NLU Visakhapatnam : సంజీవ‌య్య నేషనల్ లా యూనివ‌ర్శిటీలో ఎల్ఎల్‌బీ ప్రవేశాలు - దరఖాస్తులకు ఆగ‌స్టు 15 ఆఖ‌రు తేదీ-damodaram sanjivayya national law university llb admission notification released 2023 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nlu Visakhapatnam : సంజీవ‌య్య నేషనల్ లా యూనివ‌ర్శిటీలో ఎల్ఎల్‌బీ ప్రవేశాలు - దరఖాస్తులకు ఆగ‌స్టు 15 ఆఖ‌రు తేదీ

NLU Visakhapatnam : సంజీవ‌య్య నేషనల్ లా యూనివ‌ర్శిటీలో ఎల్ఎల్‌బీ ప్రవేశాలు - దరఖాస్తులకు ఆగ‌స్టు 15 ఆఖ‌రు తేదీ

HT Telugu Desk HT Telugu
Aug 09, 2024 08:38 PM IST

National Law University Visakhapatnam : ఎల్ఎల్ బీ మూడేళ్ల కోర్సులో ప్రవేశాలకు విశాఖలోని సంజీవయ్య నేషనల్ లా యూనివర్శిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://dsnlu.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.

మూడేళ్ల ఎల్ఎల్‌బీ కోర్సుల‌కు నోటిఫికేష‌న్
మూడేళ్ల ఎల్ఎల్‌బీ కోర్సుల‌కు నోటిఫికేష‌న్

విశాఖ‌ప‌ట్నంలోని దామోదరం సంజీవ‌య్య నేష‌న‌ల్ లా యూనివ‌ర్శిటీ (డీఎస్ఎన్ఎల్‌యూ)లో మూడేళ్ల ఎల్ఎల్‌బీ కోర్సులకు నోటీఫికేష‌న్ విడుద‌ల అయింది. 2024-25 విద్యా సంవ‌త్సరానికి గానూ మూడేళ్ల ఎల్ఎల్‌బీ కోర్సుల‌కు డీఎస్ఎన్ఎల్‌యూ ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఆగ‌స్టు 15 తేదీలోపు ద‌ర‌ఖాస్తులు దాఖ‌లు చేసుకోవాల్సి ఉంటుంది.

డీఎస్ఎన్ఎల్‌యూ ప్ర‌వేశ ప‌రీక్ష (డీఈటీ) ఆగ‌స్టు 24న‌ ఉంటుంది. ఉద‌యం 11 గంట‌ల నుండి మధ్యాహ్నం 1 గంట (రెండు గంట‌ల‌) పాటు పరీక్ష ఉంటుంది. ఆగ‌స్టు 25న అడ్మిష‌న్స్, ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల ప‌రిశీల‌న ఉంటుంది. అభ్య‌ర్థులు డీఈటీలో అర్హ‌త సాధించాల్సి ఉంటుంది. అలాగే మూడేళ్ల ఎల్ఎల్‌బీ చేసేందుకు జ‌న‌ర‌ల్ కేట‌గిరీ అభ్య‌ర్థి 45 శాతం మార్కుల‌తో డిగ్రీ (10+2+3) పూర్తి చేసి ఉండాలి. బీసీ కేట‌గిరీ అభ్య‌ర్థులైతే 42 శాతం, ఎస్‌సీ, ఎస్‌టీ అభ్య‌ర్థులైతే 40 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణ‌లై ఉండాలి. ఒకవేళ అంత‌కంటే త‌క్క‌వ మార్కులు వ‌చ్చిన అభ్య‌ర్థి అయితే, అద‌న‌పు డిగ్రీ, పీజీల్లో ఆ మార్కులు, అంత‌కంటే ఎక్కువ మార్కులు రావాల్సి ఉంటుంది.

అప్లికేష‌న్ ఫీజులు

  • అప్లికేష‌న్ ఫీజు జ‌న‌ర‌ల్ కేట‌గిరీ (ఓసీ) అభ్య‌ర్థుల‌కు రూ.2,500 ఉంటుంది. అలాగే బీసీ అభ్య‌ర్థుల‌కు రూ.2,200, ఎస్‌సీ, ఎస్‌టీ అభ్య‌ర్థుల‌కు రూ.1,800 ఉంటుంది. ఈ ఫీజుల‌ను Bank Name: Union Bank of India, Account No: 283710100024089, Account Name: The Registrar, Damodaram Sanjivayya National Law University. IFS Code: UBIN0828378, MICR Code: 531026010కు చెల్లించాలి.
  • మూడేళ్ల ఎల్ఎల్‌బీ కోర్సులో 120 సీట్లు ఉంటాయి. అలాగే మ‌రో 18 అద‌న‌పు (12 ఈడ‌బ్ల్యూఎస్ కోటా సీట్లు, ఆరు కాశ్మీర్ పండిట్ల, కాశ్మీర్ హిందువుల‌ కోటా) సీట్లు ఉన్నాయి. మొత్తం 138 సీట్లు ఉన్నాయి.
  • ఏపీ స్టేట్ కోటాలో మొత్తం 66 సీట్లు ఉన్నాయి. అందులో 30 సీట్లు అన్ రిజ‌ర్డ్వ్‌, ఎస్‌సీ 9 (15 శాతం), ఎస్‌టీ 4 (6 శాతం), బీసీ 17 (29 శాతం), ఈడ‌బ్ల్యూఎస్ 6 (10 శాతం) సీట్లు కేటాయించారు. బీసీల్లో బీసీ-ఏ 4 (7 శాతం), బీసీ-బీ 6 (10 శాతం), బీసీ-సీ 1 (1 శాతం), బీసీ-డీ 4 (7 శాతం), బీసీ-ఈ 2 (4 శాతం) సీట్లు కేటాయించారు.
  • ఆలిండియా కోటాలో 54 సీట్లు ఉండ‌గా, అందులో 48 సీట్లు అన్ రిజర్డ్వ్, 6 సీట్లు ఈడ‌బ్ల్యూఎస్ కోటా కింద కేటాయించారు. 
  • ఎన్ఆర్ఐ కోటా కింద 12 సీట్లు ఉండ‌గా, అన్ని సీట్లు అన్ రిజ‌ర్డ్వ్ సీట్లే ఉన్నాయి. అలాగే కాశ్మీరీ పండిట్లు, కాశ్మీరీ మైగ్రేంట్స్‌, కాశ్మీరీ హిందువుల కోటా కింద 6 సీట్లు ఉన్నాయి. ఈ సీట్లు కూడా అన్ని అన్ రిజ‌ర్డ్వ్ కేట‌గిరీలోనే ఉన్నాయి.
  • అయితే ఈ రిజ‌ర్వేష‌న్ల‌లోనే దివ్యాంగు కోటా కింద 5 శాతం, సాయుధ ద‌ళాల కుటుంబాల‌కు సంబంధించిన పిల్ల‌ల‌కు 2 శాతం, ఎన్‌సీసీ అభ్య‌ర్థుల‌కు 1 శాతం, స్ఫోర్ట్స్ కేట‌గిరీ అభ్య‌ర్థుల‌కు 0.5 శాతం, మ‌హిళ‌ల‌కు 33.33 శాతం రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేస్తారు.
  • మూడేళ్ల ఎల్ఎల్‌బీ కోర్సుకు రూ.1,50,000 చెల్లించాల్సి ఉంటుంది. అందులో అడ్మిష‌న్ ఫీజు రూ.3,000 ఉంటుంది. ట్యూష‌న్ ఫీజు రూ.91,000, అకాడ‌మిక్ యాక్ట‌విటీస్ ఫీజు రూ.4,000, ఇంట‌ర్నెట్, జ‌ర్న‌ల్స్‌, లైబ్ర‌రీ ఫీజు రూ.10,000, ఎల‌క్ట్రిసిటీ ఛార్జ్‌స్ రూ.10,000, ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌, డ‌వ‌ల‌ప్‌మెంట్ ఫీజు రూ.10,000, స్ఫోర్ట్స్ అండ్ జీమ్ ఫీజు రూ.2,000, మోట్ కోర్టు ఫీజు రూ.3,000, పూర్వ విద్యార్థుల ఫీజు రూ.2,000, లైబ్ర‌రీ డిపాజిట్ (రిఫండ‌బుల్‌) ఫీజు రూ.5,000, క్యాంటిన్ సెక్యూరిటీ డిపాజిట్ (రిఫండ‌బుల్‌) రూ.10,000 ఉంటాయి. 
  • వీటికి అద‌నంగా హాస్ట‌ల్ వ‌స‌తి, మెస్ ఛార్జ్‌స్ రూ.46,000 చెల్లించాల్సి ఉంటుంది. ట్యూష‌న్ ఫీజు ప్ర‌తి విద్యా సంవ‌త్స‌రంలో 10 శాతం పెరుగుతుంది. ఎన్ఆర్ఐ విద్యార్థులకు ఫీజు ఏడాదికి రూ.3,00,000 ఉంటుంది. అలాగే ఈ విద్యార్థుల‌కు కౌన్సిలింగ్ విడిగా నిర్వ‌హిస్తారు.
  • ప్ర‌వేశ ప‌రీక్ష (డీఈటీ) కేంద్రాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విశాఖ‌ప‌ట్నం క్యాంప‌స్, విజ‌య‌వాడ‌, తిరుప‌తి, గుంటూరు, తెలంగాణ‌లో హైద‌రాబాద్‌లో ఉన్నాయి. మ‌రో ఎనిమిది కేంద్రాలు న్యూఢిల్లీ, త‌మిళ‌నాడులో చెన్నై, కేర‌ళ‌లోని కొచ్చి, క‌ర్ణాట‌క‌లోని బెంగ‌ళూర్‌, ఒరిస్సాలోని భూవ‌నేశ్వ‌ర్‌, బీహార్‌లోని పాట్నా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌క్నో, ప‌శ్చిమ బెంగాల్‌లోని క‌ల‌క‌త్తాలో ఉన్నాయి. ప్ర‌శ్న ప‌త్రం 100 మార్కుల‌కు ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంలోనే ఉండే ప్ర‌శ్న‌ప‌త్రంలో వంద ప్ర‌శ్న‌లు ఉంటాయి. ఒక్కో ప్ర‌శ్న‌కు ఒక్కో మార్కుగా నిర్ణ‌యించారు.
  • అద‌న‌పు స‌మాచారం కోస యూనివ‌ర్శిటీ అధికారిక వెబ్‌సైట్ https://dsnlu.ac.in/ సంప్ర‌దించాలి. 
  • ఫోన్ నెంబ‌ర్‌ను 9704318639 ను కూడా సంప్ర‌దించొచ్చు. ఉద‌యం 10 గంట‌ల నుండి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు అడ్మిష‌న్ సంబంధిత స‌మాచారం కోసం ఫోన్ నెంబ‌ర్‌: 08924-248217, ఈ మెయిల్ ఐడీ: admissions@dsnlu.ac.in సంప్ర‌దించాలి. 

రిపోర్టింగ్ - జ‌గ‌దీశ్వ‌రరావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.