APSRTC Special Buses : పరమ శివుడికి భక్తులకు గుడ్‌న్యూస్.. పంచారామాలకు 350 ప్రత్యేక బస్సులు-aps rtc 350 special buses from ntr district to shaiva kshetras during karthika masam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Apsrtc Special Buses : పరమ శివుడికి భక్తులకు గుడ్‌న్యూస్.. పంచారామాలకు 350 ప్రత్యేక బస్సులు

APSRTC Special Buses : పరమ శివుడికి భక్తులకు గుడ్‌న్యూస్.. పంచారామాలకు 350 ప్రత్యేక బస్సులు

Basani Shiva Kumar HT Telugu
Oct 25, 2024 04:49 PM IST

APSRTC Special Buses : కార్తికమాసం నవంబర్ 2 నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ మాసంలో పరమ శివుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. కార్తిక సోమవారం నాడు శైవక్షేత్రాలను దర్శిస్తే పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్టి దృష్ట్యా ఆర్టీసీ బస్సులు నడిపేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.

పంచారామాలకు 350 ప్రత్యేక బస్సులు
పంచారామాలకు 350 ప్రత్యేక బస్సులు (@AndhraNexus)

కార్తిక మాసంలో ఎక్కువ మంది భక్తులు పంచారామాలు, త్రిలింగ దర్శినం కోసం వెళ్తుంటారు. దీంతో వారికి తగ్గట్టు ఏపీఎస్ ఆర్టీసీ ప్యాకేజీలను ఆఫర్ చేస్తోంది. ఈ ప్యాకేజీలతోపాటు.. వనభోజనాలు, ఆలయాల సందర్శన కోసం చాలా మంది ఆర్టీసీ బస్సులను బుక్‌ చేసుకున్నారు. వీటి కారణంగా గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఆదాయం సమకూరింది. ఈ నేపథ్యంలో.. ఈసారి కూడా గతేడాది కంటే ఎక్కువ సంఖ్యలో బస్సులను సిద్ధం చేస్తున్నారు.

ఎన్టీఆర్‌ జిల్లా నుంచి పంచారామాలు, శైవ క్షేత్రాలకు ఈ ఏడాది 350 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. విజయవాడ నుంచి 150, జగ్గయ్యపేట నుంచి 34, తిరువూరు నుంచి 34, ఇబ్రహీంపట్నం నుంచి 25, విద్యాధరపురం నుంచి 15, ఆటోనగర్ నుంచి 30, గవర్నర్‌పేట 1 నుంచి 22, గవర్నర్‌పేట 2 డిపో నుంచి 40.. ఇలా మొత్తం ఒక్క ఎన్టీఆర్ జిల్లా నుంచే 350 ప్రత్యేక బస్సులను శైవ క్షేత్రాలకు నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈసారి డిమాండ్‌ ఎక్కువగా ఉండొచ్చని గతం కంటే సర్వీసులను పెంచినట్టు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. పంచారామాల ప్యాకేజీ కింద ఒకేరోజు భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, అమరావతి, సామర్లకోటలో క్షేత్రాలను దర్శించుకునే వీలు కల్పించారు. డిమాండ్‌ను బట్టి అరుణాచలం, సముద్ర స్నానాలకు కూడా బస్సులను తిప్పనున్నట్టు ఆర్టీసీ ఆఫీసర్లు చెబుతున్నారు.

మరోవైపు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మహానంది, యాగంటి, శ్రీశైలం ఆలయాలకు ఒకటిన్నర రోజులో వెళ్లి వచ్చేలా.. త్రిలింగ దర్శిని ప్యాకేజీని ప్రకటించారు. వీటితోపాటు శ్రీశైలం, కొండవీడు, అన్నవరం, కర్ణాటకలోని దేవనహళ్లి తదితర ఆలయాలకు వేరుగా బస్సులు నడుపుతున్నారు. ఈ ప్యాకేజీలకు సంబంధించి ఆన్‌లైన్, ఆఫ్ లైన్‌లో వివరాలను అందుబాటులో ఉంచారు.

గత ఏడాది కార్తిక మాసంలో స్పెషల్‌ బస్సులు కిక్కిరిసిపోయాయి. రూ.86.44 లక్షల ఆదాయం వచ్చింది. 87 శాతం ఓఆర్‌ నమోదైంది. కిలోమీటరుకు రూ.58.72 జమ అయింది. కొవిడ్‌కు ముందు 2019లో వచ్చిన ఆదాయం కంటే ఇది ఎక్కువ. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ రద్దీ ఉంటుందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నారు.

Whats_app_banner