East Coast Special Trains : రైల్వే ప్రయాణికుల అలర్ట్, విశాఖ-సంత్రగచ్చి మధ్య ప్రత్యేక రైళ్లు
East Coast Special Trains : ప్రయాణికుల రద్దీతో విశాఖ-సంత్రగచ్చి మధ్య ఈస్ట్ కోస్టు రైల్వే ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. రెండు మార్గాల్లో మొత్తం 8 ట్రిప్పులు తిరిగే ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి తెచ్చారు.
రైల్వే ప్రయాణికుల అలర్ట్, విశాఖ-సంత్రగచ్చి మధ్య ప్రత్యేక రైళ్లు
East Coast Special Trains : ప్రయాణికుల రద్దీతో విశాఖ నుంచి సంత్రగచ్చికి ఈస్ట్ కోస్టు రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. విశాఖపట్నం-సంత్రగచ్చి మధ్య ప్రత్యేక రైళ్లు సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి విశాఖపట్నం-సంత్రాగచ్చి మధ్య (08502/01) (08506/05) రెండు మార్గాల్లో ఒక్కొ మార్గంలో నాలుగు ట్రిప్పులు తిరిగేలా ప్రత్యేక రైళ్లను నడపాలని ఈస్ట్ కోస్టు రైల్వే నిర్ణయించింది.
- ఈ క్రమంలో 08502 నంబర్ గల విశాఖపట్నం-సంత్రగచ్చి ప్రత్యేక రైలు ఈనెల 19, 21, 26, 28 తేదీల్లో ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్రత్యేక రైలు విశాఖపట్నంలో రాత్రి 11.45 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 03.25 గంటలకు సంత్రాగచ్చికి చేరుకుంటుంది.
- 08501 నంబర్ గల సంత్రాగచ్చి-విశాఖపట్నం ప్రత్యేక రైలు ఈనెల 20, 22, 27, 29 తేదీల్లో ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్రత్యేక రైలు సంత్రాగచ్చిలో సాయంత్రం 5.00 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు విశాఖపట్నానికి చేరుకుంటుంది.
- 08506 నంబర్ గల విశాఖపట్నం-సంత్రగచ్చి ప్రత్యేక రైలు ఈనెల 17, 22, 24, 29 తేదీల్లో ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్రత్యేక రైలు విశాఖపట్నంలో రాత్రి 11.45 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 03.25 గంటలకు సంత్రాగచ్చికి చేరుకుంటుంది.
- 08505 నంబర్ గల సంత్రాగచ్చి-విశాఖపట్నం ప్రత్యేక రైలు ఈనెల 18, 23, 25, 30 తేదీల్లో ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్రత్యేక రైలు సంత్రాగచ్చిలో సాయంత్రం 5.00 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు విశాఖపట్నానికి చేరుకుంటుంది.
- ఈ జంట రైళ్లు విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, ఖుర్దా రోడ్, భూవనేశ్వర్, కటక్, జాజ్ పూర్ కె రోడ్, భద్రక్, బాలాసోర్, ఖరగ్‌పూర్ మీదుగా ప్రయాణిస్తాయి. వీటి సేవలు ప్రయాణీకులు వినియోగించుకోవాలని రైల్వే శాఖ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.సందీప్ కోరారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు