AP Fibernet Case : ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్‌పై తీర్పు రిజర్వ్
AP FiberNet Case Updates: ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు గురువారం విచారించింది. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం…. తీర్పును రిజర్వ్ చేసింది.
AP Fiber Net Case Updates: ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారించింది. చంద్రబాబు తరపున సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించగా… రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది.
చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దంటూ సీఐడీ తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరాం వాదనలు వినిపించగా… స్కిల్ కేసులో ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోటీసులు ఇచ్చిన చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్, పార్థసాని ఇప్పటికే పరారీలో ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. చంద్రబాబు ప్రమేయంతోనే వారిద్దరూ పరారైనట్లు తనకు సమాచారం ఉందని… ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు బయటకు వస్తే సాక్షులు ప్రభావితం చేస్తారని వాదించారు.
చంద్రబాబు తరపున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ…. సర్కార్ తీసుకున్న విధానపరమైన నిర్ణయాలకు చంద్రబాబుని బాధ్యుడ్ని చేయడం సరికాదన్నారు. రాజకీయ కక్షతో మాత్రమే కేసు నమోదు చేశారని కోర్టుకు వివరించారు. రెండేళ్ల క్రితం కేసు నమోదు చేసి చంద్రబాబుకి నోటీసులు ఇవ్వలేదని ప్రస్తావించారు. మొన్నటి వరకు నిందితుడిగా చేర్చలేదని… అకస్మాత్తుగా A25గా చేర్చారని చెప్పారు. చంద్రబాబు తరపున సిద్దార్థ లూథ్రా వర్చువల్ గా వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం… తీర్పును రిజర్వ్ చేసింది.