Agricultural courses: పీజీ అగ్రి కోర్సుల్లో ఎన్ఆర్ఐ కోటా సీట్లకు నోటిఫికేషన్.. దరఖాస్తుకు ఆగ‌స్టు 31 ఆఖ‌రు తేదీ-angrau release notification for filling nri quota seats in agriculture courses ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Agricultural Courses: పీజీ అగ్రి కోర్సుల్లో ఎన్ఆర్ఐ కోటా సీట్లకు నోటిఫికేషన్.. దరఖాస్తుకు ఆగ‌స్టు 31 ఆఖ‌రు తేదీ

Agricultural courses: పీజీ అగ్రి కోర్సుల్లో ఎన్ఆర్ఐ కోటా సీట్లకు నోటిఫికేషన్.. దరఖాస్తుకు ఆగ‌స్టు 31 ఆఖ‌రు తేదీ

HT Telugu Desk HT Telugu
Aug 29, 2024 04:11 PM IST

Agricultural courses: వ్య‌వ‌సాయ కోర్సుల్లో ఎన్ఆర్ఐ కోటా సీట్ల‌కు సంబంధించి.. ఏఎన్‌జీఆర్‌ఏయూ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈనెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అప్లికేషన్ ఫీజు రూ.1500 ఉంటుందని అధికారులు వెల్లడించారు.

పీజీ అగ్రి కోర్సుల్లో ఎన్ఆర్ఐ కోటా సీట్లకు నోటిఫికేషన్
పీజీ అగ్రి కోర్సుల్లో ఎన్ఆర్ఐ కోటా సీట్లకు నోటిఫికేషన్

ఆచార్య ఎన్‌జీ రంగా వ్య‌వ‌సాయ‌ యూనివ‌ర్శిటీ (ఏఎన్‌జీఆర్‌ఏయూ), అనుబంధ, ప్రైవేట్‌ కాలేజీల్లో పోస్టు గ్రాడ్యూష‌న్ (పీజీ) వ్య‌వ‌సాయ కోర్సుల్లో ఎన్ఆర్ఐ కోటా సీట్ల‌కు సంబంధించి నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. ద‌ర‌ఖాస్తు దాఖ‌లుకు ఆఖ‌రు తేదీ ఆగ‌స్టు 31గా ఏఎన్‌జీఆర్‌ఏయూ నిర్ణయించింది. 2024-25 విద్యా సంవ‌త్సరానికి గానూ.. అగ్రిక‌ల్చ‌ర‌ల్ పీజీ చేసేందుకు ద‌రఖాస్తులు ఆహ్వానిస్తుంది. అగ్రిక‌ల్చ‌ర‌ల్‌, అగ్రిక‌ల్చ‌ర‌ల్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాల‌జీ, కమ్యూనిటీ సైన్స్ (హోం సైన్స్‌) వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

అర్హ‌త‌లు.. సీట్లు..

ఈ కోర్సుల కోసం అప్లికేషన్ దాఖ‌లు చేసేందుకు 2024 జూలై 1 నాటికి 40 ఏళ్లు వ‌య‌స్సు దాటి ఉండ‌కూడ‌దు. అగ్రిక‌ల్చ‌ర‌ల్‌, అగ్రిక‌ల్చ‌ర‌ల్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాల‌జీ, కమ్యూనిటీ సైన్స్,హోం సైన్స్‌ల్లో నాలుగేళ్ల బ్యాచిల‌ర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఐఈఎల్‌టీఎస్ లేదా టోఫెల్ స‌ర్టిఫికేట్ త‌ప్ప‌ని స‌రిగా ఉండాలి. కోర్సు రెండేళ్లు నాలుగు సెమిస్ట‌ర్స్ ఉంటాయి. ఎన్ఆర్ఐ కోటా కింద 53 సీట్లు రిజ్వ‌ర్ చేసి ఉంటాయి. అందులో ఆరు సీట్లు అగ్రిక‌ల్చ‌ర‌ల్ ఇంజ‌నీరింగ్‌, టెక్నాల‌జీ, ఆరు సీట్లు క‌మ్యూనిటీ సైన్స్‌, 41 సీట్లు అగ్రిక‌ర్చ‌ర‌ల్ విభాగంలో ఎన్ఆర్ఐ కోటా కింద కేటాయించారు.

ద‌ర‌ఖాస్తు ఎలా చేయాలి?

ద‌ర‌ఖాస్తు ఆఫ్‌లైన్‌లో చేయాల్సి ఉంటుంది. యూనివ‌ర్శిటీ అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://angrau.ac.in/downloads/Admissions/NRI_PG/2.Application%20form%20for%20PG%20Admissions%20New.pdf ను క్లిక్ చేస్తే అప్లికేష‌న్‌ ఓపెన్ అవుతుంది. దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి. అప్లికేష‌న్‌లో అడిగిన స‌మాచారాన్ని పూర్తి చేయాలి.

అప్లికేష‌న్ ఫీజు..

అప్లికేష‌న్ ఫీజు రూ.1,500 ఉంటుంది. దీనిని యూనివ‌ర్శిటీ అకౌంట్‌కి ఆన్‌లైన్ ద్వారా.. లేదా డీడీ రూపంలో ఆఫ్‌లైన్‌లోనై చెల్లించొచ్చు. అకౌంట్ పేరు: COMPTROLLER, ANGRAU అకౌంట్ నెంబ‌ర్: 921010016250245, బ్యాంక్ పేరు: AXIS BANK, GUNTUR, ఐఎఫ్ఎస్‌సీ కోడ్: UTIB0000070 కి చెల్లించాలి.

ప్రొసెసింగ్ ఫీజు రూ.4,150 ఉంటుంది. ఇనిస్టిట్యూట్ ఎక‌నామిక్ ఫీజు రూ.5,000 యూఎస్ డాల‌ర్ల‌ను చెల్లించాల్సి ఉంటుంది. అడ్మిష‌న్ ఫీజు రూ.1,060, రిజిస్ట్రేష‌న్ ఫీజు రూ.940, ట్యూష‌న్ ఫీజు రూ.9,100, లేబొర‌టొరీ డిపాజిట్ రూ.3,910, లైబ్ర‌రీ డిపాజిట్ రూ. 1,320, మెడిక‌ల్ ఫీజు రూ. 400, స్పోర్ట్స్, గేమ్స్‌, క‌ల్చ‌ర‌ల్ మీట్ ఫీజు రూ.1,740, అకాడ‌మిక్ రెగ్యులేష‌న్ ఫీజు రూ.410 ఉంటుంది.

హాస్ట‌ల్ రూమ్ రెంట్ (ప్ర‌తి సెమిస్ట‌ర్‌) రూ.2,150, ఐడెంటిటీ కార్డు రూ.290, స్పోర్ట్స్, గేమ్స్ ఫీజు రూ.800, హాస్ట‌ల్ ఎస్టాబ్లిస్‌మెంట్ ఛార్జీస్ (ప్ర‌తి నెల‌) రూ.1,200, ఎగ్జామినేష‌న్ ఫీజు రూ.2,370, కాలేజీ మ్యాగజిన్ ఫీజు రూ.1,200, స్టూడెంట్ హెల్త్‌కేర్ స్కీమ్ రూ.400, స్టూడెంట్ వెల్ఫ‌ర్ ఫండ్ రూ.400 ఇలా మొత్తం రూ.35 వేలు వ‌ర‌కు ఉంటుంది.

అప్లికేష‌న్‌తో జ‌త చేయాల్సిన ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు..

అభ్యర్థి, పేరెంట్స్ రూ.200 స్టాంప్ డ్యూటీపై నోట‌రీ చేయించాలి. అలాగే స్పాన్స‌ర్ ఉంటే దానికి సంబంధించి కూడా రూ.200 స్టాంప్ డ్యూటీపై నోటరీ చేయించాలి. ఎన్ఆర్ఐ స్టేట‌స్ స‌ర్టిఫికేట్‌, యూజీ, ఎస్ఎస్‌సీ మార్క్స్ లిస్టు, ఇంట‌ర్మీడియ‌ట్ స‌ర్టిఫికేట్‌, నాలుగో త‌ర‌గ‌తి నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు స్ట‌డీ స‌ర్టిఫికేట్లు జత చేయాలి. టీసీ, మైగ్రేంట్ స‌ర్టిఫికేట్‌, మెడిక‌ల్ ఫిట్‌నెస్ స‌ర్టిఫికేట్ త‌దిత‌ర ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు అప్లికేష‌న్‌కు జ‌త చేయాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా.. 7674932875, 9966503925 ఫోన్ నంబర్లలో ఉద‌యం 10 గంటల నుండి సాయంత్రం 5:30 గంట‌ల వ‌ర‌కు సంప్ర‌దించొచ్చు.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)