East Godavari News : రోడ్డు ప్రమాదంలో భర్త మృతి, న్యాయపోరాటం చేసిన మహిళకు రూ.1.12 కోట్ల పరిహారం!
East Godavari News : జాతీయ లోక్ అదాలత్ లో రోడ్డు ప్రమాదంలో కేసులో బాధిత కుటుంబానికి రూ.1.12 కోట్లు పరిహారం అందింది.
East Godavari News : జాతీయ లోక్ అదాలత్(National Lok adalat) లో యార్లగడ్డ బృందదేవి అనే మహిళ రూ.1.12 కోట్ల పరిహారం అందుకుంది. శనివారము తూర్పుగోదావరి జిల్లా(East Godavari) వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థానానికి సంబంధించిన ఒక రోడ్డు ప్రమాదం కేసులో బాధితురాలు యార్లగడ్డ బృందదేవి రూ.కోటి పన్నెండు లక్షల పరిహారం పొందారు.
రోడ్డు ప్రమాదం కేసులో
రోడ్డు ప్రమాదంలో(Road Accident case) తన భర్త మరణిచడంతో... తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థానం, మోటారు వాహన ప్రమాదాల దావా న్యాయస్థానంలో భార్య యార్లగడ్డ బృందదేవి, ఆమె కుమార్తెలు, ఆమె అత్త 2021లో కేసు వేశారు. తమ కేసుని రాజీమార్గంలో పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్ అదాలత్(National Lok Adalat) ద్వారా అవకాశం దొరికిందన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత 16 మార్చి 2024న రాజమహేంద్రవరంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో రూ.1,12,00,000/- పరిహారం అందజేసినట్లు వివరించారు. భర్తను కోల్పోయిన ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు చేయూతగా ఈ పరిహారం ఉపయోగపడుతుందని హర్షం వ్యక్తం చేశారు. ఆమె సమస్యకు సత్వర న్యాయం అందజేసిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కేసుకు పరిష్కారం చూపిన ఆమె న్యాయవాదులు, బీమా సంస్థ న్యాయవాదికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.