NTRUHS MBBS: NTR హెల్త్ యూనివర్శిటీ మేనేజ్‌మెంట్‌ కోటా కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల-ntr health university management quota counseling schedule released ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ntruhs Mbbs: Ntr హెల్త్ యూనివర్శిటీ మేనేజ్‌మెంట్‌ కోటా కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల

NTRUHS MBBS: NTR హెల్త్ యూనివర్శిటీ మేనేజ్‌మెంట్‌ కోటా కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల

Bolleddu Sarath Chandra HT Telugu
Oct 01, 2024 10:29 AM IST

NTRUHS MBBS: ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పరిధిలో మెడికల్‌ కాలేజీల్లో మేనేజ్‌మెంట్‌ ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీకి కౌన్సిలింగ్ షెడ్యూల్‌ విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి మేనేజ్‌మెంట్‌ కోటాలో మెడికల్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

<p>విజయవాడలోని ఎన్టీఆర్‌ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్</p>
విజయవాడలోని ఎన్టీఆర్‌ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్

NTRUHS MBBS: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్ మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీకి రెండో విడత కౌన్సెలింగ్‌లో అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వా నిస్తున్నట్లు డ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది.

మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల కోసం అక్టోబర్ 1వ తేదీ సోమవారం రాత్రి 10 గంటల నుంచి రెండో తేదీ రాత్రి 9 గంటల వరకు ఆప్షన్లు ఇచ్చుకోవాలి. రాష్ట్రంలోని 6 ప్రభుత్వ కళాశాలల్లోని సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లలో 'బి' కేటగిరీలో 32 సీట్లు, ఎన్నారై కోటా కింద 15 సీట్లు, 17 ప్రైవేటు వైద్య కళాశాలల్లో బి1 కేటగిరీలో 77, బి2 కేటగిరీలో 117, సి కేటగిరీలో 110 సీట్లు ఉన్నాయి. మైనా రిటీ వైద్య కళాశాలల్లో బి కేటగిరీలో 30 సీట్లు, సి కేటగిరీలో 29 సీట్లను రెండో విడత కౌన్సెలింగ్‌ కోసం అందుబాటులో ఉంచారు.

కన్వీనర్‌ కోటాలో రెండో విడత సీట్లు..

2024-25 విద్యా సంవత్సరంలో ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ రెండో విడత కన్వీనర్ కోటా సీట్ల భర్తీ పూర్తైంది. రెండో విడత జాబితాను విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. మొదటి విడత కౌన్సెలింగ్‌లో ఎంబీబీఎస్‌ సీట్లు పొందినా, ఆయా కళాశాలల్లో పలువురు అభ్యర్థులు చేరకపోవడంతో మిగిలిపోయిన 132 ఎంబీబీఎస్ సీట్లతో పాటు మైనారిటీ కళాశాలల్లో 105 సీట్లను రెండో విడతలో భర్తీ చేశారు.

కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన అభ్యర్థులు అక్టోబరు 3వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల్లోగా ఆయా వైద్య కళాశాలల్లో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి జాతీయ వైద్య కమిషన్ 'కరిక్యులమ్ బేస్డ్ మెడికల్ ఎడ్యు కేషన్' పేరుతో తరగతులు నిర్వహించాలని ఆదేశించడంతో ముందుగా ప్రకటించిన తేదీ లలో కాకుండా అక్టోబరు 14వ తేదీ నుంచి మొదటి ఏడాది ఎంబీబీఎస్‌ తరగతులు ప్రారంభించనున్నారు.

ప్రత్యేక కేటగిరీలో దివ్యాంగులు, ఆర్మీ సంతతి, ఎన్‌సిసి, క్రీడా విభాగాల్లోని 271 సీట్లను ఆయా డైరెక్టరేట్ల నుంచి వచ్చే ప్రాధాన్య క్రమం ఆధారంగా సీట్లను భర్తీ చేస్తారు. ప్రత్యేక క్యాటగిరీ సీట్ల భర్తీ పూర్తైన తర్వాత మూడో విడత కౌన్సిలింగ్ చేపడతారు.

Whats_app_banner