APSRTC Sabarimala Special : అయ్యప్ప భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్‌, టెక్కలి నుంచి శబరిమలకు ప్రత్యేక బ‌స్సులు-apsrtc running special buses from tekkali to sabarimala on various packages details ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Apsrtc Sabarimala Special : అయ్యప్ప భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్‌, టెక్కలి నుంచి శబరిమలకు ప్రత్యేక బ‌స్సులు

APSRTC Sabarimala Special : అయ్యప్ప భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్‌, టెక్కలి నుంచి శబరిమలకు ప్రత్యేక బ‌స్సులు

HT Telugu Desk HT Telugu

APSRTC Sabarimala Special : ఏపీఎస్ఆర్టీసీ శబరిమలకు ప్రత్యేక బస్సులు అందుబాటులోకి తెచ్చింది. టెక్కలి నుంచి శబరిమలకు 5, 7, 11 రోజులో టూర్ ప్యాకేజీలు అందుబాటులోకి తెచ్చింది. ప్యాకేజీల‌ను బ‌ట్టి బ‌స్సులు ప్రయాణించే మార్గంలో ఉన్న ఆలయాల కవరేజీలో వ్యత్యాసం ఉంటుంది.

అయ్యప్ప భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్‌, టెక్కలి నుంచి శబరిమలకు ప్రత్యేక బ‌స్సులు

అయ్యప్ప స్వామి భ‌క్తుల‌కు ఏపీఎస్ఆర్టీసీ శుభ‌వార్త చెప్పింది. శ‌బ‌రిమ‌ల‌కు ప్రత్యేక బ‌స్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. మూడు ర‌కాల ప్యాకేజీల‌ను నిర్ణయించింది. ఇందులో ఇంద్ర, సూప‌ర్ ల‌గ్జరీ, అల్ట్రా డీల‌క్స్ బ‌స్సుల‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ టెక్కలి నుంచి శబరిమల వరకు ప్రత్యేక టూర్ ప్యాకేజీలను నిర్వహిస్తుంది. ప్రతి ఏడాది టెక్కలి నుంచి ప్రత్యేక బ‌స్సులు శ‌బ‌రిమ‌ల‌కు వేస్తున్నారు. ఈ ఏడాది కూడా శబరిమలకు ప్రత్యేక 5, 7, 11 రోజుల టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చారు. ఆయా ప్యాకేజీల‌ను బ‌ట్టి బ‌స్సులు ప్రయాణించే మార్గంలో ఉన్న ఆలయాల కవరేజీలో వ్యత్యాసం ఉంటుంది. భక్తులు సందర్శించడానికి ఎంచుకున్న దేవాలయాల ఆధారంగా వారి అవసరాలను తీర్చడానికి ఈ యాత్రలు చేప‌డుతున్నారు.

యాత్రలు

ఐదు రోజుల ప్యాకేజీలో టెక్కలిలో బయలుదేరి విజయవాడ, ఎరుమేలి, పంబ మీదుగా యాత్ర సన్నిధానం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో శ్రీపురం, కాణిపాకం, తిరుపతి, అన్నవరం, సింహాచలంను కవర్ చేస్తుంది.

ఏడు రోజుల ప్యాకేజీలో విజయవాడ, కాణిపాకం, శ్రీపురం, భవానీ, పళని, ఎరుమేలి, పంబ మీదుగా యాత్ర సన్నిధానం చేరుకుంటుంది. తిరిగి ప్ర‌యాణంలో మ‌ధురై, రామేశ్వ‌రం, తిరుప‌తి, శ్రీ‌కాళ‌హ‌స్తి, విజ‌య‌వాడ, అన్న‌వ‌రం, సింహాచ‌లం ఆలయాలలో దర్శనం లభిస్తుంది.

11 రోజుల ప్యాకేజీలో శ్రీశైలం, మ‌హానంది, కాణిపాకం, శ్రీ‌పురం, భ‌వాని, ప‌ళ‌ని, గురువాయూర్‌, ఎరుమేలి, పంబ మీదుగా యాత్ర సన్నిధానం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో త్రివేండ్రం, క‌న్యాకుమారి, మధురై, శ్రీరంగం, కంచి, తిరుపతి, శ్రీ కాళహస్తి, విజయవాడ, అన్నవరం, సింహాచ‌లంలో దర్శనం చేసుకోవచ్చు.

వివరాలకు మొబైల్ నంబర్లు: టెక్కలి డిపో మేనేజ‌ర్‌ 9959225611, అసిస్టెంట్‌ డిపో మేనేజర్ 7382923311, డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ 9908190801ల‌ను సంప్రదించాలి.

అయ్యప్ప భక్తులకు సేవలందించడంలో అనుభవం ఉన్న, రూట్ తెలిసిన నిష్ణాతులైన డ్రైవర్లు బస్సులను నడుపుతారు. ఈ మూడు ప్యాకేజీలే కాకుండా భ‌క్తులు కోరుకున్న విధంగా కూడా యాత్రలు బుక్ చేసుకునే సౌక‌ర్యం ఉంద‌ని టెక్కలి డిపో మేనేజ‌ర్ ఎన్‌. శ్రీ‌నివాస‌రావు తెలిపారు. టెక్కలి నుంచి నిర్వహించబడుతున్న శబరిమల ప్రత్యేక బస్సులు చాలా మంచి ఆదరణ పొందుతున్నాయి.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

సంబంధిత కథనం