Dasara Holidays in Andhra Pradesh 2023: ఏపీలో రేపటి నుంచి బడులకు దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు అక్టోబర్ 14వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రకటించారు. మొత్తం 11 రోజులు అంటే… అక్టోబరు 24 వరకు సెలవులు ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సెలవుల అనంతరం పాఠశాలలు అక్టోబరు 24న పునఃప్రారంభమవుతాయి.
మరోైవైపు తెలంగాణలో ఇవాళ్టి నుంచే బడులకు దసరా సెలవులు ప్రారంభమయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు అక్టోబర్ 14 నుంచి దసరా సెలవులు ప్రకటించారు. మొత్తం 13 రోజుల పాటు దసరా సెలవులు కొనసాగనున్నాయి. సెలవుల అనంతరం పాఠశాలలు అక్టోబరు 26న పునఃప్రారంభమవుతాయి.
తెలంగాణలో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన సమ్మెటివ్ అసెస్మెంట్ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. పరీక్షల ఫలితాలు సెలవుల అనంతరం వెల్లడిస్తారు. ఫార్మెటివ్ అసెస్మెంట్ - 1, 2 పరీక్షల మార్కులను గురువారం లోపు చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేయాలని ఉపాధ్యాయులకు విద్యాశాఖ ఆదేశించింది.
తెలంగాణలోని జూనియర్ కాలేజీలకు ఈ నెల 19 నుంచి సెలవులు ఇస్తున్నట్లు పేర్కొంది ఇంటర్ బోర్డు. 25 వరకు దసరా సెలవులు ఉంటాయని ప్రకటించింది. అక్టోబరు 26వ తేదీన కాలేజీలు పునఃప్రారంభం అవుతాయని తెలిపింది. ఉస్మానియా యూనివర్సిటీకి కూడా అక్టోబర్ 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించగా.. 25వ తేదీన యూనివర్సిటీతో పాటు అనుబంధ కాలేజీల్లో తరగతులు పునఃప్రారంభమవుతాయని ఓయూ రిజిస్ట్రార్ ఓ ప్రకటనలో తెలిపారు. వర్సిటీకి కూడా మొత్తం 11 రోజుల పాటు దసరా సెలవులు ఇచ్చారు.