AP Govt Jobs 2024 : ఏపీ పశుసంవర్ధక శాఖలో ఉద్యోగాలు - అర్హతలు, ముఖ్య వివరాలివే-applications are invited for recruitment to the posts ap animal husbandry department 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Govt Jobs 2024 : ఏపీ పశుసంవర్ధక శాఖలో ఉద్యోగాలు - అర్హతలు, ముఖ్య వివరాలివే

AP Govt Jobs 2024 : ఏపీ పశుసంవర్ధక శాఖలో ఉద్యోగాలు - అర్హతలు, ముఖ్య వివరాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Feb 02, 2024 02:14 PM IST

AP Animal Husbandry Department Jobs 2024: పలు ఉద్యోగాల భర్తీకి ఏపీ పశుసంవర్థక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా… మొత్తం 26 పోస్టులను భర్తీ చేయనుంది. ఫిబ్రవరి 7వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలు
ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలు (https://ahd.aptonline.in/)

AP Animal Husbandry Department Recruitment 2024: ఏపీ పశుసంవర్థక శాఖ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. బ్యాక్ లాగ్ కోటా కింద వీటిని భర్తీ చేయనుంది. ఇందుకోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఇందులో భాగంగా 26 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆఫ్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 7వ తేదీ లోపు వీటిని సమర్పించాల్సి ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

ముఖ్య వివరాలు:

ఉద్యోగ ప్రకటన - ఏపీ పశుసంవర్థక శాఖ

ఉద్యోగాలు - వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్

ఖాళీల కేటగిరి - బ్యాక్ లాగ్ పోస్టులు (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది).

మొత్తం ఖాళీలు - 26 (ఎస్సీ -2, ఎస్టీ - 19, దివ్యాంగులు - 05)

ర్హతలు - బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి - 42 ఏళ్ల లోపు ఉండాలి.

జీతం - రూ. 54 వేల నుంచి 1,40,540.

దరఖాస్తులు - ఆఫ్ లైన్

దరఖాస్తులకు తుది గడువు - ఫిబ్రవరి 7 2024.(సాయంత్రం 5 గంటల లోపు)

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా - పశుసంవర్థక శాఖ కార్యాలయం, లబ్బిపేట, విజయవాడ, పిన్ నెంబర్ - 520010.

అధికారిక వెబ్ సైట్ - https://ahd.aptonline.in/AHMS/

పూర్తి నోటిఫికేషన్ తో పాటు దరఖాస్తు ఫారమ్ ను కింద ఇచ్చిన పీడీఎఫ్ లో చూడొచ్చు….

APPSC Junior Lecturer Recruitment 2024 News : ఏపీ ఇంటర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. గత ఏడాది డిసెంబర్ 28వ తేదీన ఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా… మొత్తం 47 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ ప్రక్రియ మొదలైంది. జనవరి 31వ తేదీ నుంచి ప్రారంభం కాగా… ఫిబ్రవరి 20వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఏప్రిల్ లేదా మే మాసంలో రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది.

ముఖ్య వివరాలు:

ఉద్యోగ ప్రకటన - ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC).

ఉద్యోగాలు - జూనియర్ లెక్చరర్ (ఇంటర్ కాలేజీలు)

మొత్తం ఖాళీలు - 47

ఇంగ్లీష్: 09 పోస్టులు

తెలుగు: 02 పోస్టులు

ఉర్దూ: 02 పోస్టులు

సంస్కృతం: 02 పోస్టులు

ఒరియా: 01 పోస్టు

మ్యాథ్స్: 01 పోస్టు

ఫిజిక్స్: 05 పోస్టులు

కెమిస్ట్రీ: 03 పోస్టులు

బోటనీ: 02 పోస్టులు

జువాలజీ: 01 పోస్టు

ఎకనామిక్స్: 12 పోస్టులు

సివిక్స్: 02 పోస్టులు

హిస్టరీ: 05 పోస్టులు

అర్హత - ఎంఏ/ ఎంఎస్సీ/ఎంకామ్/బీఏ(ఆనర్స్)/ బీఎస్సీ(ఆనర్స్)/ బీకామ్ (ఆనర్స్) లేదా కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత రంగంలో ఏదైనా ఇతర సమానమైన పీజీ డిగ్రీ కలిగి ఉండాలి.

వయోపరిమితి - 28.12.2023 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తులు ప్రారంభం - జునవరి 31, 2024.

దరఖాస్తులకు తుది గడువు - ఫిబ్రవరి 20, 2024.

ఫీజు వివరాలు - అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.120 కలిపి మొత్తం రూ.370 చెల్లించాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం- రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ ఆధారంగా ఎంపికచేస్తారు.

రాతపరీక్ష విధానం: మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. రాతపరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ 1 జనరల్ స్టడీస్ ఉండగా… రెండో పేపర్ సంబంధిత సబ్జెక్ట్ ఉంటుంది. కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ ను మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు.

రాతపరీక్ష తేది: ఏప్రిల్/మే, 2024లో ఉంటుంది.

అధికారిక వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in/

Whats_app_banner

సంబంధిత కథనం