Konaseema Jobs : కోన‌సీమ జిల్లాలో కాంట్రాక్టు పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానం, ఆగ‌స్టు 30 ఆఖ‌రు తేదీ-konaseema women child welfare contract jobs apply offline by august 30th ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Konaseema Jobs : కోన‌సీమ జిల్లాలో కాంట్రాక్టు పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానం, ఆగ‌స్టు 30 ఆఖ‌రు తేదీ

Konaseema Jobs : కోన‌సీమ జిల్లాలో కాంట్రాక్టు పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానం, ఆగ‌స్టు 30 ఆఖ‌రు తేదీ

HT Telugu Desk HT Telugu
Aug 25, 2024 05:08 PM IST

Konaseema Jobs : కోనసీమ జిల్లాలో మ‌హిళా, శిశు సంక్షేమ శాఖకు సంబంధించి కాంట్రాక్ట్ ఉద్యోగుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. ఆగస్టు 30వ తేదీ లోపు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. మొత్తం 13 పోస్టుల‌ను భ‌ర్తీ చేయనున్నారు.

 కోన‌సీమ జిల్లాలో కాంట్రాక్టు పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానం, ఆగ‌స్టు 30 ఆఖ‌రు తేదీ
కోన‌సీమ జిల్లాలో కాంట్రాక్టు పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానం, ఆగ‌స్టు 30 ఆఖ‌రు తేదీ

Konaseema Jobs : కోన‌సీమ జిల్లాలో కాంట్రాక్టు ప‌ద్ధతిలో ఉద్యోగాలను భ‌ర్తీ చేసేందుకు అర్హులైన వారి నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా వివిధ ర‌కాల ఉద్యోగాలు భ‌ర్తీకి అర్హులైన వారి నుంచి ఆఫ్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది. ద‌ర‌ఖాస్తు చేసేందుకు ఆఖ‌రు తేదీ ఆగ‌స్టు 30వ తేదీగా నిర్ణయించారు. ఆ తేదీ లోపు సంబంధిత కార్యాల‌యంలో ద‌ర‌ఖాస్తును అంద‌జేయాల్సి ఉంటుంది.

బీఆర్ అంబేడ్కర్ కోన‌సీమ జిల్లా మ‌హిళా, శిశు సంక్షేమ శాఖకు సంబంధించి మ‌హిళా శిశు సంక్షేమ‌ సాధికారిత అధికారి కార్యాల‌యం వారు ఈ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. మొత్తం 13 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసే అభ్యర్థుల వ‌యో ప‌రిమితి 2024 జులై 1 నాటికి 25 నుంచి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

పోస్టులు

సెంట్రల్ అడ్మినిస్ట్రేట‌ర్‌-1, కేస్ వ‌ర్కర్-2, పారా లీగ‌ల్ ప‌ర్సన‌ల్ లాయ‌ర్-1, పారా మెడిక‌ల్ ప‌ర్సన‌ల్-1 సైకో సోష‌ల్ కౌన్సిల‌ర్-1, ఆఫీస్ అసిస్టెంట్ (కంప్యూట‌ర్ పరిజ్ఞానం)-1, మ‌ల్లీప‌ర్పస్ స్టాప్‌-3, సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్‌-3 పోస్టులు భ‌ర్తీ చేస్తారు.

నెల‌కు వేత‌నం

సెంట్రల్ అడ్మినిస్ట్రేట‌ర్‌కు రూ.34,000, కేస్ వ‌ర్కర్‌కు రూ.19,500, పారా లీగ‌ల్ ప‌ర్సన‌ల్ లాయ‌ర్‌కి రూ.20,000, పారా మెడిక‌ల్ ప‌ర్సన‌ల్‌కి రూ.19,000, సైకో సోష‌ల్ కౌన్సిల‌ర్‌కు రూ.20,000, ఆఫీస్ అసిస్టెంట్‌కు రూ. 19,000, మ‌ల్టీప‌ర్పస్ స్టాప్‌కు రూ.13,000, సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్‌కు రూ.15,000 ఉంటుంది.

ఆస‌క్తి గ‌ల అభ్యర్థులు జిల్లా మ‌హిళ‌, శిశు సంక్షేమ, సాధికారిత అధికారి, ఎయిమ్స్ ఇంజినీరింగ్ కాంపౌండ్‌, రెండో అంత‌స్తు, రూమ్ నెంబ‌ర్ 204, ముమ్మిడివ‌రం, బీఆర్ అంబేడ్కర్ జిల్లా చిరునామాకు అప్లికేష‌న్ పంపించాలి. అప్లికేష‌న్ దాఖ‌లు చేసిన అభ్యర్థుల‌ను మెరిట్ ప్రాతిప‌దిక‌న షార్ట్ లిస్ట్ చేసి ఇంట‌ర్వ్యూలు నిర్వహిస్తారు.

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌ https://cdn.s3waas.gov.in/s3c51ce410c124a10e0db5e4b97fc2af39/uploads/2024/08/2024081979.pdf ను క్లిక్ చేసిన అప్లికేష‌న్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

జ‌గ‌దీశ్వరరావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

సంబంధిత కథనం