APSRTC Packages: హనుమాన్ దర్శన్ యాత్ర, APSRTC సూప‌ర్ ల‌గ్జ‌రీ స్పెషల్ స‌ర్వీసులు-hanuman darshan yatra apsrtc super luxury special services ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Apsrtc Packages: హనుమాన్ దర్శన్ యాత్ర, Apsrtc సూప‌ర్ ల‌గ్జ‌రీ స్పెషల్ స‌ర్వీసులు

APSRTC Packages: హనుమాన్ దర్శన్ యాత్ర, APSRTC సూప‌ర్ ల‌గ్జ‌రీ స్పెషల్ స‌ర్వీసులు

HT Telugu Desk HT Telugu
Aug 08, 2024 01:57 PM IST

APSRTC Packages: పుణ్య‌క్షేత్రం హనుమాన్ దర్శన్ యాత్రకు వెళ్లే భ‌క్తుల‌కు శుభ‌వార్త. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రోడ్డు ర‌వాణ సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) పుణ్య‌క్షేత్రాలు హనుమాన్ దర్శన్ యాత్రకు స్పెష‌ల్ స‌ర్వీసును అందుబాటులోకి తెచ్చింది.

హనుమాన్ దర్శన్ యాత్రకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
హనుమాన్ దర్శన్ యాత్రకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

APSRTC Packages: పుణ్య‌క్షేత్రం హనుమాన్ దర్శన్ యాత్రకు వెళ్లే భ‌క్తుల‌కు శుభ‌వార్త. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రోడ్డు ర‌వాణ సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) పుణ్య‌క్షేత్రాలు హనుమాన్ దర్శన్ యాత్రకు స్పెష‌ల్ స‌ర్వీసును అందుబాటులోకి తెచ్చింది. హిందూపురం నుంచి కసాపురం, మురిడి, నేమకల్లులో శ్రీ ఆంజ‌నేయ‌స్వామివారి ద‌ర్శ‌నానికి ఏపీఎస్ఆర్టీసీ స్పెష‌ల్ సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్ స‌ర్వీస్‌ను తీసుకొచ్చింది. ఈ స‌ర్వీస్‌ను యాత్రికులు వినియోగించుకోవాల‌ని ఆర్టీసీ కోరుతోంది.

ఆర్టీసీ నిత్యం కొత్త స‌ర్వీసుల‌ను, ప్ర‌త్యేక స‌ర్వీసుల‌ను అందుబాటులో తెస్తుంది. డిమాండ్‌ను బ‌ట్టీ, ప్ర‌యాణీకులు, యాత్రీకులు అత్య‌ధికంగా వెళ్లే మార్గాల‌కు అతిత‌క్కువ ధ‌ర‌కు, సుర‌క్షిత‌మైన ప్ర‌యాణాన్ని ఆర్టీసీ అందిస్తుంది. అందులో భాగంగానే రామేశ్వరం యాత్రకి ఈ బస్సు స‌ర్వీస్‌లు అందుబాటులోకి తెచ్చింది.

ఆర్టీసీ సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్సు స‌ర్వీస్ (పుష్‌బ్యాక్ 2+2) సీట్ల‌తో హిందూపురం నుంచి క‌సాపురం, మురిడి, నేమ‌క‌ల్లులోని శ్రీ ఆంజేయ‌స్వామి వారి ద‌ర్శ‌న‌ యాత్ర‌కు యాత్రికుల కోసం అందుబాటులోకి తెచ్చింది. ఈ యాత్రలో మూడు ప్ర‌దేశాలు ఉంటాయి. ఒక రోజులోనే మూడు ప్రాంతాల్లోని మూడు దేవ‌స్థాన‌ముల్లో శ్రీ ఆంజ‌నేయ‌స్వామి వారి ద‌ర్శ‌నం చేసుకోవ‌చ్చు. శ్రావ‌ణ మాసంలో ఆగ‌స్టు 10, 13, 17, 20, 24, 27, 31 తేదీల్లో ప్ర‌త్యేక స‌ర్వీసులు అందుబాటులో ఉంటాయి.

హిందూపురం బ‌స్ కాంప్లెక్స్‌లో ప్రారంభ‌మైన బ‌స్ క‌సాపురం చేరుకుంటుంది. అక్క‌డ‌ నూత‌నంగా ప్ర‌తిష్ఠించిన‌ శ్రీ ఆంజ‌నేయ‌స్వామి వారిని ద‌ర్శించుకొని, ఆ త‌రువాత అక్క‌డ నుండి బ‌య‌లుదేరి మురిడి కి వెళ్తుంది. అక్క‌డ మ‌రో రూపంలోని ఉన్న శ్రీ ఆంజ‌నేయ‌స్వామివారిని ద‌ర్శించుకుంటారు. అక్క‌డ నుండి బ‌య‌లుదేరి, నేమ‌క‌ల్లు చేరుకుంటుంది. అక్క‌డ ఇంకో రూపంలోని ప్ర‌తిష్ఠించిన ఆంజ‌నేయ‌స్వామి వారిని ద‌ర్శించుకుంటారు. తిరిగి అక్క‌డ నుండి హిందూపురం చేసుకుంటారు.

టిక్కెట్టు ధ‌ర రెండు వైపుల క‌లిపి ఒక్కరికి (పెద్ద‌ల‌కు) రూ.710 కాగా, పిల్ల‌ల‌కు రూ.380గా ఆర్టీసీ నిర్ణ‌యించింది. టిక్కెట్టు కావాల‌నుకునేవారు ఈ ఫోన్ నంబ‌ర్లు 8977225997, 9440834715 (ఎవీవీ ప్ర‌సాద్‌), 7382863007, 7382861308ల‌ను సంప్ర‌దించాలి. అప్పుడే టిక్కెట్టు బుక్ చేసుకోవ‌డం అవుతుంది. అలాగే ఆన్‌లైన్ రిజ‌ర్వేషన్ సౌక‌ర్యం ఉంది. అలాగే అడ్వాన్స్ రిజ‌ర్వేష‌న్ సౌక‌ర్యం కూడా ఉంది. యాత్రికులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని డిపో మేనేజ‌ర్ శ్రీ‌కాంత్ తెలిపారు.

(రిపోర్టింగ్ జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)