AP Cabinet Portfolio List : ఏపీ మంత్రుల శాఖలు ఖరారు - పవన్‌కు పంచాయతీరాజ్, లోకేశ్ కు ఐటీ.. మిగతావారి శాఖలివే
AP CM Chandrabau Cabinet Portfolio List 2024: ఏపీ మంత్రుల శాఖలు ఖరారయ్యాయి. పవన్ కల్యాణ్ కు పంచాయతీరాజ్ శాఖ దక్కింది. ఐటీ మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతలు చూడనున్నారు.
AP Cabinet Portfolio List : ఏపీ మంత్రుల శాఖలు ఖరారయ్యాయి. పవన్ కల్యాణ్ కు పంచాయతీరాజ్ శాఖ(డిప్యూటీ సీఎంగా) దక్కింది. ఐటీ మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతలు చూడనున్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ కు ఛాన్స్ దక్కింది. వంగలపూడి అనితకు హోంశాఖ దక్కింది. గొట్టిపాటి రవి కుమార్ కు విద్యుత్ శాఖ బాధ్యతలను చూడనున్నారు.
ఏపీ కేబినెట్ - మంత్రుల శాఖల
- చంద్రబాబు - సాధారణ పరిపాలన, శాంతిభద్రతలు( ముఖ్యమంత్రి)
- పవన్ కల్యాణ్ - పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ (డిప్యూటీ సీఎం)
- నారా లోకేశ్ - ఐటీ, మానవ వనరులు, రియల్ టైమ్ గవర్నెన్స్
- వంగలపూడి అనిత - హోంశాఖ మంత్రి, విపత్తు
- అచ్చెన్నాయుడు - వ్యవసాయశాఖ, మార్కెటింగ్, పశుసంవర్థక శాఖ
- కొల్లు రవీంద్ర - మైనింగ్ మరియు ఎక్సైజ్ శాఖ
- నాదెండ్ల మనోహర్ - పౌరసరఫరాల శాఖ
- నారాయణ -మున్సిపల్ మంత్రిత్వ శాఖ
- సత్య కుమార్ యాదవ్ - వైద్య ఆరోగ్యశాఖ
- నిమ్మల రామనాయుడు - నీటి పారుదల శాఖ
- ఎన్ఎండీ ఫరూక్ - మైనార్టీ వెల్పేర్
- ఆనం రాంనారాయణరెడ్డి - దేవాదాయశాఖ
- పయ్యావుల కేశవ్ - ఆర్థికశాఖ
- అనగాని సత్యప్రసాద్ - రెవెన్యూ శాఖ
- కొలుసు పార్థసారథి - గృహనిర్మాణ, ఐ అండ్ పీఆర్
- డోలా బాలవీరాంజనేయస్వామి - సాంఘిక సంక్షేమ శాఖ
- గొట్టిపాటి రవి కుమార్ - విద్యుత్ శాఖ
- కందుల దుర్గేశ్ - పర్యాటకం, సినిమాటోగ్రఫీ
- సంధ్యారాణి - మహిళా సంక్షేమం, గిరిజన సంక్షేమ
- బీసీ జనార్థన్ రెడ్డి - రోడ్లు భవనాల శాఖ
- టీజీ భరత్ - పరిశ్రమల శాఖ
- ఎస్ సవిత - బీసీ సంక్షేమ శాఖ
- వాసంశెట్టి సుభాష్ - కార్మిక శాఖ
- కొండపల్లి శ్రీనివాస్ - సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ
- రామ్ ప్రసాద్ రెడ్డి - రవాణా శాఖ, క్రీడా శాఖ.
టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న అచ్చెన్నాయుడికి ఈసారి వ్యవసాయశాఖ దక్కింది. కొల్లు రవీంద్రకు మైనింగ్ మరియు ఎక్సైజ్ శాఖ ఖరారైంది. జనసేన నుంచి గెలిచిన నాదెండ్ల మనోహర్,.. పౌరసరఫరాల శాఖ బాధ్యతలు చూడనున్నారు. 2014లో చంద్రబాబు కేబినెట్ లో మున్సిపల్ శాఖ బాధ్యతలు చూసిన నారాయణకు.. మరోసారి అదే శాఖ దక్కింది.
బీజేపీ నుంచి గెలిచిన సత్య కుమార్ యాదవ్ .. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బాధ్యతలు చూడనున్నారు. నిమ్మల రామనాయుడుకు నీటి పారుదల శాఖ ఖరారైంది. వైసీపీ నుంచి టీడీపీలో చేరి గెలిచిన ఆనం రాంనారాయణరెడ్డికి దేవాదాయశాఖను కేటాయించారు.
కీలకమైన ఆర్థిక శాఖను పయ్యావుల కేశవ్ కు అప్పగించారు. అనగాని సత్యప్రసాద్ .. రెవెన్యూ శాఖ బాధ్యతలు చూడనున్నారు. ఇక వైసీపీ నుంచి చివర్లో బయటికి వచ్చి నూజివీడు నుంచి గెలిచిన కొలుసు పార్థసారథికి హౌసింగ్ శాఖ దక్కింది. జనసేన నుంచి గెలిచిన కందుల దుర్గేశ్ కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖ ఖరారైంది.
ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ సీట్లు ఉండగా.. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 164 సీట్లలో విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ మొత్తం 144 స్థానాల్లో పోటీ చేయగా 135 స్థానాల్లో నెగ్గింది. అతిపెద్ద భాగస్వామ్యపక్షంగా టీడీపీ ఉంది. ఇక జనసేన 21కి 21 స్థానాల్లో జెండా ఎగరవేసింది. భారతీయ జనతా పార్టీ మొత్తం 10 చోట్ల పోటీ చేయగా.. 8 సీట్లలో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం జనసేన, బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా మంత్రి పదవులు దక్కాయి.