NTRUHS MBBS Admissions: ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ ఫస్టియర్ ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల జాబితా విడుదల-ntr health university first year mbbs convenor quota seat allotment list released ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ntruhs Mbbs Admissions: ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ ఫస్టియర్ ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల జాబితా విడుదల

NTRUHS MBBS Admissions: ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ ఫస్టియర్ ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల జాబితా విడుదల

Bolleddu Sarath Chandra HT Telugu
Sep 16, 2024 06:44 AM IST

NTRUHS MBBS Admissions: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరంలో నీట్‌ ప్రవేశ పరీక్ష ద్వారా కన్వీనర్‌ కోటాలో ఎంబిబిఎస్‌ ప్రవేశాలు ఖరారయ్యాయి. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న మెడికల్ సీట్లలో కన్వీనర్‌ కోటా పరిధిలోలో వచ్చే సీట్ల జాబితాను విడుదల చేశారు.

<p>విజయవాడలోని ఎన్టీఆర్‌ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్</p>
<p>విజయవాడలోని ఎన్టీఆర్‌ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్</p>

NTRUHS MBBS Admissions: ఆంధ్రప్రదేశ్‌లో 2024-25 విద్యా సంవత్సరంలో ఎంబిబిఎస్‌ అడ్మిషన్ల జాబితా ఖరారైంది. ఆదివారం రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అర్హత పొందిన అభ్యర్థుల జాబితాను ఎన్టీఆర్‌హెల్త్‌ యూనివర్శిటీ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 35 ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల కేటాయింపు జాబితాను విజయవాడలోని డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ ఆదివారం విడుదల చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీల్లో కలిపి మొత్తం 3,879 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. వీటిలో 267 సీట్లను ప్రత్యే కేటగిరీలో భర్తీ చేస్తారు. వికలాంగులు, సాయుధ బలగాల పిల్లలు, ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌ కోటాలకు సంబంధించిన సీట్లను ఆ క్యాటగిరీలో భర్తీ చేస్తారు. ఈ సీట్ల భర్తీకి సంబంధించి ఆయా విభాగాల నుంచి మెరిట్ ఆర్డర్ విడుదల కావాల్సి ఉంది. మిగిలిన 3,612 సీట్లను మొదటి విడతలో భాగంగా కౌన్సెలింగ్‌లో అందుబాటులో ఉంచారు.

రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల ఆధారంగా వీటిలో 3,507 సీట్లను భర్తీ చేస్తూ కళాశాలల వారీగా విద్యార్థులకు కేటాయింపుల జాబితాను ఆదివారం హెల్త్ యూనివర్శిటీ అధికారులు విడుదల చేశారు.

మిగిలిన 105 సీట్లలో 102 సీట్లు మైనార్టీ కేటగిరీ, మూడు స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కోటాకు సంబంధించినవి ఉన్నాయి. రెండో దశ కౌన్సెలింగ్‌లో భాగంగా ప్రత్యేక క్యాటగిరీ సీట్లు, మైనార్టీ, స్కౌట్‌ కేటగిరీకి సంబంధించిన సీట్లను భర్తీ చేయనున్నారు. మొదటి విడతలో పొందిన 3,507 మంది విద్యార్థులు ఈనెల 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటలు లోపు వారికి కేటాయించిన కళాశాలలకు వెళ్లి చేరాలని సూచించారు. అక్టోబర్‌ 1వ తేదీ నుంచి ఎంబీబీఎస్‌ ఫస్టియర్‌ తరగతులు ప్రారంభమవుతాయని ఎన్టీఆర్‌ విశ్వవిద్యాలయం ప్రకటించింది.

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ విడుదల చేసిన మెరిట్ లిస్ట్‌, కాలేజీల వారీగా అడ్మిషన్లు పొందిన విద్యార్ధుల జాబితా ఇదే…

https://apuhs-ugadmissions.aptonline.in/mbbs/Home/Bulletinopen?RowId=142

ఇప్పటికే మెరిట్ లిస్ట్ విడుదల…

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ ఎంబిబిఎస్‌, బిడిఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఫైనల్ మెరిట్ లిస్ట‌‌ విడుదల చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబిబిఎస్‌ కోర్సుల్లో కన్వీనర్‌ కోటా కింద ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న వారిలో మెరిట్ లిస్ట్‌ను గతsa బుధవారం విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్యలో ప్రవేశాలు కోరుతున్న విద్యార్థుల్లో నీట్ ర్యాంకుల ఆధారంగా 2024-25 విద్యా సంవత్సరానికి మెరిట్‌ లిస్ట్‌ను ఎన్టీఆర్ హెల్త్‌ యూనివర్శిటీ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఆంధ్రాయూనివర్శిటీ రీజియన్, ఎస్వీ యూనివర్శిటీల పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్‌ కన్వీనర్ కోటా సీట్లను నీట్ ర్యాంకుల ఆధారంగా ఖరారు చేశారు. ఆలిండియా కోటా మినహాయించగా మిగిలిన సీట్లలో కన్వీనర్‌ కోటా మెరిట్ జాబితాను బుధవారం ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది.

ఏపీలో మెడికల్ ప్రవేశాల కోసం నీట్ ర్యాంకుల ఆధారంగా దరఖాస్తు చేసుకున్న వారిలో 13,489మందికి మెరిట్ ఆర్డర్ విడుదల చేశారు. పూర్తి వివరాలను ర్యాంకుల జాబితాను హెల్త్ యూనివర్శిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

నీట్‌లో 254వ ర్యాంకు సాధించిన ఎన్వీ యూనివర్శిటీకి చెందిన సిరిగిరి మోక్షశ్రీకి మెరిట్‌ లిస్ట్‌లో తొలి ర్యాంకు లభించింది. ఆ తర్వాత స్థానంలో ఎస్వీ యూనివర్శిటీకి చెందిన నీట్304 ర్యాంకర్‌ రాచపల్లె భవిత ఉన్నారు. మూడో స్థానంలో నీట్‌లో 551వ ర్యాంకు సాధించిన నియాతి జైన్ ఉన్నారు. తొలి పది స్థానాల్లో ఐదుగురు బాలికలు, ఐదుగురు బాలలు ఉన్నారు. వీరిలో ఎస్వీ వర్శిటీ పరిధిలో ముగ్గురు, ఏయూ పరిధిలో ఏడుగురు ఉన్నారు.

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ ప్రకటించిన నీట్ ఎంబిబిఎస్‌, బిడిఎస్‌ మెరిట్ జాబితాను ఈ లింకు ద్వారా చూడవచ్చు…

https://drntr.uhsap.in/index/notification/Admission/2024-25/MBBS/MBBS%20&%20BDS%20CQ%202024-25%20-%20Provisional%20Final%20Merit%20List%20of%20applied%20candidates.pdf