TS Govt e-Mining App : ఇక మైనింగ్ అక్రమాలకు చెక్... అందుబాటులోకి ‘ఈ - మైనింగ్‌ మొబైల్ యాప్‌’-minister mahender reddy launched telangana e mining mobile app ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Govt E-mining App : ఇక మైనింగ్ అక్రమాలకు చెక్... అందుబాటులోకి ‘ఈ - మైనింగ్‌ మొబైల్ యాప్‌’

TS Govt e-Mining App : ఇక మైనింగ్ అక్రమాలకు చెక్... అందుబాటులోకి ‘ఈ - మైనింగ్‌ మొబైల్ యాప్‌’

Maheshwaram Mahendra Chary HT Telugu
Published Oct 01, 2023 01:30 PM IST

e-Mining App in Telangana: రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మొబైల్ యాప్ ను తీసుకొచ్చింది. ఈ యాప్… గనులు, ఇసుక మరియు ఖనిజ రవాణా తనిఖీలు, అక్రమార్కులకు అడ్డుకట్ట వేస్తూ చేసేందుకు దోహదం చేస్తుందని అధికారులు తెలిపారు.

మైనింగ్ యాప్ లోగోను ఆవిష్కరించిన మంత్రి మహేందర్ రెడ్డి
మైనింగ్ యాప్ లోగోను ఆవిష్కరించిన మంత్రి మహేందర్ రెడ్డి (Facebook)

TS Govt e-Mining App : గనులు, భూగర్భ వనరుల శాఖలో మరింత పారదర్శకతను పెంచుతూ అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా తెలంగాణ సర్కార్ ముందడుగు వేసింది. ఇందులో భాగంగా ‘ఈ మైనింగ్ మొబైల్ యాప్’ దోహదం చేస్తుందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయ భవనంలో సీఎస్ శాంతి కుమారి, గనుల శాఖ డీఎం జి పి. కాత్యాయని దేవిలతో కలిసి తెలంగాణ ఈ - మైనింగ్ మొబైల్ యాప్ ను మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. తెలంగాణ గనులు, భూగర్భ వనరుల శాఖ మరియు హైదరాబాద్ లోని జాతీయ సమాచార విజ్ఞాన కేంద్రం (ఎన్ఐసి) సంయుక్తంగా ఈ మొబైల్ యాప్ ను అభివృద్ధి పరిచినట్లు చెప్పారు.ఈ మైనింగ్ యాప్ తో గనులు, ఇటుక, ఇసుక రవాణా జరిగినప్పుడు రవాణా వాహనాలను తనిఖీ చేసి ట్రాన్సిస్ట్ ఫామ్ మరియు ట్రాన్సిస్టర్ అనుమతులు ఉన్నాయా లేవా అని అంశాలను ఆన్ లైన్ లో వెంటనే సిబ్బంది తెలుసుకోవచ్చని తెలిపారు. అక్రమ రవాణా, అనుమతులు లేకుండా కానీ, అనుమతులు ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా అధిక మోతాదులో రవాణాకు పాల్పడితే వారిపై చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. పెనాల్టీ విధించి ఆ సమాచారాన్ని వాహన యజమానికి ఆన్ లైన్ పద్ధతిలో లింక్ ద్వారా పంపించి వెంటనే పెనాల్టీ వసూలు చేసేందుకు సిబ్బందికి, అలాగే చెల్లించేందుకు వాహన యజమానికి వెసులుబాటు ఉంటుందని అన్నారు.డీలర్లు మరియు లీజు హోల్డర్లు ఖనిజ రవాణాలో ఆన్ లైన్ ద్వారా తమ రవాణా చేసుకునేందుకు శాఖా పరమైన అనుమతుల నిర్ధారణ సైతం తెలుసుకోవచ్చని వివరించారు. అలాగే తనిఖీలు నిర్వహించే గనుల శాఖ ఏడీలు, అసిస్టెంట్ జువాలజిస్టులు, టెక్నీషియన్లు, రాయల్టీ ఇన్స్పెక్టర్లకు వాహనాల తనిఖీ చాలా సులభం అవుతుందని వెల్లడించారు.

ఈ మైనింగ్ మొబైల్ యాప్ ద్వారా అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు వెంటనే తీసుకోవడంతో పాటు పారదర్శకత మరింత పెరుగుతుందని మంత్రి మహేందర్ రెడ్డి చెప్పారు. ఇసుకతో పాటు ఇటుక, ఖనిజాల అక్రమ రవాణాలో పారదర్శకతకు ఎంతో తోడ్పడుతుందని… దేశంలోనే ఎక్కడలేని విధంగా అభివృద్ధిపరిచే దశలో ఉందని మంత్రి మహేందర్ రెడ్డి వెల్లడించారు.

Whats_app_banner