AP PECET 2024: ఏపీ ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్ 2024 రిజిస్ట్రేషన్లు ప్రారంభం, డిప్లొమా, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు..-ap physical education cet 2024 registrations begin admissions for diploma degree courses ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Pecet 2024: ఏపీ ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్ 2024 రిజిస్ట్రేషన్లు ప్రారంభం, డిప్లొమా, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు..

AP PECET 2024: ఏపీ ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్ 2024 రిజిస్ట్రేషన్లు ప్రారంభం, డిప్లొమా, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు..

Sarath chandra.B HT Telugu
Apr 05, 2024 09:52 AM IST

AP PECET 2024: ఆంధ్రప్రదేశ్‌ ఫిజికల్ ఎడ్యుకేషన్‌ కామన్ ఎంట్రన్స్‌ టెస్ట్‌ 2024 నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో రెండేళ్ల డిప్లొమా, రెండేళ్ల బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు కామన్ ఎంట్రన్స్‌ నిర్వహించనున్నారు.

ఏపీ ఫిజికల్ ఎంట్రన్స్‌ టెస్ట్ 2024
ఏపీ ఫిజికల్ ఎంట్రన్స్‌ టెస్ట్ 2024

AP PECET 2024: ఆంధ్రప్రదేశ్‌ ఫిజికల్ ఎడ్యుకేషన్‌ Physical Education కామన్‌ ఎంట్రన్స్ టెస్ట్ 2024 Common entrance test 2024 రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయి. అర్హులైన అభ్యర్థుల నుంచి రెండేళ్ల డిప్లొమా కోర్సుతో పాటు రెండేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ Onlineలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఏపీ ఉన్నతవిద్యా మండలి పర్యవేక్షణలో గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం Acharya Nagarjuna University ఈ పరీక్ష నిర్వహించనుంది.

yearly horoscope entry point

ఏపీ పీఈ సెట్‌ ద్వారా ఏపీలో యూనివర్శిటీ కాలేజీలు, అనుబంధ కాలేజీల్లో డిగ్రీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌ BPEdకోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు కనీసం 19ఏళ్ల వయసుతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

డిప్లొమా ఇన్‌ ఫిజికల్ DPEd ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకుననే వారు 16ఏళ్ల వయసు పూర్తై బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, తత్సమాన విద్యార్హతలు కలిగి ఉండాలి.

ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఓసీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.900 చెల్లించాల్సి ఉంటుంది. బీసీ విద్యార్ధులు రూ.800, ఎస్సీ,ఎస్టీ విద్యార్దులు రూ.700 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్‌ కార్డు, డెబిట్ కార్డు, నెట్‌ బ్యాంకింగ్, ఏపీ ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా ఫీజులు చెల్లించవచ్చు.

ముఖ్యమైన తేదీలు ఇవే..

ఏపీ ఫిజికల్ ఎడ్యుకేషన్‌ ఎంట్రన్స్‌ దరఖాస్తులు ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరిస్తారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ నిర్వహించే పరీక్షకు ఆన్‌లైన్‌ ఈ లింక్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా మే 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో https://cets.apsche.ap.gov.in/PECET/PECET/PECET_HomePage.aspx దరఖాస్తులు స్వీకరిస్తారు. రూ.500 లేట్ ఫీజుతో మే 22వరకు స్వీకరిస్తారు. రూ.1000 జరిమానాతో మే 29వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్‌ 30,31 తేదీల్లో దరఖాస్తులకు ఎడిట్ ఆప్షన్ సదుపాయంకల్పిస్తారు. జూన్‌ 4 నుంచి హాల్‌ టిక్కెట్లను జారీ చేస్తారు.

జూన్ 11వ తేదీన సామర్థ్య పరీక్షలు జరుగుతాయి.సామర్ధ్య పరీక్షలు పూర్తైన వారంలోగా ఫలితాలను వెల్లడిస్తారు. ఫిజికల్ ఎడ్యుకేషన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్ 2024 పరీక్షలు కేవలం నాగార్జున యూనివర్శిటీ క్యాంపస్‌లో మాత్రమే నిర్వహిస్తారు. దరఖాస్తుదారుల శారీరక సామర్థ్యం, ఆటల్లో నైపుణ్యాల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.

ఏపీ పీఈ సెట్‌ 2024 ప్రధానంగా రెండు పద్ధతుల్లో నిర్వహిస్తారు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఆటల్లో స్కిల్ టెస్ట్ ఆధారంగా సామర్ధ్యాన్ని గుర్తిస్తారు. శారీరక సామర్ధ్య పరీక్షల్లో 400మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పురుషులకు, స్త్రీలకు వేర్వేరుగా పరీక్షలు జరుగుతాయి.

పరీక్ష విధానం ఇదే…

ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో పురుషులకు 100మీటర్ల పరుగు పందెంకు 100మార్కులు, పుట్టింగ్ ద ‎షాట్స్ 6కేజీలు విభాగంలో 100మార్కులు, 800మీటర్ల పరుగు పందెంలో 100మార్కులు, లాంగ్‌జంప్‌, హైజంప్‌లలో ఒకదానికి 100మార్కులు పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మహిళలకు 100మీటర్ల పరుగు, 4కేజీల పుట్టింగ్ ద షాట్స్‌, 400మీటర్ల పరుగు, లాంగ్ జంప్, హైజంప్‌ ఈవెంట్లు ఉంటాయి. లాంగ్‌ జంప్‌, హైజంప్‌లలో దేంట్లో పాల్గొంటారనేది దరఖాస్తులు పేర్కొనాల్సి ఉంటుంది.

రెండో విభాగంలో బాల్ బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, క్రికెట్, ఫుట్ బాల్, హ్యాండ్ బాల్, హాకీ, కబాడ్డీ, ఖోఖో, షటిల్ బ్యాడ్మింటన్, టెన్నిస్, వాలీబాల్‌ క్రీడల్లో సామర్థ్యం చూపాల్సి ఉంటుంది.

సామర్థ్య పరీక్షల సమయంలోనే క్రీడా పోటీల్లో సాధించిన సర్టిఫికెట్లు, కనీస విద్యార్హతల పత్రాలు, ఇతర విద్యార్హతల పత్రాలను చూపాల్సి ఉంటుంది. హాల్‌ టిక్కెట్లను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సామర్ద్య పరీక్షల్లో కనీసం 30శాతం మార్కులు సాధించిన వారిని కోర్సులకు ఎంపిక చేస్తారు. ఎస్సీ, ఎస్టీల అభ్యర్థులకు కనీస అర్హత మార్కులు లేవు.

Whats_app_banner

సంబంధిత కథనం