AP Liquor policy : మద్య నిషేధం లేనట్టే… రిటైల్ పాలసీ జారీ
AP Liquor policy ఏపీలో 2022-23 సంవత్సరంలో రిటైల్ మద్యం విక్రయాల విధానానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దశల వారీ నిషేధం ద్వారా సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామనే నినాదం నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పుకున్నట్లే కనిపిస్తోంది. ఇప్పటికే ఏపీ బేవరేజీస్ కార్పొరేషన్ బాండ్ల ద్వారా వేల కోట్ల రుపాయల బాండ్లు సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడాది రిటైల్ విక్రయాలను కొనసాగించాలని నిర్ణయించింది.
AP Liquor policy ఏపీలో 2022-23 సంవత్సరానికి రిటైల్ మద్యం విక్రయాల విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2934 రిటైల్ మద్యం దుకాణాల్లో భారత్ లో తయారైన విదేశీ మద్యం, విదేశీ మద్యం, విక్రయాలకు అనుమతించనున్నారు. మద్యం విధానంలో భాగంగా మధ్య నియంత్రణ,బెల్ట్ దుకాణాల తొలగింపు తదితర కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. 2022 అక్టోబర్ 1 తేదీ నుంచి 2023 సెప్టెంబర్ 30 వరకూ మద్యం విధానం అమల్లో ఉంటుదని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే ఎక్సైజ్ శాఖ నిర్వహణలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తోంది.
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తిరుమల కు దారి తీసే అలిపిరి మార్గం లో ఎలాంటి మద్యం దుకాణాలకు అనుమతి లేదని AP Liquor policy జీవో లో ప్రభుత్వం పేర్కొంది. నిర్దేశిత రిటైల్ అవుట్ లెట్ ల సంఖ్య కు మించ కుండా వాక్ ఇన్ స్టోర్ లను ఏర్పాటు చేసేందుకు ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ కు అనుమతి నిచ్చారు.
రిటైల్ అవుట్ లెట్ ల్లో విక్రయించే మద్యం విక్రయాలను ట్రాక్ అండ్ ట్రేస్ విధానం లో పర్యవేక్షణ చేయనున్నట్టు స్పష్టం చేశారు. రిటైల్ అవుట్ లెట్ ల్లో ఇక నుంచి డిజిటల్ చెల్లింపుల కు అనుమతి ఇస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. మద్యం వాక్ ఇన్ స్టోర్ లు, రిటైల్ అవుట్ లెట్ లను ఏర్పాటు చేసుకునేందుకు ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ కు ప్రత్యేక అనుమతినిచ్చారు.
జాతీయ రహదారుల వెంబడి మద్యం విక్రయాల పై సుప్రీం కోర్టు మార్గదర్శకాలు అమలు అవుతాయని స్పష్టం చేశారు. అత్యవసర , అనివార్య పరిస్థితుల్లో రిటైల్ దుకాణం మరో చోటికి తరలించేందుకు ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ ఎండి కి అధికారాలు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది.
టాపిక్