AP Universities in-charge VCs : ఏపీలోని పలు యూనివర్శిటీలకు ఇన్‌ఛార్జ్‌ వీసీలు - నియామక ఉత్తర్వులు జారీ-appointment of in charge vcs for various universities in ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Universities In-charge Vcs : ఏపీలోని పలు యూనివర్శిటీలకు ఇన్‌ఛార్జ్‌ వీసీలు - నియామక ఉత్తర్వులు జారీ

AP Universities in-charge VCs : ఏపీలోని పలు యూనివర్శిటీలకు ఇన్‌ఛార్జ్‌ వీసీలు - నియామక ఉత్తర్వులు జారీ

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 18, 2024 09:26 PM IST

AP Universities in-charge VCs : ఏపీలోని పలు యూనివర్శిటీలకు ఇంఛార్జ్ వీసీలను నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు గురువారం ఉత్తర్వులను జారీ చేసింది.

ఇన్‌ఛార్జ్‌ వీసీల నియామకం
ఇన్‌ఛార్జ్‌ వీసీల నియామకం

AP Universities in-charge VCs : ఏపీలో కొత్త ప్రభుత్వం రావటంతో శాఖలవారీగా ప్రక్షాళన చేసే పనిలో పడింది. తాజాగా పలు యూనివర్శిటీలకు ఇన్‌ఛార్జ్‌ వీసీలను నియమించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులను జారీ చేసింది.

ఎస్‌వీయూ ఇన్‌ఛార్జ్‌ వీసీగా చిప్పాడ అప్పారావుగా నియమితులయ్యారు. శ్రీకృష్ణదేవరాయ వర్శిటీ ఇన్‌ఛార్జి వీసీగా బి.అనిత, కృష్ణా వర్సిటీ ఇంఛార్జ్ వీసీగా ఆర్‌. శ్రీనివాస్‌రావును నియమించారు.

ఇంఛార్జ్ వీసీలు వీరే :

  • జేఎన్‌టీయూ కాకినాడ - మురళీ కృష్ణ
  • నన్నయ వర్సిటీ - శ్రీనివాసరావు
  • విక్రమ సింహపురి వర్సిటీ - సారంగం విజయభాస్కర్‌రావు
  • కృష్ణా వర్సిటీ - ఆర్‌. శ్రీనివాస్‌రావు
  • ఆంధ్రా యూనివర్సిటీ- గొట్టపు శశిభూషణ్‌రావు
  • వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్‌, పైన్‌ ఆర్ట్స్‌ వర్సిటీ - విశ్వనాథకుమార్‌
  • ఆంధ్రకేసరి వర్సిటీ - డీవీఆర్‌ మూర్తి
  • అబ్దుల్‌ హక్‌ ఉర్దూ వర్సిటీ - పఠాన్‌ షేక్‌ ఖాన్‌
  • నాగార్జున యూనివర్సిటీ - కంచర్ల గంగాధర్‌
  • జేఎన్‌టీయూ అనంతపురం - సుదర్శన్‌రావు
  • పద్మావతి మహిళా వర్సిటీ - ఉమ
  • జేఎన్‌టీయూ విజయనగరం - రాజ్యలక్ష్మి
  • రాయలసీమ వర్సిటీ - ఎన్‌టీకే నాయక్‌
  • ద్రవిడ వర్సిటీ - దొరస్వామి
  • యోగి వేమన వర్శిటీ - కృష్ణారెడ్డి.

అసెంబ్లీలోనే శ్వేతపత్రాలు విడుదల….

శ్వేతపత్రాల విడుదలపై ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. శాంతి భద్రతలు, ఆర్థిక, ఎక్సైజ్‌ శాఖల శ్వేతపత్రాలను అసెంబ్లీలోనే విడుదల చేయాలని నిర్ణయించింది.ఇప్పటి వరకు ఇసుక, విద్యుత్‌, నీటిపారుదల రంగం, అమరావతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Whats_app_banner