CBN On Attacks : వైసీపీ కవ్వింపు చర్యలపై అలెర్ట్ గా ఉండండి - క్యాడర్ కు చంద్రబాబు సూచన-chandrababu gave key instructions on the attacks going on in ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cbn On Attacks : వైసీపీ కవ్వింపు చర్యలపై అలెర్ట్ గా ఉండండి - క్యాడర్ కు చంద్రబాబు సూచన

CBN On Attacks : వైసీపీ కవ్వింపు చర్యలపై అలెర్ట్ గా ఉండండి - క్యాడర్ కు చంద్రబాబు సూచన

Chandrababu On Attacks: ఏపీలో చోటుచేసుకుంటున్న దాడులపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. వైసీపీ కవ్వింపు చర్యల పట్ల క్యాడర్ తో పాటు నాయకులు సైతం అలెర్ట్ గా ఉండాలని సూచించారు.

చంద్రబాబు

Chandrababu On Attacks :  ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత పలుచోట్ల దాడులు జరుగుతున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇదే విషయంపై వైసీపీ గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేసింది. దీంతో వైసీపీ, టీడీపీ నేతల మధ్య అప్పుడే డైలాగ్ వార్ మొదలైంది. అంతేకాకుండా  ట్విట్టర్ లో నూ ఇరు పార్టీలు కౌంటర్లు ఇచ్చుకుంటున్నాయి.

ఏపీలో జరుగుతున్న దాడులపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం జరుగుతున్న వైసీపీ కవ్వింపు చర్యలు, దాడులపై టీడీపీ క్యాడర్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైసీపీ కవ్వింపు చర్యల పట్ల నాయకులు సైతం అలెర్ట్ గా ఉండాలన్నారు. ఎటువంటి దాడులు, ప్రతి దాడులు జరగకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

వైసీపీ మూకలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా పార్టీ కార్యకర్తలు పూర్తి సంయమనం పాటించాలని చంద్రబాబు సూచించారు. పోలీసు అధికారులు సైతం శాంతి భద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.