AP TET 2024: రేపటి నుంచి ఏపీ టెట్ 2024 పరీక్షలు, రెండు సెషన్లలో పరీక్షలు, ఏర్పాట్లు పూర్తి-ap tet 2024 exams from tomorrow exams in two sessions arrangements are complete ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Tet 2024: రేపటి నుంచి ఏపీ టెట్ 2024 పరీక్షలు, రెండు సెషన్లలో పరీక్షలు, ఏర్పాట్లు పూర్తి

AP TET 2024: రేపటి నుంచి ఏపీ టెట్ 2024 పరీక్షలు, రెండు సెషన్లలో పరీక్షలు, ఏర్పాట్లు పూర్తి

Bolleddu Sarath Chandra HT Telugu
Oct 02, 2024 06:04 AM IST

AP TET 2024: ఆంధ్ర ప్రదేశ్‌ టెట్ 2024 (ఉపాధ్యాయ అర్హత) పరీక్షలు అక్టోబర్ 3నుంచి ప్రారంభం కానుంది. 4 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఈ నెల 3 నుంచి 21 వరకు రోజుకు రెండు సెషన్లలో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు.

టెట్ 2024 పరీక్ష నిర్వహణకు సర్వం సిద్ధం
టెట్ 2024 పరీక్ష నిర్వహణకు సర్వం సిద్ధం

AP TET 2024: ఆంధ్రప్రదేేశ్‌ టెట్ 2024 పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయినట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వివరించారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రోజుకు రెండు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 9.30 నుంచి 12 గంటల ఒక సెషన్‌, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌ పరీక్షలు జరుగుతాయి.

ఏపీలో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి ఇప్పటికే ప్రభుత్వం మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష- టెట్‌కు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 లక్షల మంది అభ్యర్థులు హాజరు కానున్నారు.

అక్టోబర్ 3 నుంచి 21 వరకు రోజుకు రెండు సెషన్లలో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు , మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. పరీక్షలకు హాజరయ్యే వికలాంగులకు అదనంగా సమయం కేటాయిస్తారు. సొంతంగా పరీక్షలు రాయలేని 813 మంది వికలాంగులు పరీక్ష రాయడానికి సహాయకులను ఏర్పాటు చేసుకున్నారు. పరీక్షా సమయానికి గంటన్నర ముందుగానే కేంద్రాల్లోకి అనుమతిస్తారు.

అభ్యర్థులు తప్పనిసరిగా ఆధార్‌ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటరు గుర్తింపుకార్డుల్లో ఏదో ఒకటి తమతో తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. టెట్‌ అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను తమతో తీసుకువెళ్లడానికి అనుమతించరు. అభ్యర్థులు ఎవరైనా ఒకటి కంటే ఎక్కువ ప్రదేశాల్లో హాల్ టికెట్లను పొంది ఉంటే ఏదో ఒక కేంద్రంలో మాత్రమే హాజరుకావాల్సి ఉంటుంది. హాల్ టికెట్లలో ఏమైనా తప్పులు ఉంటే పరీక్షా కేంద్రంలోని డిపార్టుమెంట్ అధికారికి ఆధారాలు చూపించి, వాటిని సరిచేసుకునే సదుపాయం కల్పించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు.

ఏపీ టెట్‌ 2024 పరీక్షకు 4,27,300 దరఖాస్తు చేసుకున్నారు. వారిలో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నవారు: 4,09,955 మంది ఉన్నారు. మొత్తం 108 పరీక్షా కేంద్రాల్లో టెట్‌ నిర్వహిస్తారు. ఏపీలోని 22 జిల్లాల్లో 95 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. హైదరాబాద్, ఖమ్మం, బెంగళూరు, చెన్నై, బరంపురం, గంజాంలో ఏర్పాటు చేసిన కేంద్రాలు 13 ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో పరీక్ష రాసేవారు 24,396 మంది ఉన్నారు.

ఇంతవరకు హాల్టికెట్ లు డౌన్లోడ్ చేసుకొని అభ్యర్థులు సత్వరమే తమ హాల్ టిక్కెట్లను https://aptet.apcfss.in/ వెబ్‌సైట్‌ నుండి డౌన్ లోడ్ చేసుకోవాలి.

అభ్యర్థులను పరీక్షా సమయానికి గంటన్నర ముందే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఉదయం 9 గంటల 30 నిమిషాల తర్వాత మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల తర్వాత అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరని స్పష్టం చేశారు.

ప్రతి జిల్లాలో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సహాయ కేంద్రం ఏర్పాటు చేసి ఉన్నారు. అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నా సహాయ కేంద్రానికి ఫోన్ సందేహాలు నివృత్తి కోవచ్చు.

పరీక్షా కేంద్రానికి అభ్యర్థి తప్పనిసరిగా ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి.

వికలాంగులైన అభ్యర్థుల కోసం జిల్లా విద్యాధికారి స్క్రైబ్స్ ను ఏర్పాటు చేస్తారు. స్క్రైబ్ కేటాయించిన దివ్యాంగ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం 50 నిమిషాలు అదనపు పరీక్షా సమయం కేటాయిస్తారు.

అభ్యర్థి ఒకటి కన్నా ఎక్కువ హాల్ టికెట్లు పొంది ఉన్నట్లయితే ఏదో ఒక పరీక్షా కేంద్రంలో మాత్రమే పరీక్షకు హాజరు కావాలి.

నిబంధనలకు వ్యతిరేకంగా ఒక అభ్యర్థి స్థానంలో మరొకరు పరీక్ష కు హాజరైనా, ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కు పాల్పడినా అభ్యర్థి పై Andhra Pradesh Public Examination (Prevention of Malpractices and Unfair means) Act, 1997 (No. 25 of1997) చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు.

హాల్ టికెట్ లో ఫోటో లేక పోయినా , సరిగా కనిపించకపోయినా , చిన్నసైజులో వున్నా అభ్యర్థి తన సరైన 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలను తీసుకువెళ్లి డిపార్మెంటల్ అధికారికి సమర్పించి అనుమతి పొందాల్సి ఉంటుంది.

నామినల్ రోల్స్ లో ఇక్కడ పొందుపరచిన అంశాలను సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అభ్యర్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, సామాజిక వర్గం, జెండర్, ఎక్స్ సర్వీస్మెన్, ఫోటో , అభ్యర్థి సంతకం మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు తదితర వివరాలు సరిచేసుకోవచ్చని కమిషనర్‌ తెలిపారు.

Whats_app_banner