Trains Diversion: వచ్చే వారం ఆ రైళ్లు బెజవాడ జంక్షన్‌లోకి రావు.. రాయనపాడు-రామవరప్పాడు మీదుగానే రాకపోకలు-next week those trains will not enter bejawada junction ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Trains Diversion: వచ్చే వారం ఆ రైళ్లు బెజవాడ జంక్షన్‌లోకి రావు.. రాయనపాడు-రామవరప్పాడు మీదుగానే రాకపోకలు

Trains Diversion: వచ్చే వారం ఆ రైళ్లు బెజవాడ జంక్షన్‌లోకి రావు.. రాయనపాడు-రామవరప్పాడు మీదుగానే రాకపోకలు

HT Telugu Desk HT Telugu
Jul 30, 2024 10:01 AM IST

Trains Diversion: విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో విశాఖమార్గంలో మూడో రైల్వే లైన్ ఇంటర్‌ లాకింగ్, నాన్ ఇంటర్ లాకింగ్ పనులతో పలు రైళ్లు విజయవాడ జంక్షన్‌ రాకుండానే వారం రోజుల పాటు రాకపోకలు సాగించనున్నాయి.

ఈ వారం ఆ రైళ్లు విజయవాడ జంక్షన్‌కు రావు
ఈ వారం ఆ రైళ్లు విజయవాడ జంక్షన్‌కు రావు

Trains Diversion: విజయవాడ డివిజన్ మీదుగా విజయవాడ, న్యూ వెస్ట్ బ్లాక్ హట్ మధ్య మూడో లైన్ కమీషన్ కోసం ప్రీ-నాన్-ఇంటర్‌లాకింగ్, నాన్-ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా రైళ్లను మ‌ళ్లిస్తున్న‌ట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె సందీప్ తెలిపారు.

రైళ్లు దారి మళ్లింపు

1. రాయనపాడు -గుడివాడ, నిడదవోలు (విజయవాడ బైపాస్ చేయడం) రామవరప్పాడు వద్ద తాత్కాలికంగా నిలిపివేస్తారు. విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెంలో స్టాప్‌పేజ్‌లు తొలగించారు.

విశాఖపట్నం నుండి బ‌య‌లుదేరే విశాఖపట్నం-హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్ (12727) రైలు దారి మ‌ళ్లిస్తారు. ఈ రైలు ఆగ‌స్టు 3 నుంచి ఆగ‌స్టు 11 వ‌ర‌కు దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది.

హైదరాబాద్‌లో బయలుదేరి హైదరాబాద్-విశాఖపట్నం గోదావరి ఎక్స్‌ప్రెస్ (12728) రైలు దారి మ‌ళ్లిస్తారు. ఈ రైలు ఆగ‌స్టు 3 నుంచి ఆగ‌స్టు 11 వ‌ర‌కు దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది.

సీఎస్‌టీ ముంబాయి నుంచి బ‌య‌లుదేరే సీఎస్‌టీ ముంబాయి-భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (11019) రైలు దారి మ‌ళ్లిస్తారు. ఈ రైలు ఆగ‌స్టు 2 నుంచి ఆగ‌స్టు 10 వ‌ర‌కు దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది.

భువనేశ్వర్‌లో బయలుదేరే భువనేశ్వర్-సీఎస్‌టీ ముంబాయి కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (11020) రైలు దారి మ‌ళ్లిస్తారు. ఈ రైలు ఆగ‌స్టు 2 నుంచి ఆగ‌స్టు 10 వ‌ర‌కు దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది.

టాటా నుండి బయలుదేరే టాటా- యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (18111) రైలు దారి మ‌ళ్లిస్తారు. ఈ రైలు ఆగ‌స్టు 8న‌ దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది.

యశ్వంత్‌పూర్‌లో బయలుదేరే యశ్వంత్‌పూర్-టాటా ఎక్స్‌ప్రెస్ (18112) రైలు దారి మ‌ళ్లిస్తారు. ఈ రైలు ఆగ‌స్టు 4న దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది.

విశాఖపట్నం నుండి బ‌య‌లుదేరే విశాఖపట్నం - న్యూఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్ (20805) రైలు దారి మ‌ళ్లిస్తారు. ఈ రైలు ఆగ‌స్టు 2 నుండి ఆగస్టు 10 వ‌ర‌కు మ‌ళ్లించిన మార్గంలో నడుస్తుంది.

న్యూఢిల్లీ నుండి బ‌య‌లుదేరే న్యూఢిల్లీ-విశాఖపట్నం ఏపీ ఎక్స్‌ప్రెస్ (20806) రైలు దారి మ‌ళ్లిస్తారు. . ఈ రైలు ఆగ‌స్టు 2 నుండి ఆగ‌స్టు 10 వ‌ర‌కు మళ్లించిన మార్గంలో నడుస్తుంది.

2. రామవరప్పాడు-రాయనపాడు (బైపాసింగ్విజయవాడ) మీదుగా రైళ్ల మళ్లింపు రామవరపాడు వద్ద తాత్కాలికంగా ఆగుతాయి. దీంతో విజయవాడ స్టాప్ తొలగించారు.

విశాఖపట్నం నుండి బయలుదేరే విశాఖపట్నం- ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ (18519) రైలు దారి మ‌ళ్లిస్తారు. ఈ రైలు ఆగ‌స్టు 2 నుండి ఆగ‌స్టు 10 వ‌ర‌కు దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది.

ఎల్‌టీటీ నుండి బ‌య‌లుదేరే ఎల్‌టీటీ- విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (18520) రైలు దారి మ‌ళ్లిస్తారు. ఈ రైలు ఆగ‌స్టు 2 నుండి ఆగ‌స్టు 10 వ‌ర‌కు దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది.

3. రామవరప్పాడు, రాయనపాడు- గుణదల (బైపాసింగ్ విజయవాడ) రాయనపాడు వద్ద తాత్కాలిక ఆపుతారు. దీంతో విజయవాడ స్టాప్‌ను నిలిపివేశారు.

విశాఖపట్నం నుండి బ‌య‌లుదేరే విశాఖపట్నం-సికింద్రాబాద్ గరీబ్రత్ ఎక్స్‌ప్రెస్ (12739) రైలు దారి మ‌ళ్లిస్తారు. ఈ రైలు ఆగ‌స్టు 2 నుండి ఆగ‌స్టు 10 వ‌ర‌కు దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది.

సికింద్రాబాద్ నుండి బ‌య‌లుదేరే సికింద్రాబాద్-విశాఖపట్నం గరీబ్రత్ ఎక్స్‌ప్రెస్ (12740) రైలు దారి మ‌ళ్లిస్తారు. ఈ రైలు ఆగ‌స్టు 2 నుండి ఆగ‌స్టు 10 వ‌ర‌కు దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది.

విశాఖపట్నం నుండి బ‌య‌లుదేరే విశాఖపట్నం- గాంధీధామ్ ఎక్స్‌ప్రెస్ (20803)రైలు దారి మ‌ళ్లిస్తారు. ఈ రైలు ఆగ‌స్టు 8న‌ దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది.

గాంధీధామ్ నుండి బయలుదేరే గాంధీధామ్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (20804) రైలు దారి మ‌ళ్లిస్తారు. ఈ రైలు ఆగ‌స్టు 4న‌ దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది.

పూరి నుండి బయలుదేరే పూరీ-ఓఖా ఎక్స్‌ప్రెస్ (20819) రైలు దారి మ‌ళ్లిస్తారు. ఈ రైలు ఆగ‌స్టు 5న‌ దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది.

ఓఖా నుండి బయలుదేరే ఓఖా-పూరి ఎక్స్‌ప్రెస్ (20820) రైలు దారి మ‌ళ్లిస్తారు. ఈ రైలు ఆగ‌స్టు 7న‌ దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది.

నిజాముద్దీన్ నుండి బయలుదేరే నిజాముద్దీన్-విశాఖపట్నం స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్ (12804) రైలు దారి మ‌ళ్లిస్తారు. ఈ రైలు ఆగ‌స్టు 4 నుండి ఆగ‌స్టు 7 వ‌ర‌కు దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది.

విశాఖపట్నం నుండి బయలుదేరే విశాఖపట్నం- నిజాముద్దీన్ స్వర్ణజంతి ఎక్స్‌ప్రెస్ (12803 ) రైలు దారి మ‌ళ్లిస్తారు. ఈ రైలు ఆగ‌స్టు 5 నుండి ఆగ‌స్టు 9 వ‌ర‌కు దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది.

షాలిమార్ నుండి బయలుదేరే షాలిమార్- హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ (18045) రైలు దారి మ‌ళ్లిస్తారు. ఈ రైలు ఆగ‌స్టు 2 నుండి ఆగ‌స్టు 10 వ‌ర‌కు దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది.

హైదరాబాద్ నుండి బయలుదేరే హైదరాబాద్-షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ (18046) రైలు దారి మ‌ళ్లిస్తారు. ఈ రైలు ఆగ‌స్టు 3 నుండి ఆగ‌స్టు 11 వ‌ర‌కు దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది.

విశాఖపట్నం నుండి బ‌య‌లుదేరే విశాఖపట్నం- సాయి నగర్ షిరిడీ ఎక్స్‌ప్రెస్ (18503) రైలు దారి మ‌ళ్లిస్తారు. ఈ రైలు ఆగ‌స్టు 8న‌ దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది. ప్రజలు ఈ మార్పులను గమనించి ప్ర‌యాణాలు చేసుకోవాల‌ని కె. సందీప్ కోరారు.

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner