Rakul Preet Singh: అభిమాని ప్రేమకు రకుల్ ఫిదా - ఆమెతో ఒక్క ఫొటో కోసం కర్నూల్ నుంచి హైదరాబాద్ వచ్చాడట!
Rakul Preet Singh: తనను కలిసేందుకు అభిమాని చేసిన పనికి రకుల్ ప్రీత్ సింగ్ ఫిదా అయ్యింది. రకుల్‌ను కలవడం కోసం ఆ అభిమాని ఏం చేశాడంటే...
Rakul Preet Singh: అభిమానులు చూపించే ప్రేమ, ఆరాధన చూసి కొన్ని సార్లు స్టార్స్ కూడా ఫిదా అవుతోంటారు. వారి అంతులేని అభిమానానికి పొంగిపోతుంటారు. రకుల్ ప్రీత్‌సింగ్‌కు అలాంటి అనుభవమే ఎదురైంది. ఇటీవల హైదరాబాద్‌లో స్టోర్ లాంఛ్ ఈవెంట్‌లో రకుల్ ప్రీత్ సింగ్ పాల్గొన్నది. రకుల్ ఈ ఈవెంట్‌లో పాల్గొంటున్న విషయం ముందే తెలియడంతో ఆమెను చూసేందుకు ఓ అభిమాని కర్నూల్ నుంచి హైదరాబాద్ వచ్చాడట.
ఐదారు గంటల పాటు జర్నీ చేసి చివరకు తన అభిమాన నటిని కలుసుకున్నాడు. రకుల్‌తో కలిసి ఓ ఫొటో దిగాడు. ఆ ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. రకుల్‌ను కలిసి మాట్లాడాలని చాలా రోజులుగా అనుకుంటున్నానని, అది నేటితో తీరిందని సంతోషంగా ట్వీట్ చేశాడు. మీతో కలిసి పనిచేసే అవకాశం ఉంటుందని మీ మాటల ద్వారా నాలో స్ఫూర్తిని నింపారంటూ పేర్కొన్నాడు. మిమ్మల్ని కలవడానికే కర్నూల్ నుంచి హైదరాబాద్ వచ్చానని పేర్కొన్నాడు.
అతడి అభిమానానికి రకుల్ ఉప్పొంగిపోయింది. కర్నూల్ నుంచి తనకు కలవడానికే హైదరాబాద్ వచ్చాడని తెలుసుకొని ఆనందపడింది. అతడి ట్వీట్‌కు రిప్లై ఇచ్చింది. కాగా గత కొంతకాలంగా టాలీవుడ్‌కు దూరంగా ఉంటోంది రకుల్ ప్రీత్‌సింగ్. 2021లో రిలీజైన కొండపొలం తర్వాత తెలుగులో ఏ సినిమా చేయలేదు. హిందీలో మాత్రం వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.
గ్లామర్ రోల్స్‌తో పాటు ఛత్రీవాలీ లాంటి ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. తమిళంలోనూ కమల్‌హాసన్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఇండియన్ -2తో పాటు శివకార్తికేయన్ అయాలాన్ సినిమాల్లో నటిస్తోంది.