Sonu Sood Help : సోనూసూద్ ఆప‌న్న హ‌స్తం, పేద విద్యార్థిని ఉన్నత చ‌దువుకు హామీ-kurnool actor sonu sood lends hand to poor students promises to financial help to higher education ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Sonu Sood Help : సోనూసూద్ ఆప‌న్న హ‌స్తం, పేద విద్యార్థిని ఉన్నత చ‌దువుకు హామీ

Sonu Sood Help : సోనూసూద్ ఆప‌న్న హ‌స్తం, పేద విద్యార్థిని ఉన్నత చ‌దువుకు హామీ

HT Telugu Desk HT Telugu
Jul 20, 2024 06:23 PM IST

Sonu Sood Help : కర్నూల్ కు చెందిన పేద విద్యార్థిని చదువుకు సినీ నటుడు సోనూసూద్ ఆపన్న హస్తం అందించారు. ఆమె ఉన్నత చదువులు చదివేందుకు అండగా ఉంటానని సోనూ సూద్ హామీ ఇచ్చారు.

సోనూసూద్ ఆప‌న్న హ‌స్తం, పేద విద్యార్థిని ఉన్నత చ‌దువుకు హామీ
సోనూసూద్ ఆప‌న్న హ‌స్తం, పేద విద్యార్థిని ఉన్నత చ‌దువుకు హామీ

Sonu Sood Help : పేద విద్యార్థుల‌కు, పేద‌లకు విద్య, వైద్యం వంటి వాటిల్లో సాయం చేయ‌డంలో ముందుండే యాక్టర్ సోనూసూద్, ఆంధ్రప్రదేశ్‌లోని ఒక పేద అమ్మాయి ఉన్నత చ‌దువుకు హామీ ఇచ్చారు. ఆమె ఉన్నత చ‌దువుల్లో అడ్మిష‌న్ పొంద‌డానికి తాను మ‌ద్దతుగా ఉంటాన‌ని పేర్కొన్నారు. సోష‌ల్ మీడియా ఎక్స్‌లో ఎవ‌రో పెట్టిన పోస్టుతో వ‌చ్చిన చిన్న విజ్ఞప్తికి సోనూసూద్ ఆప‌న్న హ‌స్తమందించారు.

yearly horoscope entry point

క‌ర్నూల్ జిల్లా ఆస్పరి మండ‌లం బ‌న‌వ‌నూరు గ్రామానికి చెందిన దేవి కుమారి అనే యువ‌తి చ‌దువుపై మ‌క్కువ ఎక్కువ ఆమె క‌ష్టప‌డి ఇంట‌ర్మీడియ‌ట్ పూర్తి చేసింది. పేద కుటుంబం కావ‌డంతో ఉన్నత చ‌దువుకు స్వస్తి చెప్పాల్సిన అవ‌స‌రం ఏర్పడింది. అయితే దేవి కుమారికి మాత్రం చ‌ద‌వాల‌ని ఉంది. బీఎస్సీ, ఆపై ఉన్నత విద్యను అభ్యసించాల‌ని ఉంది. కానీ పేద‌రికం అడ్డు వ‌స్తోంది. కుటుంబ ఆర్థిక ప‌రిస్థితి స‌హ‌క‌రించ‌టం లేద‌ని, త‌న‌కు బీఎస్సీ చ‌ద‌వాల‌ని ఉంద‌నే విష‌యాన్ని తెలుపుతూ ఉన్న వీడియోను సోష‌ల్ మీడియా ఎక్స్ లో శైలు చౌద‌రి అనే యువ‌తి పోస్టు చేశారు. దేవి కుమారికి ఏదో ఒక‌టి చేయండ‌ని పోస్టులో రాశారు. ద‌య‌చేసి ఆ అమ్మాయికి సహాయం చేయండని పోస్టులో పేర్కొంది. ఈ పోస్టును యాక్టర్‌ సోనూసూద్‌కు ట్యాగ్ చేశారు. దీనికి స్పందించిన యాక్టర్ సోనూసూద్ "దేవి కుమారి కాలేజీ వెళ్లేందుకు సిద్ధంగా ఉండు, నీ చ‌దువును ఆపొద్దు" అని రిప్లై ఇచ్చారు.

అలాగే అజ‌య్ డేవిడ్ అనే వ్యక్తి కూడా ఈ అమ్మాయి ప‌రిస్థితిని వివ‌రిస్తూ అమ్మాయికి స‌హాయం చేయాల‌ని కోరుతూ ఆమె త‌ల్లిదండ్రుల‌తో కూడిన ఫొటోను ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ పోస్టును కూడా సోనూసూద్‌కు ట్యాగ్ చేశారు. దీనికి స్పందించిన సోనూసూద్ దేవి కుమారికి న‌చ్చిన కాలేజీలో అడ్మిష‌న్ వ‌చ్చేలా చూసుకుంటాన‌ని హామీ ఇస్తూ రిప్లై ఇచ్చారు. ఆమెకు స‌హాయం చేయ‌డానికి ముందుకు వ‌చ్చారు.

ఈ సంద‌ర్భంగా దేవి కుమారి మాట్లాడుతూ "మేము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మా త‌ల్లిదండ్రులు చ‌దువు కొన‌సాగించ‌డానికి వీలు లేదని అన్నారు. కానీ నాకు చ‌దువు ప‌ట్ల మ‌క్కువ ఎక్కువ‌. త‌ల్లిదండ్రులు చ‌దువు ఆపేయాల‌న్నప్పుడు తాను చాలా నిరాశ చెందాను. ఆ సమ‌యంలో సోనూసూద్ సార్ స‌హాయం చేశారు. దీంతో నేను చ‌దువును కొన‌సాగిస్తున్నాను. ఆయ‌న చాలా ఉన్నతమైన వ్యక్తి. నాకు ఆయ‌న దేవుడితో స‌మానం. ధ‌న్యవాదాలు సోనూసూద్ సార్‌" అంటూ ఆమె పేర్కొంది. సోనూసూద్ ఫొటోతో ఉన్న ఫ్లెక్సీ బ్యాన‌ర్‌కు ఆమె కుటుంబం పాలాభిషేకం చేశారు.

ఈ వీడియోను సోనూసూద్ ఎక్స్‌లో పోస్టు చేస్తూ "దేవి మీ అంద‌రి ప్రేమ‌కు ధ‌న్యవాదాలు. బాగా చ‌దువుకో. మీ కాలేజీ అడ్మిష‌న్ పూర్తి అయింది. ఈ ఆంధ్ర అమ్మాయిని ఉన్నతంగా తీర్చిదిద్ది, ఆమె కుటుంబం గ‌ర్వప‌డేలా చేద్దాం. మార్గద‌ర్శక‌త్వం చేసిన‌ సీఎం నారా చంద్రబాబుకి ధ‌న్యవాదాలు" అంటూ ఎక్స్‌లో పేర్కొన్నారు. అంతేకాదు సీఎం చంద్రబాబును కూడా ట్యాగ్ చేశారు. అలాగే బేటీ ప‌డావో...బేటీ బ‌చావో అంటూ సోనూసూద్ పోస్టులో రాసుకొచ్చారు.

Whats_app_banner

సంబంధిత కథనం