AP ECET Results: రేపే ఏపీ ఈసెట్‌ 2024 ఫలితాలు విడుదల చేయనున్న జేఎన్‌టియూ..ఇంజనీరింగ్ రెండో ఏడాదిలో ప్రవేశాలు-ap ecet 2024 results to be released tomorrow jntu engineering second year admissions ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ecet Results: రేపే ఏపీ ఈసెట్‌ 2024 ఫలితాలు విడుదల చేయనున్న జేఎన్‌టియూ..ఇంజనీరింగ్ రెండో ఏడాదిలో ప్రవేశాలు

AP ECET Results: రేపే ఏపీ ఈసెట్‌ 2024 ఫలితాలు విడుదల చేయనున్న జేఎన్‌టియూ..ఇంజనీరింగ్ రెండో ఏడాదిలో ప్రవేశాలు

Sarath chandra.B HT Telugu
Published May 29, 2024 12:02 PM IST

AP ECET Results: ఏపీ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ 2024 ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. ఈ ఏడాది ఏపీ ఈసెట్‌ పరీక్షకు 35,024మంది దరఖాస్తు చేసుకున్నారు.

రేపే ఏపీ ఈసెట్‌ 2024  ఫలితాల విడుదల
రేపే ఏపీ ఈసెట్‌ 2024 ఫలితాల విడుదల

AP ECET 2024: ఏపీ ఇంజనీరింగ్ కామన్‌ ఎంట్రన్స‌‌ టెస్ట్ 2024ను ఫలితాలను గురువారం విడుదల చేసేందుకు జేఎన్‌టియూ అనంతపురం ఏర్పాట్లు చేసింది. ఫలితాలను ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమ చంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. ఈ ఏడాది ఈసెట్‌ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 35వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.

ఏపీ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్ ఈసెట్‌ 2024 మే8న నిర్వహించారు. మే 1 నుంచి ఆన్‌‌లైన్‌లో ఈసెట్‌ హాల్‌టిక్కెట్లను అందుబాటులో ఉంచారు. మే 8వ తేదీన ఏపీ ఈసెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు. మే 10వ తేదీన ప్రాథమిక కీ విడుదల చేస్తారు. మే 12వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరిస్తారు.

ఆంధ్రప్రదేశ్‌ లో ఇంజనీరింగ్‌ కోర్సుల్లో రెండో ఏడాది ప్రవేశాల కోసం నిర్వహించే ఈసెట్‌ నోటిఫికేషన్ 2024 గత మార్చిలో విడుదలైంది. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ల కోసం ఏపీ ఉన్నత విద్యా మండలి మార్చిలో నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 8న ప్రవేశ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించారు.

మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులను పూర్తి చేసిన తర్వాత ఇంజనీరింగ్ కోర్సుల్లో నేరుగా రెండో ఏడాది ప్రవేశాల కోసం ఈసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష ద్వారా ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసుకున్న విద్యార్ధులు ప్రవేశాలు పొందవచ్చు.

2024-25 విద్యా సంవత్సరంలో రెండో ఏడాది ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 8వ తేదీన ఈసెట్‌ 2024 ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి 12గంటల వరకు ఓ సెషన్, మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదున్నర వరకు మరో సెషన్‌లో పరీక్ష నిర్వహించారు.

ఈసెట్‌ 2024 ప్రవేశాల కోసం మార్చి 15వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరించారు. రూ.5వేల ఆలస్య రుసుముతో మే 2వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు.

ఏపీ ఈసెట్‌ 2024 ఇన్ఫర్మేషన్ బ్రోచర్, విద్యార్హతలు, కోర్సుల వారీగా అర్హతలు, ఇంజనీరింగ్, టెక్నాలజీ డిప్లొమాల వారీగా ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు అనుమతించే కోర్సుల వివరాలు, సీట్ల లభ్యత, యూనివర్శిటీల పరిధిలో కళాశాలల జాబితా వంటి వివరాలు నోటిఫికేషన్‌‌ బ్రోచర్‌లో అందుబాటులో ఉన్నాయని కన్వీనర్ భానుమూర్తి వెల్లడించారు.

ప్రవేశపరీక్ష ఇలా..

ఈసెట్ పరీక్షలో 200మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. వీటిలో 50 మార్కులు మ్యాథ్స్‌ నుంచి ఉంటాయి. ఫిజిక్స్ నుంచి 25, కెమిస్ట్రీ నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి. మరో 100 మార్కులు సంబంధిత విభాగానికి సంబంధించినవి ఉంటాయి.

ఫార్మసీ విభాగంలో ఫార్మాస్యూటిక్స్‌లో 50 మార్కులు, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీలో 50, ఫార్మాకాగ్నసీలో 50, ఫార్మాకాలజీలో 50 మార్కలుకు ప్రశ్నలు ఉంటాయి. బిఎస్సీ విద్యార్హతతో దరఖాస్తు చేసేవారికి మ్యాథ్స్‌లో 100 మార్కులు, అనలిటికల్ ఎబిలిటీలో 50, కమ్యూనికేషన్ ఇంగ్లీష్‌లో 50 ప్రశ్నలు ఉంటాయి. అగ్రికల్చర్ బిఎస్సీ ప్రవేశాలకు డిప్లొమా కోర్సులు పూర్తి చేయాల్సి ఉంటుంది. పాలిటెక్నిక్‌ తర్వాత బిఇ, బిటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలను పొందే వారు మూడేళ్లలో ఇంజనీరింగ్ పూర్తి చేస్తారు.

Whats_app_banner

సంబంధిత కథనం