Palnadu Bad Teacher: విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన, ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు
Palnadu Bad Teacher: విద్యా బుద్ధులు నేర్పించాల్సిన గురువే విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఉపాధ్యాయుడికి తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు.
Palnadu Bad Teacher: విద్యా బుద్ధులు నేర్పించాల్సిన గురువే విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఉపాధ్యాయుడికి తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటనలో ముగ్గురిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇద్దరిని సర్వీసు నుంచి తొలగించారు.
పల్నాడు జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. విద్యా బుద్ధులు నేర్పించాల్సిన గురువే విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఉపాధ్యాయుడికి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేశారు. ఉపాధ్యాయుడు రవి కుమార్ తో పాటు, ప్రిన్సిపాల్ నయోమి, వైస్ ప్రిన్సిపాల్ శుభశ్రీలను సస్పెండ్ కు గురయ్యారు. అలాగే కీచక ఉపాధ్యాయుడికి సహకరించిన జూనియర్ అసిస్టెంట్ ఖాజావలి, గర్ల్స్ హాస్టల్ వార్డెన్ నాగలక్ష్మిని సర్వీస్ నుంచి తొలగించారు.
ఈ ఘటన పల్నాడు జిల్లా కారంపూడిలో గురువారం చోటు చేసుకుంది. విద్యా బుద్ధులు నేర్పించాల్సిన తండ్రి లాంటి ఉపాధ్యాయుడే విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పడంతో వారంతా ఒక్కసారిగా పాఠశాలకు చేరుకుని, కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు.
పల్నాడు జిల్లా కారంపూడిలోని ఆదర్శ పాఠశాలలో ఉపాధ్యాయుడు బీ.రవికుమార్ ఇంగ్లీష్ బోధిస్తున్నారు. అనవసరంగా విద్యార్థినులను ల్యాబ్ కు పిలిపించి, వారితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఇటీవలి తొమ్మిదో తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థినులను ల్యాబ్ కు పిలిపించారు. సార్ పిలిచారని విద్యార్థినులు వెళ్లారు. అక్కడ వారి పట్ల ఉపాధ్యాయుడు బీ రవి కుమార్ అసభ్యకరంగా ప్రవర్తించాడు.
అలాగే రాత్రి వేళల్లో విద్యార్థినులకు ఫోన్లు చేస్తూ, అసభ్యకరంగా మెసేజ్ లు చేస్తున్నాడు. ఇలా ఉపాధ్యాయుడు ఫోన్లు, మెసేజ్ లు చేయడాన్ని ఒక విద్యార్థిని తండ్రి గమనించాడు. దీంతో కుమార్తెను ప్రశ్నించాడు. కుమార్తె మొత్తం విషయాన్ని తండ్రికి వివరించింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
దీంతో గురువారం విద్యార్థినులతో కలిసి తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లారు. అక్కడ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. ఆడవాళ్లు, మగవాళ్లు కలిసి చితకబాదారు. దీంతో విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ నయోమి తల్లిదండ్రులకు సర్థిచెప్పే ప్రయత్నం చేశారు. ఆ ఉపాధ్యాయుడిని రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే తల్లిదండ్రులు ఎంతకీ వినలేదు. దీంతో పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన ప్రిన్సిపాల్, ఎంఈఓ రవి కుమార్ కు సమాచారం ఇచ్చారు. ఆయన పోలీసులకు సమాచారం అందించారు.
ఎంఈఓ రవి కుమార్ కూడా పాఠశాలకు చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం దీనిపై ఆర్జేడీ లింగేశ్వర రెడ్డి, డీఈఓ వెంకటేశ్వర్లుకు సమాచారం అందించారు. అధికారులు విచారిస్తుండగా మళ్లీ తల్లిదండ్రులు ఉపాధ్యాయుడుపై దాడికి దిగారు. దీంతో పోలీసులు పాఠశాల వద్దకు చేరుకుని తల్లిదండ్రులను అడ్డుకున్నారు. ఉపాధ్యాయుడిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఆగ్రహించిన తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ పై సైతం దాడి చేశారు.
ఉపాధ్యాయుడుతో పాటు ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ సస్పెన్షన్
బాధిత విద్యార్థినుల నుండి ఎస్ఐ అమీర్ ఫిర్యాదు తీసుకుని, కేసు నమోదు చేశారు. పరిస్థితి చేతులు దాటడంతో ఆర్జేడీ లింగేశ్వర రెడ్డి, డీఈఓ వెంకటేశ్వర్లు, డిప్యూటీ డీఈఓ ఏసుబాబు పాఠశాలకు చేరుకుని విచారించారు. ఉపాధ్యాయుడు రవి కుమార్ తో పాటు, ప్రిన్సిపాల్ నయోమి, వైస్ ప్రిన్సిపాల్ శుభశ్రీలను సస్పెండ్ చేశారు. అలాగే కీచక ఉపాధ్యాయుడికి సహకరించిన జూనియర్ అసిస్టెంట్ ఖాజావలి, గర్ల్స్ హాస్టల్ వార్డెన్ నాగలక్ష్మిని సర్వీస్ నుంచి తొలగించారు.
( జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)