APPSC Group 1 Prelims Results: ఏపీ గ్రూప్ - 1 ప్రిలిమ్స్(APPSC Group 1 Prelims) ఫలితాలను వెల్లడించింది ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్. శుక్రవారం రాత్రి తర్వాత ఫలితాలను వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసింది. గత నెల మార్చి 17వ తేదీన ఈ ఎగ్జామ్ జరగా…. 4,496 మంది మెయిన్స్‌కు(AP Group 1 Mains) అర్హత సాధించారు. గతేడాది డిసెంబర్ లో విడుదలైన ఈ నోటిఫికేషన్ లో భాగంగా… మొత్తం 81 ఉద్యోగాలను రిక్రూట్ చేయనుంది ఏపీపీఎస్సీ. సెప్టెంబర్ మాసంలో మెయిన్స్ పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంది.
ఏపీపీఎస్సీ గ్రూప్ -1 పోస్టుల భర్తీ కోసం మార్చి 17న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్ష ప్రాథమిక కీ (Group 1 Key)మార్చి 18న కమిషన్ వెబ్‌సైట్‌లో ఉంచింది. ఆన్‌లైన్ ద్వారా మూడు రోజుల పాటు మార్చి 19 నుంచి మార్చి 21 వరకు కీపై అభ్యంతరాలు స్వీకరించింది. ఆ తర్వాత ఫైనల్ కీతో పాటు ఫలితాలను ప్రకటించింది. https://psc.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చని కమిషన్ సూచించింది.
APPSC Group 2 Prelims Results : మరోవైపు ఇటీవలనే ఏపీ గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలను(APPSC Group 2 Prelims) ఏపీపీఎస్సీ ప్రకటించింది. మెయిన్స్(Group 2 Mains) కు క్వాలి ఫై అయిన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ https://portal-psc.ap.gov.in/Default.aspx లో ప్రకటించింది. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు మొత్తం 92,250 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25న గ్రూప్-2 స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. వివిధ కారణాలతో 2557 మంది అభ్యర్థులను రిజెక్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC)899 గ్రూప్-2 పోస్టులకు ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ పరీక్షను(APPSC Group 2 Prelims) నిర్వహించింది. గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్ కు రాష్ట్ర వ్యాప్తంగా 4,83,525 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, 4,63,517 మంది హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. 4,04,037 మంది పరీక్షకు హాజరయ్యారు. ప్రిలిమినరీ పరీక్షకు 87.17% శాతం మంది హాజరయ్యారని ఏపీపీఎస్సీ (APPSC)తెలిపింది. ఏపీలోని 24 జిల్లాల్లోని 1327 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు.