RBK In AP : దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకే రైతు భరోసా కేంద్రాలు
RBK In AP ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో దళారీ వ్యవస్థను నిర్మూలించడం కోసమే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి కారూమూరి ప్రకటించారు. రైతుల నుంచి ప్రతి గింజ పంటను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయం దండగ అని చంద్రబాబు చెబితే దానిని పండుగ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని మంత్రి చెప్పారు.
RBK In AP తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మీద ఉన్న ప్రేమను, ముఖ్యమంత్రి రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న అక్కసును ప్రజలకు ఏవిధంగా తేటతెల్లం చేయాలనే ఆలోచనలో భాగంగా పత్రికల్లో రోజుకో వంట వండి వారుస్తున్నారని మంత్రి కారుమూరి ఆరోపించారు. రాష్ట్రంలో రైతులు, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి తెగ బాధపడిపోతున్నారని ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్రంలో రైతులు నష్టపోతున్నారని..మిల్లర్లు బాగుపడుతున్నారని రాయడం కుట్రలో భాగమేనని ఏపీ సర్కారు ఆరోపించింది.
నాడు రాజధాని అమరావతి పేరిట 50 వేల ఎకరాల పచ్చని పంటపొలాల్ని చంద్రబాబు నాశనం చేశాడని, సీపీఐ, సీపీఎం, పవన్ కళ్యాణ్ కూడా పంటల్ని నాశనం చేస్తున్నారంటూ ఆనాడు పోరాటం చేశారని గుర్తు చేశారు. రాజధాని ప్రాంతాల పంటభముల్ని విధ్వంసానికి పాల్పడినప్పుడు అప్పట్లో రైతులు గురించి మాట్లాడకుండా, కథనాలు రాయని పత్రికలు ఈ రోజెందుకు రైతుల గురించి మొసలికన్నీరు కారుస్తూ తెగ బాధపడి పోతున్నాయని ప్రశ్నించారు.
చంద్రబాబు వ్యవసాయం దండగ అని మాట్లాడితే కనీసం ప్రశ్నించలేదని, కైకలూరు పర్యటనలో ‘వ్యవసాయం వేస్టు.. ఇండస్ట్రీస్ బెస్ట్’ అని చంద్రబాబు పిలుపునిస్తే పత్రికలకు వినిపించలేదు, కనిపించలేదన్నారు. చంద్రబాబు తన హయాంలో రైతులకు మేలు జరిగే పని ఒక్కటైనా చేశాడా అని ప్రశ్నించారు. 2014లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు ఇవ్వాల్సిన పంటనష్టం ఇన్‌పుట్ సబ్సిడీని కనీసం 2019కి ముందు అధికారంలో నుంచి దిగేటప్పుడైనా ఇస్తాడనుకుంటే.. మొండిచెయ్యి చూపెట్టాడని విమర్వించారు.
రాష్ట్రంలో రైతులకు సంబంధించి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని చెప్పారు. ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నామని, ధాన్యం సేకరణ లక్ష్యం తగ్గించారనే ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పౌరసరఫరాల సంస్థ కోసం నాబార్డ్ తెచ్చిన నిధుల్ని పసుపు..కుంకుమ పేరుతో చంద్రబాబు పంచారని, ఆ బకాయిలను కూడా వైసీపీ చెల్లించిందన్నారు. రాష్ట్రంలో రైతులకు పంట దిగుబడుల అమ్మకాల్లో న్యాయం జరగాలని, రైతుకు మిల్లర్‌కు సంబంధం లేకుండా ఆర్బీకే కేంద్రాలను అందుబాటులోకి తెచ్చామన్నారు.
దళారీవ్యవస్థ లేకుండా ఒక్క రూపాయి కూడా రైతు నష్టపోకుండా గిట్టుబాటు ధరను ఇస్తున్నామని చెప్పారు. గతంలో రూ.170 నుంచి రూ.200 వరకు దళారులు లాభం మిగుల్చుకునే పరిస్థితి ఇప్పుడు లేదన్నారు. నేరుగా మద్దతు ధర మొత్తంను పంట కొనుగోలు చేసిన 21 రోజుల్లోగానే వారి ఖాతాల్లోకి ప్రభుత్వం జమచేస్తుందన్నారు. గన్నీబ్యాగ్స్, హమాలీలు, రవాణా ఖర్చులు అన్నింటినీ ప్రభుత్వమే భరిస్తుందని, న్నీబ్యాగ్స్‌కే రూ.2 కోట్లు .. హమాలీలు, రవాణాకు మరో రూ. 5 కోట్లు ఖర్చుచేస్తున్నామని చెప్పారు . వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడున్నరేళ్లలో రూ.50,699 కోట్లు ధాన్యం కొనుగోళ్లకు కేటాయిస్తే, చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో రైతులకు కేటాయించిoది నామ మాత్రమేనన్నారు.
చంద్రబాబు బీసీలకు ఏం చేశాడనేది ధైర్యంగా చెప్పుకోలేడు. బీసీల్ని తీవ్రంగా అవమానించి.. తోకలు కత్తిరిస్తానని బెదిరించిన చంద్రబాబును 2024లో టీడీపీని బీసీలే సమాధి కడతారన్నారు. ఈ మూడున్నరేళ్లలోనే బీసీల్లో ఎంతో పేరు సంపాదించిన జగన్‌ను చూసి టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు.