IRCTC Shirdi Tour : ఈ నెలలో షిర్డీ, శనిశిగ్నాపూర్ ట్రిప్ ప్లాన్ ఉందా? విజయవాడ నుంచి టూర్ ప్యాకేజీ వచ్చేసింది! వివరాలివే
IRCTC Vijayawada Shirdi Tour: విజయవాడ నుంచి షిర్డీకి టూరిజం ప్యాకేజీ వచ్చేసింది. శనిశిగ్నాపూర్ కు కూడా చూసి రావొచ్చు. ఈ ప్యాకేజీని IRCTC టూరిజం ఆపరేట్ చేస్తుంది. ధరలతో పాటు షెడ్యూల్ వివరాలను ఇక్కడ చూడొచ్చు……
షిర్డీ టూర్ ప్యాకేజీ (image source from @SSSTShirdi twitter)
IRCTC Shirdi Vijayawada Tour : అధ్యాత్మిక ప్రాంతాలను దర్శించుకోవాలని అనుకుంటున్నారా….? తక్కువ ధరలోనే మీ సొంత ప్రాంతాల నుంచి వెళ్లి… కొత్త ప్రదేశాలను చూసి రావొచ్చు. ఈ తరహా ప్యాకేజీలను ఐఆర్‌సీటీసీ టూరిజం తక్కువ ధరలోనే ప్రకటిస్తోంది.
తాజాగా విజయవాడ నుంచి షిర్డీ వెళ్లేందుకు టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీని జులై 30, 2024వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీలో కుదరకపోతే మరో తేదీలో కూడా బుకింగ్ చేసుకుని వెళ్లొచ్చు. https://www.irctctourism.com/p వెబ్ సైట్ లోకి బుకింగ్ తో పాటు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ప్యాకేజీ వివరాలు:
- విజయవాడ నుంచి షిర్డీతో పాటు శనిశిగ్నాపూర్ వెళ్లేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది.
- “SAI SANNIDHI EX VIJAYAWADA” పేరుతో IRCTC టూరిజం ఈ ప్యాకేజీని ాపరేట్ చేస్తోంది.
- 4 రోజుల టూర్ ప్యాకేజీ. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ జులై 30, 2024 తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీలో మిస్ అయితే మరో తేదీలో వెళ్లొచ్చు.
- ట్రైన్ జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు.
- విజయవాడలోనే కాకుండా.. ఖమ్మం, సికింద్రాబాద్, విజయవాడ, వరంగల్ రైల్వే స్టేషన్లల్లో కూడా బుకింగ్ చేసుకున్న వాళ్లు రైలు ఎక్కే ఛాన్స్ ఉంటుంది.
- తొలి రోజు విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణం మొదలవుతుంది. రాత్రి 10.15 గంటలకు షిర్డీ ఎక్స్‌ప్రెస్ రైలు(17208- Sainagar Shirdi Express) ఎక్కాలి. నైట్ అంతా ప్రయాణం ఉంటుంది.
- రెండో రోజు ఉదయం 06.15 గంటలకు నాగర్‌సోల్ చేరుకుంటారు. ఆ తర్వాత షిర్డీకి వెళ్తారు. సాయిబాబాను దర్శించుకుంటారు. సాయంత్రం షాపింగ్ కోసం ఫ్రీ టైమ్ ఉంటుంది. రాత్రి షిర్డీలోనే బస చేస్తారు.
- 3వ రోజు ఉదయం శనిశిగ్నాపూర్ కు వెళ్తారు. అక్కడ్నుంచి మళ్లీ షిర్టీ చేరుకుంటారు. రాత్రి 7.30 గంటలకు నాగర్‌సోల్ స్టేషన్‌లో తిరుగు ప్రయాణం మొదలవుతుంది. తెల్లవారుజామున మూడు గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్ చేరుకోవడంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
- విజయవాడ షిర్డీ టూర్ ప్యాకేజీ ధరలు : కంఫర్ట్ క్లాస్ (3ఏసీ)లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 16,165గా నిర్ణయించారు. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.10045, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 8440 చెల్లించాలి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి.
- స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు 5,985గా ధర ఉంది. సింగిల్ షేరింగ్ కు రూ. 13705గా నిర్ణయించారు. డబుల్ షేరింగ్ కు రూ. 7590గా ఉంది.
- ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 040-27702407, 9701360701 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.
- https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి కూడా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మరిన్ని ప్యాకేజీలను కూడా ఈ సైట్ లో చూడొచ్చు.
- విజయవాడ - షిర్డీ టూర్ ప్యాకేజీ డైరెక్ట్ లింక్ - https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR076
- విజయవాడనే కాకుండా… విశాఖ, తిరుపతి, రాజమండ్రితో పాటు పలు నగరాల నుంచి పలు రకాల ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.