Tourist Police Stations : ఏపీలో పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ స్టేషన్లు….-ap cm inaugurated tourist police stations in 20 locations across andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tourist Police Stations : ఏపీలో పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ స్టేషన్లు….

Tourist Police Stations : ఏపీలో పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ స్టేషన్లు….

HT Telugu Desk HT Telugu
Feb 14, 2023 11:59 AM IST

AP Cm Jagan ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, పుణ్య క్షేత్రాల్లో ప్రజల భద్రతే లక్ష్యంగా Tourist Police Stations టూరిస్ట్‌ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 పర్యాటక ప్రాంతాలు, అధ్యాత్మిక కేంద్రాల్లో టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి సిఎం వర్చువల్‌గా ప్రారంభించారు.

టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన సిఎం జగన్
టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన సిఎం జగన్

Tourist Police Stations ఆంధ్రప్రదేశ్‌ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో టూరిస్ట్‌ పోలీస్ స్టేషన్లను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. సిఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్లను ముఖ్యమంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ శాఖలో ఎన్నో సంస్కరణల్ని అమలు చేస్తున్నట్లు సిఎం జగన్ తెలిపారు.

yearly horoscope entry point

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జీరో ఎఫ్‌ఐఆర్ విధానాన్ని రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు చెప్పారు. ప్రజలు ఎక్కడైనా పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చని, ఆ తర్వాత కేసును అయా పోలీస్ స్టేషన్లకు బదిలీ చేసే వీలు కలుగుతుందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో గతానికి భిన్నమైన ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామని, పోలీస్ స్టేషన్లలో రిసెప్షనిస్ట్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు సిఎం జగన్ చెప్పారు.

మహిళల భద్రత కోసం దిశా యాప్ ఇన్‌స్టాలేషన్లు చేయించినట్లు చెప్పారు. కోటి 20లక్షల మంది మహిళలకు దిశాయాప్ ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ప్రజలు తమ స్మార్ట్‌ ఫోన్‌తో ఐదుసార్లు ఫోన్‌ షేక్ చేసినా, ఎస్‌ఓఎస్ బటన్ నొక్కినా ఐదు సెకండ్లలోనే పోలీసుల నుంచి వెనక్కి ఫోన్ వచ్చేలా సాంకేతికత అభివృద్ధి చేసినట్లు సిఎం జగన్ చెప్పారు.

తాజాగా 20 పర్యాటక ప్రాంతాల్లో టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. పర్యాటక ప్రాంతాలు, అధ్యాత్మిక ప్రాంతాల్లో ఉన్న 20ప్రాంతాల్లో కియోస్క్‌లను ఏర్పాటు చేసి, వాటిని స్థానిక పోలీస్ స్టేషన్‌లకు అనుసంధానించినట్లు చెప్పారు. ప్రతి కియోస్క్‌లో 6గురు సిబ్బందిని ఉంచుతున్నట్లు చెప్పారు. ప్రతి షిష్ట్‌లో ఇద్దరు సిబ్బంది ఎనిమిది గంటలు విధుల్లో ఉంటారని, 12 గంటల షిఫ్ట్‌లో మరో ముగ్గురు పనిచేస్తారని సిఎం తెలిపారు. ప్రతి కియోస్క్‌ బాధ్యతల్ని ఎస్సై, ఏఎస్సై స్థాయి అధికారి పర్యవేక్షిస్తారని చెప్పారు.

ప్రతి కియోస్క్‌‌కు టెలిఫోన్‌ సదుపాయంతో పాటు వాహన సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా 24గంటలు సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని చెప్పారు. పోలీస్ శాఖ తరపున చేపట్టిన సంస్కరణల్లో ఇదొక కొత్త అధ్యాయన్ని సృష్టిస్తుందన్నారు. పర్యాటకులు, యాత్రికుల్లో మహిళలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రతి కియోస్క్‌లో మహిళా పోలీస్ సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు.

పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తినా పోలీస్ సిబ్బంది సహకారం అందిస్తారని సిఎం జగన్ చెప్పారు. పర్యాటకులు, ప్రజల భద్రతే ధ్యేయంగా కియోస్క్‌లను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అనంతరం డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి, హోంమంత్రి వనితలతో కలిసి ముఖ్యమంత్రి టూరిస్ట్‌ పోలీస్ స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించారు.

టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్లను విశాఖపట్నం ఆర్కే బీచ్, వైఎస్సార్‌ జిల్లా గండికోట ఫోర్ట్, కాకినాడ జిల్లా పిఠాపురం కుక్కుటేశ్వరాలయం, రాజమండ్రి పుష్కరఘాట్, ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల ఆలయం, కృష్ణాజిల్లా మంగినపూడి బీచ్, విజయవాడ ఇంద్రకీలాద్రి, ఒంటిమిట్ట రామాలయం, రాజమండ్రి గోదావరి ఘాట్, కాకినాడ బీచ్, మోపిదేవి, ఎన్టీఆర్‌ జిల్లాలో భవానీ ఐలాండ్, బెజవాడ ఇంద్రకీలాద్రి, ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం, నెల్లూరు జిల్లా మైపాడు బీచ్, నెల్లూరు జిల్లా పెంచలకొండ ఆలయం, కర్నూలు జిల్లా మంత్రాలయం, నంద్యాల జిల్లా మహానంది, నంద్యాల జిల్లా మహానంది, అన్నమయ్య జిల్లా హార్స్‌లీ హిల్స్‌, సత్యసాయిజిల్లా లేపాక్షిలో ఏర్పాటు చేశారు. అన్ని పోలీస్ స్టేషన్లను ముఖ్యమంత్రి వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు.

Whats_app_banner