AP Govt Jobs 2024 : ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు - ముఖ్య వివరాలు-ap mineral development corporation has issued a notification for filling up 9 posts 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Govt Jobs 2024 : ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు - ముఖ్య వివరాలు

AP Govt Jobs 2024 : ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు - ముఖ్య వివరాలు

APMDC Recruitment 2024: ఉద్యోగాల భర్తీకి ఏపీ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 9 పోస్టులను రిక్రూట్ చేస్తారు. వీటిని కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తులకు అక్టోబర్ 21వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఉద్యోగాలు

AP Mineral Development Corporation: ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది.ఇందులో భాగంగా 9 మేనేజీరియల్ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో వెల్లడించారు. మూడేళ్ల కాలపరిమితికి పని చేయాల్సి ఉంటుంది. ఇందులో మైనింగ్ వింగ్ లో మేనేజర్ పోస్టులు ఆరు ఖాళీలు ఉండగా ఐటీ విభాగంలో ఒక పోస్టు ఉంది. లీగల్ పోస్టు మరోకటి భర్తీ చేస్తారు.

ఈ పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తిస్థాయి నోటిఫికేషన్ ను https://apmdc-recruitment వెబ్ సైట్ లో చూడొచ్చు. మైనింగ్ మేనేజర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు మంగంపేటలో పని చేయాల్సి ఉండగా... మిగతా వారు విజయవాడలో విధులు నిర్వర్తించాలి. దరఖాస్తు చేసుకునే వాళ్లు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీతో పాటు తగిన అర్హతలు కలిగి ఉండాలి. అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ఏపీ కేజీబీవీల్లో 729 నాన్ టీచింగ్ ఉద్యోగాలు:

సమగ్ర శిక్షా సొసైటీ ఆధ్వర్యంలోని కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఖాళీగా ఉన్న 729 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. వీటిని ఔట్ సోర్సింగ్ ద్వారా రిక్రూట్ చేయనున్నారు.

  • ఈ నోటిఫికేషన్ లో భాగంగా 729 ఖాళీలను భర్తీ చేస్తారు. టైప్‌-3 కేజీబీవీల్లో 547 పోస్టులు ఉండగా… టైప్‌-4 కింద 182 ఉద్యోగాలు ఉన్నాయి.
  • పోస్టుల వారీగా చూస్తే టైప్ 3 ఎక్కువగా 263 వంటమనిషి పోస్టులు ఉన్నాయి. ఇక వాచ్‌ ఉమెన్‌ 95, స్కావెంజర్‌ 79, స్వీపర్‌ ఉద్యోగాలు 62 ఉన్నాయి. టైప్ 4లో చూస్తే చౌకీదార్ 58 ఉండగా… హెడ్‌కుక్‌ 48 ఉన్నాయి. సహాయ వంట మనిషి 76 ఖాళీలు ఉన్నాయి.
  • అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తులను సమర్పించాలి. వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్లను పూర్తి చేసి… మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది.
  • అక్టోబర్ 16వ తేదీన మండలాల వారీగా అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తారు.
  • అక్టోబర్ 17వ తేదీన సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ కార్యాలయానికి పంపిస్తారు.
  • అక్టోబర్ 18వ తేదీన తుది జాబితా సిద్ధం. ఆ తర్వాత జిల్లా స్థాయి ఎంపిక కమిటీ ఆమోదం వేస్తుంది. ఇది అక్టోబర్ 21వ తేదీ నాటికి పూర్తి అవుతుంది.
  • అక్టోబర్ 22వ తేదీన ఎంపిక జాబితాలను ఇస్తారు.
  • ఎంపికైన అభ్యర్థులు అక్టోబర్ 22వ తేదీన డ్యూటీకి రిపోర్టింగ్ చేయాలి.