Ongole Woman Murder :కారుతో ఢీకొట్టి మహిళ మర్డర్..ఆక్సిడెంట్‌‌గా నమ్మించే యత్నం-prakasam district police arrests accused of woman murder case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Prakasam District Police Arrests Accused Of Woman Murder Case

Ongole Woman Murder :కారుతో ఢీకొట్టి మహిళ మర్డర్..ఆక్సిడెంట్‌‌గా నమ్మించే యత్నం

HT Telugu Desk HT Telugu
Mar 02, 2023 12:09 PM IST

Ongole Woman Murder రోడ్డు ప్రమాదంగా భావించిన ఓ కేసు చివరకు హత్యగా తేలింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ మరొకరితో చనువుగా ఉండటాన్ని భరించలేని వ్యక్తి కారుతో ఢీకొట్టి హత్య చేసినట్లు గుర్తించారు. హత్య సమయంలో తాను ఊళ్లో లేనట్లు నకిలీ సాక్ష్యాలు సృష్టించినా చివరకు పోలీసులకు దొరికిపోయారు.

హత్య కేసు వివరాలు వెల్లడిస్తున్న  డిఎస్పీ నాగరాజు
హత్య కేసు వివరాలు వెల్లడిస్తున్న డిఎస్పీ నాగరాజు

Ongole Woman Murder పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం జోగన్నపాలెంకు చెందిన నాయిన పాటి లక్ష్మీరమ్య అలియాస్‌ రమ్యకృష్ణ హత్య కేసులో ఇరువురు నిందితులను ఒంగోలు పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక మంగమూరురోడ్డులోని విజయటవర్స్‌ లో నివాసం ఉంటున్న వడ్లమూడి శ్రీనివాసులు, కటారి వెంకటేశ్వరరావులను హత్య కేసులో అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ నాగరాజు చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

ఉద్యోగం కోసం ఒంగోలు వచ్చిన లక్మీరమ్యకు శ్రీనివాసులు చెందిన జాబ్ కన్సల్టెన్సీ సంస్థలో వ్యాపార లావాదేవీలు చూసేందుకు ఉపాధి కల్పించాడు. ఇద్దరు కలిసి మోసాలకు పాల్పడుతూ బాగా డబ్బు సంపాదించారు. ఆ తర్వాత స్థానిక మంగమూరు రోడ్డులోని విజయటవర్స్‌లో రెండు అపార్ట్‌మెంట్లు కొనుగోలు చేసి ఇరుగుపొరుగునే నివాసం ఉంటున్నారు. ఇద్దరు కలిసి12ఏళ్లు సహజీవనం చేశారు.

ఈ క్రమంలో రెండేళ్ల క్రితం వరకు ఇద్దరు కలిసి వ్యాపారం చేశారు. ఆర్థికపరమైన లావాదేవీలలో ఇద్దరి మధ్య తేడాలు రావడంతో ఏడాదిగా లక్ష్మీరమ్య సొంతంగా వ్యాపారం చేసుకుంటుంది. దీంతో శ్రీ నివాసులుకు దూరమైంది. ఆ తర్వాత వీరి మధ్య వివాదాలు తలెత్తాయి. తనకు దూరమైన లక్ష్మీరమ్య మరొకరితో చనువుగా ఉంటుందని వడ్లమూడి శ్రీనివాసులు ఈర్ష్య పెంచుకున్నాడు.

పథకం ప్రకారం లక్ష్మీరమ్యను హతమార్చేందుకు పక్కా ప్రణాళిక రూపొందించాడు. ఫిబ్రవరి 19న శ్రీనివాసులుకు హైదరాబాద్‌లో కోర్టు వాయిదా ఉంది. అప్పటికి పదిరోజులు ముందే ఆమెను తన కారుతో ఢీకొట్టించి హత్య చేయాలని భావించి నిఘా ఉంచాడు. నిందితుడి కారును ముందుగానే ముంగమూరు రోడ్డులోని మర్రిచెట్టు దగ్గర పార్కు చేశాడు.

19వ తేదీన హైదరాబాద్‌లో కోర్టు వాయిదా చూసుకొని శబరి ఎక్స్‌ ప్రెస్‌లో 20వ తేదీ రాత్రి 7.40గంటలకు ఒంగోలు వచ్చాడు. ఒంగోలు చేరిన తర్వాత నిందితుడు శ్రీనివాసులు తాను ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో‌నే ఉంటున్న వెంకటేశ్వర్లును పిలిచాడు. ల క్ష్మీరమ్య తన ఆఫీసు నుంచి స్కూటీ మీద రాత్రి 9.30 గంటలకు బయలు దేరడాన్ని గుర్తించాడు. మృతురాలి స్కూటీని కారులో వెంబడించారు.

ఆ సమయంలో కారులో వెంకటేశ్వర్లు కూడా ఉన్నాడు. అల్కాపురి వెంచర్‌ వద్దకు వెళ్లే సరికి జనసంచారం లేక పోవడంతో స్కూటీని కారుతో వెనక నుంచి ఢీకొట్టడంతో లక్ష్మీరమ్య అక్కడిక్కడే మృతి చెందింది. చనిపోయినట్లు నిర్ధారించుకున్న తరువాత వెంకటేశ్వర్లును ఒంగోలులో వదలి శ్రీనివాసులు కారులో చెన్నై పరారయ్యాడు.

ఆధారాలు మాయం చేసేందుకు ప్రయత్నాలు…

తాను చేసిన నేరం నుంచి తప్పించుకు నేందుకు శ్రీనివాసులు అనేక ప్రయత్నాలు చేశాడు. హత్యకు ముందు తాను ఒంగోలులో లేనంటూ సాక్ష్యాలు సృష్టించాడు. ఫిబ్రవరి 20న హైదరాబాద్‌లో కోర్టు వాయిదా కోసం 19న ఒంగోలు నుంచి వెళ్ళాడు. 20న అతను తిరుగు ప్రయాణం కోసం రైలు టిక్కెట్‌ బుక్‌ చేసుకున్నాడు. ఆ రైలులో శ్రీనివాసులు సోదరుడు ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు.

శ్రీనివాసులు శబరి ఎక్స్‌ప్రెస్‌లో 20వ తేదీన రాత్రికే ఒంగో లుకు చేరుకున్నట్లు నిర్ధారించారు. స్కూటీ ని కారుతో ఢీకొట్టిన సమయంలో కారు బంపర్‌ వంగిపో యింది. ఘటన జరిగిన వెంటనే చెన్నై వెళుతూ మార్గమధ్యలో రోడ్డుపై ఉన్న ఒక డ్రమ్‌ను ఢీకొట్టించాడు. అక్కడ నుంచి కారు మరమ్మతుల కోసం చెన్నైలో షోరూం లో వదిలివేశాడు. హత్య జరిగిన రోజు ఒంగోలులో లేనట్లు చూపించేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుడు ఒంగోలులోనే ఉన్నట్లు గుర్తించారు.

పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయడంతో తానే లక్ష్మీరమ్యను హత్య చేశానని గత నెల 28న ఒంగోలు ఎమ్మార్వో వద్ద శ్రీనివాసులు అంగీకరించాడు. ఈ మేరకు వీఆర్వో శ్రీనివాసులు స్టేట్‌ మెంట్‌ రికార్డు చేసి రాత్రి 11గంటలకు ఒంగోలు తాలుకా పోలీసులకు అప్ప గించారు. అనంతరం శ్రీనివాసులు విచారణలో వెల్లడిచిన సమాచారం మేరకు వెంకటే శ్వర్లను స్థానిక మంగమూరు డొంకలో అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. తొలుత రోడ్డు ప్రమా దంగా నమోదు చేసిన పొలీసులు హత్య కేసుగా మార్పు చేశారు.

IPL_Entry_Point

టాపిక్