Postal Recruitment 2024 : పోస్ట‌ల్ శాఖ‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు - ఏపీ, తెలంగాణలో ఖాళీలు, చివరి తేదీ ఎప్పుడంటే..?-notification released for executive posts in postal department in ap and telangana ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Postal Recruitment 2024 : పోస్ట‌ల్ శాఖ‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు - ఏపీ, తెలంగాణలో ఖాళీలు, చివరి తేదీ ఎప్పుడంటే..?

Postal Recruitment 2024 : పోస్ట‌ల్ శాఖ‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు - ఏపీ, తెలంగాణలో ఖాళీలు, చివరి తేదీ ఎప్పుడంటే..?

HT Telugu Desk HT Telugu
Oct 24, 2024 04:52 PM IST

పోస్ట‌ల్ శాఖ‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఇందులో భాగంగా ఏపీ, తెలంగాణలో కూడా పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసేందుకు అక్టోబ‌ర్ 31ని తుది గడువుగా నిర్ణయించారు. https://ibpsonline.ibps.in/ippblsep24/ లింక్ పై క్లిక్ చేసి ప్రాసెస్ చేసుకోవచ్చు.

పోస్ట‌ల్ శాఖ‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల‌కు దరఖాస్తుల స్వీకరణ
పోస్ట‌ల్ శాఖ‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల‌కు దరఖాస్తుల స్వీకరణ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌ల్లో పోస్టల్ శాఖ‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. ద‌ర‌ఖాస్తు చేసేందుకు అక్టోబ‌ర్ 31 ఆఖ‌రు తేదీగా నిర్ణ‌యించారు. ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాల‌కు ఇండియ‌న్ పోస్ట‌ల్ పేమెంట్ బ్యాంక్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

ఏపీ, తెలంగాణ‌ల్లో మొత్తం 23 పోస్టులు..

ఎగ్జిక్యూటివ్ ఖాళీల‌ను కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలో భ‌ర్తీ చేస్తున్నారు. దేశ‌వ్యాప్తంగా 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 344 ఎగ్జిక్యూటివ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌గా, అందులో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 8, తెలంగాణ‌లో 15 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు గ్రామీణ డాక్ సేవ‌క్స్ (జీడీఎస్‌) ఉద్యోగం చేస్తున్న‌వారు, అలాగే ఏదైనా గ్రాడ్యూష‌న్ (రెగ్యూల‌ర్‌, డిస్టెన్స్‌) అర్హ‌త క‌లిగిన రెండేళ్ల అనుభ‌వం ఉన్న‌వారికి ఈ అవ‌కాశం క‌ల్పించారు. ద‌ర‌ఖాస్తు చేసే అభ్య‌ర్థికి విజిలెన్స్‌, ఇత‌ర ప్ర‌వ‌ర్త‌న‌కు సంబంధించిన కేసులు పెండింగ్‌లో ఉండ‌కూడ‌దు.

ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలంటే 2024 అక్టోబ‌ర్ 1 నాటికి క‌నీసం 20 ఏళ్లు, గ‌రిష్టంగా 35 ఏళ్ల వ‌య‌స్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థుల‌కు ఐదేళ్ల, ఓబీసీ అభ్య‌ర్థుల‌కు మూడేళ్లు వ‌య‌స్సు స‌డ‌లింపు ఉంటుంది.

ఎంపిక విధానం...జీతభ‌త్యాలు…

ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల‌కు ఎటువంటి రాత ప‌రీక్ష నిర్వ‌హించకుండా మెరిట్ మార్కులు, అనుభ‌వం ఆధారంగానే డాక్యుమెంట్స్ ప‌రిశీలించి ఎంపిక చేశారు. ఉద్యోగాల‌కు ఎంపిక అయిన‌వారికి నెల‌కు రూ.30,000 వేత‌నం ల‌భిస్తుంది. అయితే కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలో ఉద్యోగాలు భ‌ర్తీ చేయ‌డంతో ఎటువంటి ఇత‌ర బెనిఫిట్స్ ఉండ‌వు.

ద‌ర‌ఖాస్తు చేసే విధానం…

ద‌ర‌ఖాస్తును ఆన్‌లైన్‌లో చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో రూ.750 ఫీజు చెల్లించి ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://ibpsonline.ibps.in/ippblsep24/ అందుబాటులో ఉంది. ఈ డైరెక్ట్ లింక్‌లోకి వెళ్లి ద‌ర‌ఖాస్తును చేసుకోవ‌చ్చు.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వ‌రరావు జ‌రజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner

సంబంధిత కథనం