YSRHU Admissions: ఏపీ హార్టికల్చర్ డిప్లొమా కొోర్సుల దరఖాస్తు గడువు పొడిగింపు-application deadline extension for ap horticulture diploma courses ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ysrhu Admissions: ఏపీ హార్టికల్చర్ డిప్లొమా కొోర్సుల దరఖాస్తు గడువు పొడిగింపు

YSRHU Admissions: ఏపీ హార్టికల్చర్ డిప్లొమా కొోర్సుల దరఖాస్తు గడువు పొడిగింపు

HT Telugu Desk HT Telugu
Jun 24, 2024 12:32 PM IST

YSRHU Admissions: ఏపీలో హార్టిక‌ల్చ‌ర్‌ డిప్లొమా కోర్సులకు దరఖాస్తు గడువు పొడిగించారు. జూలై 6వ తేదీ వరకు దరఖాస్తు గడువును పొడిగిస్తూ వైఎస్ఆర్‌హెచ్‌యూ నిర్ణ‌యం తీసుకుంది.

హార్టికల్చర్ డిప్లొమా కోర్సుల దరఖాస్తు గడువు పొడిగింపు
హార్టికల్చర్ డిప్లొమా కోర్సుల దరఖాస్తు గడువు పొడిగింపు

YSRHU Admissions: రాష్ట్రంలో హార్టిక‌ల్చ‌ర్ డిప్లొమా కోర్సుల అడ్మిషన్ ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడిగించారు. జూలై 6 వ‌ర‌కు పొగిడిస్తూ వైఎస్ఆర్ హార్టిక‌ల్చ‌ర‌ల్ యూనివ‌ర్శిటీ (వైఎస్ఆర్‌హెచ్‌యూ) నిర్ణ‌యం తీసుకుంది.

వైఎస్ఆర్ హార్టిక‌ల్చ‌ర‌ల్ యూనివ‌ర్శిటీ (వైఎస్ఆర్‌హెచ్‌యూ) డిప్లొమా ప్రొగ్ర‌మ్స్‌కు సంబంధించి 2024-25 విద్యా సంవ‌త్స‌రానికి అడ్మిష‌న్ కోసం మే 22న నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి మే 25 నుంచి ప్రారంభించ‌గా, చివ‌రు తేదీ జూన్ 18న నిర్ణ‌యించింది. అయితే ప్ర‌స్తుతం దాని గ‌డువును జూలై 6 వ‌ర‌కు పొడిగించింది.

జూలై 6 త‌రువాత కౌన్సింగ్ నిర్వ‌హిస్తారు. కౌన్సింగ్ రెండు ద‌శ‌ల్లో ఉంటుంది. మొద‌ట ద‌శ కౌన్సింగ్‌లో సీట్లు రాని వారు, రెండో ద‌శ కౌన్సింగ్‌కు హాజ‌రుకావ‌చ్చు. వెబ్ ఆప్ష‌న్‌లో పెట్టుకున్న ప్రాధాన్య‌తలు ఆధారంగా కాలేజీల్లో సీటు కేటాయిస్తారు.

అర్హులు

ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త అయిన‌వారు ద‌ర‌ఖాస్తు చేయ‌డానికి అర్హులు. ఎస్ఎస్‌సీ, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఎన్ఐఓఎస్‌, ఓఎస్ఎస్ బోర్డుల నుంచి ప‌దో త‌ర‌గ‌తి పాస్ అయి ఉండాలి. ప‌దో త‌ర‌గ‌తిలో రెగ్యూల‌ర్‌గా పాస్‌తో పాటు స‌ప్లమెంట‌రీలో పాస్ అయిన వారు, ఇంట‌ర్మీడియట్ ఫెయిల్ అయిన‌వారు కూడా అర్హులే. అయితే ఇంట‌ర్మీడియ‌ట్ పాస్ అయిన వారు మాత్రం అప్లై చేయ‌డానికి అన‌ర్హులు. 2024 ఆగ‌స్టు 31 నాటికి 15 ఏళ్లు పూర్తి అవ్వాలి. 22 ఏళు పూర్తి అవ్వ‌కూడ‌దు. అంటే 2002 ఆగ‌స్టు 31 నుంచి 2009 ఆగ‌స్టు 31 మ‌ధ్య పుట్టిన వారై ఉండాలి.

75 శాతం సీట్లు గ్రామీణ ప్రాంత విద్యార్థుల‌కే

మొత్తం సీట్ల‌లో 75 శాతం సీట్లు నాన్ మున్సిప‌ల్ (రూర‌ల్‌) ప్రాంతాల్లో క‌నీసం నాలుగేళ్లు చ‌దివిన వారికి కేటాయిస్తారు. అంటే 1 త‌ర‌గ‌తి నుంచి 10 త‌ర‌గ‌తి మ‌ధ్య నాలుగేళ్లు గ్రామీణ ప్రాంతాల్లో చ‌ద‌వాలి. 25 శాతం సీట్లు మున్సిప‌ల్ ప్రాంతాల్లో చ‌దివిని వారికి కేటాయిస్తారు. 85 శాతం సీట్లు స్థానిక‌ విద్యార్థుల‌కు రిజ‌ర్డ్వ్ చేశారు. 15 శాతం సీట్లు అన్ రిజర్డ్వ్, మెరిట్ బేస్ మీద కేటాయిస్తారు. ఈ 85 శాతం సీట్లలో 42ః22 నిష్ప‌త్తిలో ఆంధ్ర యూనివ‌ర్శిటీ (ఏయూ) రీజియ‌న్ (శ్రీ‌కాకుళం, విజ‌య‌నగ‌రం, విశాఖ‌ప‌ట్నం, తూర్పుగోదావ‌రి, ప‌శ్చిమ గోదావ‌రి, కృష్ణ‌, గుంటూరు, ప్ర‌కాశం), శ్రీ వెంక‌టేశ్వ‌ర యూనివ‌ర్శిటీ (ఎస్‌వీయూ) రీజియ‌న్ (చిత్తూరు, అనంత‌పురం, క‌ర్నూల్‌, క‌డ‌ప‌, నెల్లూరు) కేటాయిస్తారు.

రిజ‌ర్వేషన్లు ఇలా

ఓపెన్ కేట‌గిరిలో 50 శాతం సీట్లు ఉన్నాయి. ఎస్‌సీ కేట‌గిరిలో 15 శాతం సీట్లు, ఎస్‌టీ కేట‌గిరిలో 6 శాతం సీట్లు ఉన్నాయి. బీసీ కేట‌గిరిలో 29 శాతం సీట్లు ఉన్నాయి. అందులో బీసీ-ఏ 7 శాతం, బీసీ-బీ 10 శాతం, బీసీ-సీ 1 శాతం, బీసీ-డీ 7 శాతం, బీసీ-ఈ 4 శాతం సీట్లు ఉన్నాయి. అలాగే విక‌లాంగు (పీహెచ్) కేట‌గిరిలో 5 శాతం సీట్లు ఉన్నాయి. సైనిక సిబ్బంది పిల్ల‌ల కేట‌గిరిలో 2 శాతం, ఎస్‌సీసీ కేట‌గిరిలో 1 శాతం, స్పోర్ట్స్ కేట‌గిరిలో 0.5 శాతం సీట్లు ఉన్నాయి. విద్యార్థినీల‌కు 33.33 శాతం రిజ‌ర్వేష‌న్ కేటాయించారు.

ద‌ర‌ఖాస్తు ఎలా చేయాలి?

వైఎస్ఆర్ హార్టిక‌ల్చ‌ర‌ల్ యూనివ‌ర్శిటీ అధికారిక వెబ్‌సైట్ https://www.drysrhu.ap.gov.in/home.html హోం పేజీలోకి వెళ్లారు. అక్క‌డ డిప్లొమా ప్రొగ్ర‌మ్స్ అడ్మిష‌న్ 2024-25 రిజిస్ట్రేష‌న్ స్రోల్ అవుతుంది. అక్క‌డ క్లిక్ ఇయ‌ర్‌ అప్లై అని ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే, రిజిస్ట్రేష‌న్ ఫామ్‌ ఫ‌ర్ ఆన్‌లైన్ అడ్మిష‌న్స్ ఇన్‌టూ 2 ఏళ్ల డిప్లొమా హార్టిక‌ల్చ‌ర‌ల్ కోర్సు -2024-25 అని ఉంటుంది. దానిపై క్లిక్‌చేస్తే, ఎస్ ప్రొసిడ్‌పై క్లిక్ చేయాలి. అలా చేసిన త‌రువాత అప్లికేష‌న్ ఓపెన్ అవుతుంది. సెలక్ట్ బోర్డు బాక్స్‌లో ప‌దో త‌ర‌గ‌తి చ‌దివిన‌ బోర్డుపై ఎంపిక చేసుకోవాలి.

దాని ప‌క్క బాక్స్‌లో ప‌దో త‌ర‌గ‌తి ఎలా పాస్ అయ్యామో ఇవ్వాల్సి ఉంటుంది. అంటే రెగ్యూల‌ర్‌, లేక స‌ప్ల‌మెంట‌రీనా ఒక‌దానిని ఎంపిక చేసుకోవాలి. త‌రువాత బాక్స్‌లో ప‌దో త‌ర‌గ‌తి హాల్ టిక్కెట్టు నెంబ‌ర్ ఎంట‌ర్ చేయాలి. ఆ ప‌క్క బాక్స్‌లో పుట్టిన తేదీ ఎంట‌ర్ చేయాలి. అలా పూర్తి చేసిన త‌రువాత స‌బ్మిట్‌పై క్లిక్ చేయాలి. ఆ వివ‌రాలు ఎంట‌ర్ చేసిన త‌రువాత, పూర్తి వివ‌రాలు కోరుతూ అప్లికేష‌న్ ఓపెన్ అవుతుంది. దాన్ని పూర్తి చేయాలి.

రిజిస్ట్రేష‌న్ ఫామ్ ప్రింట్ తీసుకోవ‌డానికి ఆప్ష‌న్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే, అక్క‌డ బాక్స్‌లో ప‌దో త‌ర‌గ‌తి హాల్ టిక్కెట్టు నెంబ‌ర్ ఎంట‌ర్ చేయాలి. ఆ ప‌క్క బాక్స్‌లో పుట్టిన తేదీ ఎంట‌ర్ చేయాలి. అలా పూర్తి చేసిన త‌రువాత స‌బ్మిట్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి. ఆ త‌రువాత పేమెంట్ స్టేట‌స్‌ను తెలుసుకోవ‌డానికి నౌ యూవ‌ర్ పేమెంట్ స్టేట‌స్‌పై క్లిక్ చేయాలి. దానిపై క్లిక్ చేస్తే, అక్క‌డ బాక్స్‌లో ప‌దో త‌ర‌గ‌తి హాల్ టిక్కెట్టు నెంబ‌ర్ ఎంట‌ర్ చేయాలి. అలా ఎంట‌ర్ చేసిన త‌రువాత స‌బ్మిట్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి.

అప్లికేష‌న్ స్టేట‌స్ తెలుసుకోవ‌డానికి నౌ యువ‌ర్ అప్లికేష‌న్ స్టేట‌స్‌పై క్లిక్ చేయాలి. దానిపై క్లిక్ చేస్తే, అక్క‌డ బాక్స్‌లో ప‌దో త‌ర‌గ‌తి హాల్ టిక్కెట్టు నెంబ‌ర్ ఎంట‌ర్ చేయాలి. ఆ ప‌క్క బాక్స్‌లో పుట్టిన తేదీ ఎంట‌ర్ చేయాలి. అలా పూర్తి చేసిన త‌రువాత స‌బ్మిట్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు అప్లికేష‌న్ స్టేట‌స్ వ‌స్తుంది.

అప్లికేష‌న్ ఫీజు

అప్లికేష‌న్ ఫీజు ఎస్‌సీ, ఎస్‌టీ, పీహెచ్ అభ్య‌ర్థుల‌కు రూ.400 కాగా, ఓసీ, బీసీ అభ్య‌ర్థుల‌కు రూ.800 నిర్ణ‌యించారు. ఫీజు ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి.

ఎన్ని కోర్సులు

వైఎస్ఆర్‌హెచ్‌యూ రెండు డిప్లొమా కోర్సులను అందిస్తుంది. అందులో డిప్లొమా హార్టిక‌ల్చ‌ర‌ల్ కోర్సు, డిప్లొమా హార్టిక‌ల్చ‌ర‌ల్ ఫుడ్ ప్రొసెసింగ్ కోర్సును వైఎస్ఆర్‌హెచ్‌యూ అందిస్తుంది. డిప్లొమా హార్టిక‌ల్చ‌ర‌ల్ కోర్సు, హార్టిక‌ల్చ‌ర‌ల్ ఫుడ్ ప్రొసెసింగ్ కోర్సు రెండేళ్లు (నాలుగు సెమిస్ట‌ర్స్‌) ఉంటాయి.

ఎన్ని సీట్లు ?

డిప్లొమా హార్టిక‌ల్చ‌ర‌ల్ కోర్సులో ప్ర‌భుత్వ కాలేజీల్లో 200 సీట్లు ఉన్నాయి. అలాగే అనుబంధ కాలేజీల్లో 280 సీట్లు ఉన్నాయి. డిప్లొమా హార్టిక‌ల్చ‌ర‌ల్ ఫుడ్ ప్రొసెసింగ్ కోర్సులో 20 గ‌వ‌ర్న‌మెంట్ సీట్లు ఉన్నాయి. మొత్తం 220 గ‌వ‌ర్న‌మెంట్ సీట్లు కాగా, 280 ప్రైవేట్ సీట్లు ఉన్నాయి. ఈడ‌బ్ల్యూఎస్ కేట‌గిరిలో 10 శాతం సూప‌ర్‌న్యూమ‌రీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. అంటే ప్ర‌భుత్వ కాలేజీల్లో 22 సీట్లు, ప్ర‌వేట్ కాజీల్లో 28 సీట్లు ఉంటాయి. మొత్తం సీట్లు ప్ర‌భుత్వం 244, ప్రైవేట్ 308 ఉన్నాయి.

కోర్సుల‌ ఫీజులు ఎలా ఉంటాయి?

సీటు క్యాన్సిల్ చేసుకునే జ‌న‌ర‌ల్ కేట‌గిరీ విద్యార్థుల‌కు రూ.1,650 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్‌సీ, ఎస్‌టీ, పీహెచ్ విద్యార్థుల‌కు రూ.825 చెల్లించాల్సి ఉంటుంది. అడ్మిష‌న్ సంద‌ర్భంగా చెల్లించిన ఇత‌ర ఫీజుల‌ను తిరిగి విద్యార్థికి ఇచ్చేస్తారు. ప్ర‌భుత్వ సీటు పొందిన విద్యార్థి మొద‌టి ఏడాదిలో మొద‌టి సెమిస్ట‌ర్‌కు రూ.23,723 చెల్లించాల్సి ఉంటుంది. రెండో సెమిస్ట‌ర్‌కు రూ.6,785 ఉంటుంది. ప్రైవేట్ సీటు పొందిన విద్యార్థి మొద‌టి సంవ‌త్స‌రం మొద‌టి సెమిస్ట‌ర్‌కు రూ.39,683 చెల్లించాల్సి ఉంటుంది. రెండో సెమిస్ట‌ర్‌కు రూ.24,175 ఉంటుంది. అయితే హాస్ట‌ల్ వ‌స‌తి కావాల‌నుకునే విద్యార్థుల‌కు హాస్ట‌ల్ ఫీజు అద‌నంగా ఉంటుంది.

(రిపోర్టింగ్ జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner