IPS Transfers in AP : ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీ - ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా మాజీ డీజీపీ
IPS Transfers in AP : ఏపీలో పలువురు ఐపీఎస్ లు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.
IPS Transfers in AP : ఏపీలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం… శాఖల వారీగా ప్రక్షాళన షురూ చేసింది. ఇప్పటికే పలు శాఖల్లో బదిలీలు చేపట్టగా… తాజా పలువురు ఐపీఎస్ లను బదిలీ చేసింది.
ఇందులో భాగంగా మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా నియమించింది. ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్న సునీల్ కుమార్ ను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. శంకబత్ర బాగ్చీకి ఫైర్ సర్వీసెస్ అదనపు బాధ్యతలను అప్పగించింది. కౌంటర్ ఇంటలిజెన్స్ సెల్ ఎస్పీగా ఉన్న రిశాంత్ రెడ్డిని డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా ద్వారకా తిరుమల రావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బుధవారం జీవో 1086 జారీ చేసింది. ద్వారకా తిరుమలకు రావుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
1989 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ద్వారకా తిరుమల రావు గతంలో పలు హోదాల్లో పనిచేశారు. సౌమ్యుడు, విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉంటారనే పేరుంది. రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారుల్లో సీనియర్‌గా ఉన్న ద్వారకా తిరుమల రావును హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్సెస్‌గా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఐఏఎస్ అధికారుల బదిలీ….
బుధవారం పలువురు ఐఏఎస్ అధికారులు కూడా బదిలీ అయ్యారు. రాష్ట్రంలోని కీలక శాఖల్లో పనిచేస్తోన్న ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తున్నట్లు సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారులపై వేటు పడింది. వారిని జీఏడీ అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, మురళీధర్ రెడ్డిలను జీఏడీలో రిపోర్టు చేయాలని సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఐఏఎస్ ల బదిలీలు
- జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్
- పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా శశిభూషణ్ కుమార్
- వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్
- కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది
- పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్
- పౌరసరఫరాలశాఖ కమిషనర్ గా సిద్ధార్థ్ జైన్
- ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సౌరభ్ గౌర్
- నైపుణ్యాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శిగా సౌరభ్ గౌర్ కు అదనపు బాధ్యతలు
- పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా కోన శశిధర్
- ఐటీ, ఆర్టీజీఎస్ కార్యదర్శిగా కోన శశిధర్ కు పూర్తి అదనపు బాధ్యతలు
- ఉద్యాన, మత్స్యశాఖ సహకార విభాగాల కార్యదర్శిగా ఎ.బాబు
- ఏపీ సీఆర్డీఏ కమిషనర్ గా కాటమనేని భాస్కర్
- ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రద్యుమ్న
- ఆర్థికశాఖ వ్యయ విభాగం కార్యదర్శిగా ఎం.జానకి
- పశుసంవర్థకశాఖ కార్యదర్శిగా ఎం.ఎం.నాయక్
- గనులశాఖ కమిషనర్, డైరెక్టర్ గా ప్రవీణ్ కుమార్
- ఏపీఎండీసీ ఎండీగా ప్రవీణ్ కుమార్ కు అదనపు బాధ్యతలు
- తిరుపతి జేసీకి జిల్లా కలెక్టర్ గా పూర్తి అదనపు బాధ్యతలు
- ఆర్థికశాఖ కార్యదర్శిగా వి.వినయ్ చంద్