AP TS Summer Updates: ఏప్రిల్ రికార్డు… 46 డిగ్రీలు దాటేసిన ఎండలు, మేలోను మంటలే… దడ పుట్టిస్తున్న వాతావరణం-new records in april temparatures and imd predicts more degrees in may ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ts Summer Updates: ఏప్రిల్ రికార్డు… 46 డిగ్రీలు దాటేసిన ఎండలు, మేలోను మంటలే… దడ పుట్టిస్తున్న వాతావరణం

AP TS Summer Updates: ఏప్రిల్ రికార్డు… 46 డిగ్రీలు దాటేసిన ఎండలు, మేలోను మంటలే… దడ పుట్టిస్తున్న వాతావరణం

Sarath chandra.B HT Telugu
May 01, 2024 05:58 AM IST

AP TS Summer Updates: ఏపీ, తెలంగాణల్లో ఏప్రిల్‌లో ఎండలు మండిపోయాయి. 46 డిగ్రీలను దాటేసి 47 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు చేరిపోయాయి. మే నెలలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోనున్నాయి.

మండే ఎండలతో మే నెల ప్రారంభం
మండే ఎండలతో మే నెల ప్రారంభం

AP TS Summer Updates: ఉక్కపోత, వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలతో ఏప్రిల్ నెల ప్రజల్ని అల్లాడించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో AP TS ఏప్రిల్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు Temparatures నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో గత పదేళ్ల.. పాత రికార్డులు చెరిగిపోయాయి.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మంగళవారం కర్నూలు జిల్లా జి.సింగవరంలో 46.4°C, నంద్యాల జిల్లా గోస్పాడులో 46.3°C, వైయస్సార్ జిల్లా బలపనూరులో 45.9°C, విజయనగరం జిల్లా రాజాంలో 45.3°C, అనకాపల్లి జిల్లా రావికమతంలో 44.8°C, అనంతపురం జిల్లా బోప్పేపల్లెలో 44.7°C, అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం, ప్రకాశం దొనకొండ 44.6°C, మన్యం జిల్లా సాలూరు, నెల్లూరు జిల్లా వేపినాపి అక్కమాంబాపురంలో 44.4°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.15 జిల్లాల్లో 44°C కు పైగా ఉష్ణోగ్రతలు నమోదైంది. రాష్ట్రంలో 67 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 83 మండలాల్లో వడగాల్పులు వీచాయి.

ఐఎండి IMD సూచనల ప్రకారం బుధవారం 34 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 216 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అలాగే ఎల్లుండి 30 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 149 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ SDMA మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

తెలంగాణలో మంటలు…

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన, నల్గొండ జిల్లా మాడుగుల పల్లిలో తెలంగాణలోనే అత్యధికంగా 46.2డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా రాయిల్ మండలం అల్లీపూర్‌లో 46.1 డిగ్రీలు, బీర్పూర్ మండలం కొల్వాయిలో 46, కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు, వీణవంక మండల కేంద్రాల్లో 46డిగ్రీలు నమోదయ్యాయి.

ఏప్రిల్ నెల Summer ఉష్ణోగ్రతల్లో ఇవే అత్యధికమని వాతావరణ శాఖ తెలిపింది. గత పదేళ్లలో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు ఇవే. తెలంగాణలో మరో 14 మండలాల్లో 45.5 డిగ్రీల నుంచి 45.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్గొండ జిల్లా మాడుగుల పల్ల, దామరచెర్ల, త్రిపురారం మండలాల్లో వడగాల్పులు వీచాయి. రాష్ట్రంలో బుధ, గురువారాల్లో ఎండ తీవ్రత కొనసాగింది.

ఏపీలో రాబోయే నాలుగు రోజుల ఉష్ణోగ్రతలు…

☀ మే 01 బుధవారం

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, SPSR నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైయస్సార్,తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 45°C-47°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు,బాపట్ల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 44°C-45°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ,శ్రీ సత్యసాయి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 42°C-44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

☀ మే 02 గురువారం

విజయనగరం, పార్వతీపురంమన్యం, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, SPSR నెల్లూరు, నంద్యాల, వైయస్సార్, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 45°C-47°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 43°C-45°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ ,పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40°C-42°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

☀ మే 03 శుక్రవారం

పల్నాడు, ప్రకాశం, SPSR నెల్లూరు, నంద్యాల, వైయస్సార్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 45°C-47°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 42°C-45°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40°C-42°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

☀ మే 04 శనివారం

విజయనగరం, పార్వతీపురం మన్యం, పల్నాడు, వైయస్సార్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 45°C-47°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, SPSR నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 42°C-45°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40°C-42°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

బుధవారం శ్రీకాకుళంలో 6 , విజయనగరంలో 16, పార్వతీపురంమన్యం 12 మండలాల్లో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉంది. శ్రీకాకుళం 15 , విజయనగరం 9, పార్వతీపురంమన్యం 2, అల్లూరిసీతారామరాజు 10, విశాఖపట్నం 1, అనకాపల్లి 15, కాకినాడ 12, కోనసీమ 3, తూర్పుగోదావరి 15, ఏలూరు 8, కృష్ణా 8, ఎన్టీఆర్ 6, గుంటూరు 15, పల్నాడు 21, బాపట్ల 6, ప్రకాశం 22, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు 18, శ్రీసత్యసాయి 2, తిరుపతి 12, అనంతపురం 4, అన్నమయ్య 3, చిత్తూరు 1, వైయస్సార్ 8 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

తెలంగాణలో కూడా అంతే…

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్‌లోనే 46డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భానుడి భగభగలతో జనం అల్లాడిపోతున్నారు. మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల, నల్గొండ, కరీంనగర్‌ జిల్లాల్లో భానుడు చెలరేగిపోయాడు.

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన, నల్గొండ జిల్లా మాడుగుల పల్లిలో తెలంగాణలోనే అత్యధికంగా 46.2డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా రాయిల్ మండలం అల్లీపూర్‌లో 46.1 డిగ్రీలు, బీర్పూర్ మండలం కొల్వాయిలో 46, కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు, వీణవంక మండల కేంద్రాల్లో 46డిగ్రీలు నమోదయ్యాయి.

ఏప్రిల్ నెల ఉష్ణోగ్రతల్లో ఇవే అత్యధికమని వాతావరణ శాఖ తెలిపింది. గత పదేళ్లలో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు ఇవే. తెలంగాణలో మరో 14 మండలాల్లో 45.5 డిగ్రీల నుంచి 45.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్గొండ జిల్లా మాడుగుల పల్ల, దామరచెర్ల, త్రిపురారం మండలాల్లో వడగాల్పులు వీచాయి. రాష్ట్రంలో బుధ, గురువారాల్లో ఎండ తీవ్రత కొనసాగింది.

తెలంగాణలో పలు ప్రాంతాల్లో మంగళవారం 45డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సిద్దిపేట జిల్లా థూల్‌ మిట్ట, నల్గొండ జిల్లా నాంపల్లి, జగిత్యాల జిల్లా వెల్గటూర్‌లో 45.9 డిగ్రీలు, నల్గొండ తెల్దేవరపల్లిలో 45.8డిగ్రీలు, బుగ్గబావిగూడ, మంచిర్యాల జిల్లా జన్నారం, నర్సాపూర్, నల్గొండ జిల్లా తిమ్మాపూర్‌లో 45.7డిగ్రీలు, నల్గొండ జిల్లా ఇబ్రహీంపట్నం, ములుగు జిల్లా మల్లూరు, గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 45.6డిగ్రీలు, కరీంనగర్ జిల్లా జమ్మికుంట, మంచిర్యాల జిల్లా కొండాపూర్‌, నిర్మల్ జిల్లా లింగాపూర్‌లో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Whats_app_banner

సంబంధిత కథనం