MP Gorantla : ఆ న్యూడ్ వీడియో నాది కాదు.. మార్ఫింగ్ చేశారు
హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు సంబంధించి.. ఓ న్యూడ్ వీడియో వైరల్ అవుతోంది. ఓ మహిళతో ఆయన కాల్ మాట్లాడుతున్నట్టుగా ఉంది. అయితే దీనిపై ఆయన స్పందించారు.
వైసీపీ ఎంపీకి సంబందించిన ఓ వీడియో ఏపీలో వైరల్ అవుతోంది. ఓ మహిళతో ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్ మాట్లాడుతున్నారు. అదికాస్త.. అసభ్యకరంగా ఉంది. మాటలు కూడా అలానే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ వీడియో కాస్త బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎంపీ తీరుపై తీవ్ర ఆగ్రహం మెుదలైంది. నెటిజన్లు మండిపడుతున్నారు. ఎంపీ పదవిలో ఉండి.. ఇలాంటి పనులు చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు.
ఎంపీ గోరంట్ల మాధవ్ తీరుపై తెలుగుదేశం పార్టీ తీవ్రంగా స్పందిస్తోంది. పదవికే కళంకం తెచ్చేలా ఎంపీ గోరంట్ల వ్యవహరించారని టీడీపీ మహిళా నేతలు ఆరోపించారు. వెంటనే గోరంట్ల మాధవ్ పై సీఎం జగన్ యాక్షన్ తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. జగన్ తీసుకునే నిర్ణయాన్ని బట్టే ఆయన చిత్తశుద్ధి ఏంటనేది తెలుస్తుందన్నారు.
అయితే ఈ న్యూడ్ కాల్ వివాదంపై ఎంపీ గోరంట్ల మాధవ్ స్పందించారు. కావాలనే తన వీడియోను మార్ఫింగ్ చేశారని చెబుతున్నారు. ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా తెలిపారు. ఆశ్లీల వీడియో వెనక.. టీడీపీకి చెందిన వంశీ, విజయ్, శివకృష్ణ ఉన్నారని.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
'కుట్ర వెనుక టీడీపీకి చెందిన చింతకాయల విజయ్, పొన్నూరి వంశీ, శివకృష్ణ ఉన్నారు. ఇప్పటికే ఎస్పీకి, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. దమ్ము, ధైర్యం ఉంటే నేరుగా ఎదుర్కోవాలి. ఈ వీడియోను సర్క్యులేట్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ‘నేను జిమ్ చేసే టైమ్ లో తీసిన వీడియోలను మార్ఫింగ్ చేశారు. ఆ తర్వాత.. చెత్త వీడియోలను తయారు చేయించారు. బాధ్యులపై పరువు నష్టం దావా వేస్తాను.'గోరంట్ల మాధవ్ అన్నారు.