప్పుడు చూడలేదన్నారు.

జగన్ క్యాడర్‌కి, పార్టీకి తాను చేసిన సేవలు గుర్తుకు లేవన్నారు. తన మీద స్టోరీలు అల్లుతున్నారని, రోజుకో జోకర్ ను తెస్తున్నారని, నా మీద బురద చల్లుతున్నారని ప్రణబ్ ముఖర్జీ చెప్పాడని, జగన్ జైల్లో ఉన్నప్పుడు..తన భర్త అనిల్ సోనియా ను కలిశారని చెప్పారని, జగన్‌ను బయటకు రానివ్వద్దని లాబియింగ్ చేశామని చెబుతున్నారని, ఇప్పుడు చెప్పడానికి ప్రణబ్ ముఖర్జీ లేరని చెప్పారు.

పదవి ఆకాంక్ష ఉంటే...నాన్న ను అడిగి తీసుకోలేనా అని ప్రశ్నించారు. వైసీపీలో పదవి ఎందుకు తీసుకోలేదన్నారు. పదవి ఆకాంక్ష ఉంటే...మీకోసం నేను ఎందుకు మాట్లాడతానన్నారు.

అనిల్ , భారతి రెడ్డితో కలిసే సోనియా వద్దకు వెళ్ళారని, భారతికి తెలియకుండా సోనియా ను అడిగారా అని షర్మిల నిలదీశారు. భారతి రెడ్డి లేనప్పుడు అడిగారా అని ప్రశ్నించారు. కనీసం ప్రణబ్ ముఖర్జీ కూడా ఎక్కడ చెప్పినట్లు రికార్డ్ కూడా లేదన్నారు.

సునీతతో షర్మిల చర్చలు…

కడప పర్యటనలో ఉన్న షర్మిల వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతతో చర్చలు జరిపారు. ఉదయం ఇడుపులపాయలో సునీతతో కలిసి షర్మిల వైఎస్‌కు నివాళులు అర్పించారు. పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టిన అనంతరం సునీత ఆమెను తొలిసారి కలిశారు. సునీత ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని ప్రచారం జరుగుతోంది. తండ్రి హత్యపై సునీత ఇప్పటికే పోరాటం చేస్తున్నారు.

Whats_app_banner