Banks Holiday: ఆదివారం బ్యాంకులు తెరుస్తారు.. సాధారణ లావాదేవీలు జరగవు… ప్రభుత్వ ఖాతాల నిర్వహణ కోసమే…-banks will open on sunday normal transactions will not take place only for management of government accounts ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Banks Holiday: ఆదివారం బ్యాంకులు తెరుస్తారు.. సాధారణ లావాదేవీలు జరగవు… ప్రభుత్వ ఖాతాల నిర్వహణ కోసమే…

Banks Holiday: ఆదివారం బ్యాంకులు తెరుస్తారు.. సాధారణ లావాదేవీలు జరగవు… ప్రభుత్వ ఖాతాల నిర్వహణ కోసమే…

Sarath chandra.B HT Telugu
Mar 22, 2024 09:43 AM IST

Banks Holiday: మార్చి 31 ఆదివారం దేశ వ్యాప్తంగా షెడ్యూల్డ్ బ్యాంకులు పనిచేయాలనే ఆర్‌బిఐ నిర్ణయం నేపథ్యంలో బ్యాంకులు వివరణ ఇచ్చాయి. బ్యాంకులు తెరిచినా సాధారణ లావాదేవీలు జరగవని స్పష్టం చేస్తున్నారు.

ఆదివారం బ్యాంకులకు సెలవే కానీ,...
ఆదివారం బ్యాంకులకు సెలవే కానీ,... (REUTERS)

Banks Holiday: ఈ ఏడాది మార్చి 31 ఆదివారం Sunday కూడా బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి. ఈ మేరకు బుధవారం రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన విడుదల చేసింది. మార్చి 31 ఆదివారం ప్రభుత్వ రంగ PSU బ్యాంకులన్నీ యథావిధిగా సేవలు అందిస్తాయని ఆర్‌బిఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో బ్యాంకులు ఆర్‌బిఐ ప్రకటనపై స్పష్టత ఇచ్చాయి. ఆదివారం బ్యాంకులు తెరుచుకున్నా సాధారణ లావాదేవీలు జరగవని వివరణ ఇస్తున్నారు.

ఏటా మార్చి 31వ తేదీతో బ్యాంకింగ్‌ లావాదేవీలు ముగుస్తాయి. ఆర్దిక సంవత్సరం ముగింపు సందర్భంగా అంతర్గత ఆడిటింగ్‌, లావాదేవీలను ముగించి కొత్త లావాదేవీల ప్రారంభానికి సిద్ధం చేస్తారు. ఈ ఏడాది మార్చి 31 ఆదివారం రావడంతో బ్యాంకు శాఖల్ని తెరవాలని ఆర్‌బిఐ ఆదేశించింది. ఈ క్రమంలో సాధారణ నగదు లావాదేవీలు, ఇతర బ్యాంకింగ్‌ సేవలు అందవని బ్యాంకులు స్పష్టం చేస్తున్నారు.

మార్చి 31వ తేదీన ప్రభుత్వ ఖాతాల నిర్వహణ కోసం మాత్రమే శాఖల్ని తెరుస్తారని ప్రభుత్వ రంగ బ్యాంకులు స్పష్టం చేస్తున్నారు. ఆదివారం బ్యాంకు టెల్లర్‌ సిబ్బంది అందుబాటులో ఉండరని చెబుతున్నారు. అధికారులు మాత్రమే ఉంటారని ప్రభుత్వ లావాదేవీలు, ఖాతాల నిర్వహణ కోసం బ్యాంకులు తెరుస్తారని స్పష్టం చేశారు. sa

సెలవు లేదని ప్రచారం…

ఆర్ధిక సంవత్సరం ముగింపు రోజు ఆదివారం రావడంతో ఆర్‌బిఐ ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ లావాదేవీలు Transactions నిర్వహించే బ్యాంకుల శాఖలు యథావిధిగా పనిచేయాలని ఆర్‌బిఐ సూచించింది.

సాధారణంగా మార్చి 31న ఫైనాన్షియల్ Financial Year ఇయర్ ముగిసిన తర్వాత ఏప్రిల్ 1న బ్యాంకులకు సెలవుగా పరిగణిస్తాయి. బ్యాంకు దస్త్రాల ఆడిటింగ్‌ కోసం ఏప్రిల్ 1న లావాదేవీలు నిర్వహించారు. ఈ ఏడాది మార్చి 31 ఆదివారం రావడంతో ఆ రోజు పనిచేయాలని ఆర్‌బిఐ ఆదేశించింది.

ఆర్ధిక సంవత్సరం ముగింపు సందర్భంగా ప్రభుత్వ లావాదేవీలను, ఖాతాల్లోకి నగదు చెల్లింపులు, జమలను యథావిధిగా కొనసాగించాలని, 2023-34 ఆర్ధిక సంవత్సరం ముగింపు సందర్భంగా లావాదేవీలు జరపాలని సూచించింది. ఆర్‌బిఐ ఆదేశాలతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఆదివారం యథావిధిగా పనిచేయనున్నాయి.

ప్రభుత్వ బ్యాంకులతో పాటు ఆర్‌బిఐ పరిధిలో లావాదేవీలు నిర్వహించే షెడ్యూల్డ్‌ బ్యాంకులు Scheduled Banks తమ శాఖలు పనివేళల్లో లావాదేవీలను యథాతథంగా కొనసాగించాలని ఆర్‌బిఐ సూచించింది.

బ్యాంకింగ్ కార్యకలాపాల నిర్వహణ కోసం మార్చి 31న ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన అన్ని శాఖలను తెరిచి ఉంచాలని ఏజెన్సీ బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది.

బ్యాంకు సెలవులు….

ప్రతి నెలా అన్ని ఆదివారాలు, 2, 4 శనివారాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. అయితే, 2023-24 ఆర్థిక సంవత్సరం లావాదేవీలన్నీ సక్రమంగా నమోదు అయ్యేలా చూడటానికి మార్చి 31 (ఆదివారం) న ప్రభుత్వ రశీదులు మరియు చెల్లింపులను నిర్వహించే అన్ని బ్యాంకుల శాఖలు లావాదేవీల కోసం తెరిచి ఉండాలని భారత ప్రభుత్వం అభ్యర్థించిందని రిజర్వ్‌ బ్యాంకు తెలిపింది.

ఏజెన్సీ బ్యాంకుల జాబితా

షెడ్యూల్డ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు (విలీనం తర్వాత):

1. బ్యాంక్ ఆఫ్ బరోడా

2. బ్యాంక్ ఆఫ్ ఇండియా

3. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర

4. కెనరా బ్యాంక్

5. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

6. ఇండియన్ బ్యాంక్

7. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్

8. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్

9. పంజాబ్ నేషనల్ బ్యాంక్

10. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

11. యూకో బ్యాంక్

12. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

షెడ్యూల్డ్ ప్రైవేట్ రంగ బ్యాంకులు:

13. యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్

14. సిటీ యూనియన్ బ్యాంక్ లిమిటెడ్

15. డీసీబీ బ్యాంక్ లిమిటెడ్

16. ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్

17. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్

18. ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్

19. ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్

20. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్

21. ఇండస్ఇండ్ బ్యాంక్ లిమిటెడ్

22. జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ లిమిటెడ్ (లిమిటెడ్ ఏజెన్సీ బిజినెస్ కోసం ఆమోదించబడింది)

23. కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్

24. కరూర్ వైశ్యా బ్యాంక్ లిమిటెడ్

Whats_app_banner