Karimnagar : నిప్పుల కొలిమిలా కరీంనగర్ , వచ్చే నాలుగు రోజుల్లో 42-47 డిగ్రీల ఉష్ణోగ్రతలు-karimnagar recorded high temperatures in many areas next five days severe heat wave ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar : నిప్పుల కొలిమిలా కరీంనగర్ , వచ్చే నాలుగు రోజుల్లో 42-47 డిగ్రీల ఉష్ణోగ్రతలు

Karimnagar : నిప్పుల కొలిమిలా కరీంనగర్ , వచ్చే నాలుగు రోజుల్లో 42-47 డిగ్రీల ఉష్ణోగ్రతలు

HT Telugu Desk HT Telugu
Apr 27, 2024 10:23 PM IST

Karimnagar : తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆరు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల దాటిపోయాయి.

నిప్పుల కొలిమిలా కరీంనగర్
నిప్పుల కొలిమిలా కరీంనగర్

Karimnagar : వేసవి ఎండలు(TS Summer) మండిపోతున్నాయి. భానుడి ప్రతాపానికి జనం విలవిలలాడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్(Karimnagar) జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు (Temperatures)పెరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆరు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. జమ్మికుంటలో రాష్ట్రంలోనే అత్యధికంగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా మంథనిలో 45.2, వీణవంకలో 45.1, వెల్గటూరులో 45.1, కొల్వాయి 45.1, అల్లీ పూర్ లో 45 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ పగటి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మర్తనపేటలో 44.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా అన్ని జిల్లాల్లోనూ కనిష్ఠ రాత్రి ఉష్ణోగ్రతలు 33.9 డిగ్రీల సెల్సియస్ ను దాటడంతో పగలు, రాత్రిపూటకూడా పూర్తిగా వేడి వాతావరణం నెలకొని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి ఏప్రిల్ లో ఐదు నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది. రాగల నాలుగు రోజుల్లో గరిష్ఠ పగటి ఉష్ణోగ్రతలు సరాసరీగా 42-47 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతాయని జగిత్యాల పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ జి.శ్రీనివాస్ తెలిపారు. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 27- 32 డిగ్రీల సెల్సియస్ వద్ద, గాలిలోతేమ 24- 61 శాతం వరకు నెలకొంటుందన్నారు. అక్కడక్కడ తేలికపాటి వర్షసూచన ఉందని వివరించారు.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

వడదెబ్బకు పది మంది మృతి

రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలతోపాటు (High Temperatures)వడగాల్పులు తీవ్రత ఉంది. వడదెబ్బకు గురై వేములవాడ మండలం అచ్చన్నపల్లిలో వలస కార్మికుడు శంకర్ సదా(33) మృతి చెందారు. బీహార్ కు చెందిన శంకర్ సదా అచ్చన్నపల్లిలో దాన్యం కొనుగోలు కేంద్రంలో హమాలీ కార్మికుడుగా పనిచేస్తున్నారు. రెండు రోజుల క్రితం మంథని మండలం విలోచనపురంలో ఉపాది హామీ కూలీ లక్ష్మీ, సిరిసిల్లకు చెందిన నేతకార్మికుడు ఈగరాజు వడదెబ్బకు(Heat Stroke) గురై ప్రాణాలు కోల్పోయారు. ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వడదెబ్బ బారిన పడి పది మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. ఏప్రిల్ చివరి వారంలోనే ఇలా ఉంటే మే మాసంలో ఏలా ఉంటుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

హై అలర్ట్ ..

ఓ వైపు అత్యధిక ఉష్ణోగ్రతలు, మరోవైపు వడగాల్పుల(Heat Wave)తో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వడదెబ్బకు గురై అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోతుండడంతో అధికారయంత్రాంగం అప్రమత్తమై హై అలర్ట్ (High Alert)ప్రకటించింది. పగటి పూట ఎవ్వరు బయటకు రావద్దని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కోరుతున్నారు. అత్యవసరం అయితే తప్ప అనవసరంగా ఎవరూ బయటకు రావద్దని సుచిస్తున్నారు. బయటకు వెళ్ళే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎండవేడి తీవ్రంగా ఉండడంతో ఆ లోపే బయట పనులు ముగించుకోవాలని కోరుతున్నారు. ఎన్నికల వేళ ప్రచారం సాగించే వారు సైతం ఉదయం సాయంత్రమే ప్రచారం చేసుకోవాలని కోరుతున్నారు. డిహైడ్రేషన్(Dehydration) కు గురికాకుండా నిత్యం వాటర్ తీసుకోవాలని, హెల్త్ సెంటర్ లలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని తెలిపారు.

HT TELUGU CORRESPONDENT K.V.REDDY, KARIMNAGAR

Whats_app_banner

సంబంధిత కథనం