AP Heat Wave Updates: నిప్పుల కొలిమిలా ఆంధ్రప్రదేశ్‌, నేడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులు.. ప్రజలకు అలర్ట్-andhra pradesh is like a furnace of fire hailstorms across the state today too alert to the people ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Heat Wave Updates: నిప్పుల కొలిమిలా ఆంధ్రప్రదేశ్‌, నేడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులు.. ప్రజలకు అలర్ట్

AP Heat Wave Updates: నిప్పుల కొలిమిలా ఆంధ్రప్రదేశ్‌, నేడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులు.. ప్రజలకు అలర్ట్

Sarath chandra.B HT Telugu
Apr 08, 2024 06:15 AM IST

AP Heat Wave Updates: ఆంధ్రప్రదేశ్‌లో భానుడు భగభగలాడుతున్నాడు. ఆదివారం ఏపీ నిప్పుల కుంపటిని తలిపించింది. ఏప్రిల్ మొదటి వారంలోనే చండ్ర నిప్పులు కురుస్తుండటంతో జనం అల్లాడిపోతున్నారు.

నిప్పుల కొలిమిలా ఆంధ్రప్రదేశ్
నిప్పుల కొలిమిలా ఆంధ్రప్రదేశ్ (unsplash.com)

AP Heat Wave Updates: సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, కూనవరం మండలాల్లో తీవ్రవడగాల్పులు, 93 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అలాగే ఎల్లుండి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో తీవ్ర వడగాల్పు అలాగే 27 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ SDMA ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆదివారం ఆంధ్రప్రదేశ్‌లోని 670మండలాల్లో 107 మండలాల్లో Severe heat Waves తీవ్రమైన వడగాల్పులు ఉక్కిరిబిక్కిరి చేశాయి. 235 మడంలాల్లో వేడిగాలులతో జనం అల్లాడిపోయారు. 328 మండలాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు temperature నమోదు అయ్యాయి.

సోవవారం 2 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు, 93 మండలాల్లో వడగాల్పులు, 575 మండలాల్లో సాధారణ ఉష్ణోగ్రత్లు నమోదవుతాయని విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొంది. మంగళవారం కూడా సాధారణ ఉష్ణోగ్రతలను అంచనా వేస్తున్నారు.

40డిగ్రీల్లోపు ఉష్ణోగ్రతలను సాధారణ ఉష్ణోగ్రతలుగా ఐఎండి పరిగణిస్తుంది. 40డిగ్రీల కంటే 7డిగ్రీలు అధికంగా నమోదైతే తీవ్రమైన వడగాలులుగా గుర్తిస్తారు. సాధారణ ఉష్ణోగ్రత కంటే 5.5 డిగ్రీల నుంచి 6.9డిగ్రీల అదనంగా నమోదైతే అధిక ఉష్ణోగ్రతగా పరిగణిస్తారు.

ఆదివారం అధిక ఉష్ణోగ్రతలు నమోదైన మండలాల్లో అల్లూరి జిల్లాలో 2, అనకాపల్లిలో 12, అన్నమయ్యలో 2, బాపట్లలో 3, చిత్తూరులో 2, కాకినాడలో 4, కోనసీమలో 2, పల్నాడులో 8, ఎన్టీఆర్‌ జిల్లాలో 12, నెల్లూరులో 21, సత్యసాయి జిల్లాలో 11, తిరుపతిలో 17, విశాఖలో 2, విజయనగరంలో 6, పశ్చిమ గోదవరిలో 2, కడపలో 16మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు నమోదయ్యాయి.

అధిక ఉష్ణోగ్రతలు నమోదైన మండలాల్లో అల్లూరిలో 6, అనకాపల్లిలో 3, అనంతపురంలో 6, అన్నమయ్యలో 12, బాపట్లలో 9, చిత్తూరులో 11, తూర్పులో 7, ఏలూరులో 8, గుంటేూరులో 7, కాకినాడలో7, కోనసీమలో 6, కృష్ణాలో 9, కర్నూలులో 2, నంద్యాలలో 7, ఎన్టీఆర్‌లో 8, పల్నాడులో 16, పార్వతీపురంలో 8, ప్రకాశంలో 16, శ్రీకాకుళంలో 12, నెల్లూరులో 21, సత్యసాయిలో 11, తిరుపతిలో 17, విశాకలో 2, విజయనగరంలో 6, పశ్చిమలో 2, కడపలో 16 మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

నేడు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(93)

శ్రీకాకుళం6 , విజయనగరం20, పార్వతీపురంమన్యం8, అల్లూరిసీతారామరాజు 8, అనకాపల్లి11, కాకినాడ6, కోనసీమ4, ఏలూరు4, ఎన్టీఆర్ 2, గుంటూరు7, పల్నాడు2, తూర్పుగోదావరిలో 15 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది.

ఆదివారం నంద్యాల జిల్లా చాగలమర్రి, నెల్లూరు జిల్లా కలిగిరిలో 45.8°C, వైయస్సార్ జిల్లా ఖాజీపేట,సింహాద్రిపురంలో 45.6°C, బాపట్ల జిల్లా జనకవరం పంగులూరులో 45.5°C, కర్నూలు జిల్లా ఆలూరు, ప్రకాశం జిల్లా బోట్లగూడూరులో 45.4°C, పల్నాడు జిల్లా విజయపురి లో 45.2°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే 107 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 235 మండలాల్లో వడగాల్పులు వీచాయి.

ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలి, వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం